breaking news
in darmavaram
-
గౌరీశంకరుల వార్షికోత్సవం ప్రారంభం
ధర్మవరం (ప్రత్తిపాడు) : గ్రామంలో శ్రీ గౌరీశంకరుల 80వ వార్షిక మహోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. జువ్వలవారి వీధిలో నాటక మహోత్సవాలను సొసైటీ అధ్యక్షుడు జువ్వల చినబాబు ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాౖటెన సభలో కళాకారులు దొడ్డిపట్ల సోమన్నదొర, సానా నూకరాజు నాయుడు, ౖవైఎస్సార్‌సీపీ నాయకుడు పుణ్యమంతు ల కామరాజు, కోనేటి రాజబాబు, సొసైటీ డైరెక్టర్ జువ్వల దొరబాబు, మాజీ వైస్ ఎంపీపీ బొల్లు కొండబాబు తదితరులు మా ట్లాడుతూ 80 ఏళ్లుగా గ్రామంలో నాటక ప్రదర్శనలు చేస్తున్న ఉత్సవ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో కోలా తాతబాబు, మచ్చెర్ల దాసు, సిద్దా అప్పలరాజు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటికలు తొలిరోజు రాత్రి నంది నాటకోత్సవాలలో ప్రదర్శనకు ఎంపికైన ‘కృషి’ నాటికను ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించారు. చదువు పరామార్ధాన్ని ఈ నాటిక చాటిచెప్పింది. ఈ నాటికలో అమరాధి శ్రీరమ్య, సఖిలేటి స్వామి, ఐతి సువర్ణ కీర్తి, మేకల కోటేశ్వర అభిరామ్, పెదిరెడ్డి రాజా, నల్లా నూకరాజు నటన ఆకట్టుకుంది. స్నేహా ఆర్ట్స్, చంద్రమాంపల్లి వారిచే ‘నమో నమః,’ పురోహితిక నాటక కళా పరిషత్ వారిచే ‘మాతృత్వం’ సాంఘిక నాటికలను ప్రదర్శించారు. రంజింపజేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ శనివారం రాత్రి ప్రదర్శించిన శ్రీరామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. వీఎస్‌ఎ¯ŒS రాజు (మీసాల రాజు), ఆవాల గన్నిబాబు, శవనగాని శ్రీనివాస్, సాగి రవివర్మ, దాట్ల రంగరాజు, కొండపల్లి సింగన్న, గ్రామస్తుల సహకారంతో గౌరీ శంకర ఉత్సవ కమిటి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. శ్రీరాముడుగా శ్రీనివాస్, 1వ ఆంజనేయ పాత్రలో నాగూర్‌బాబు (ధర్మవరం), 2వ ఆంజనేయునిగా బెండపూడి రామారావు పోటీ పడి నటించారు. మిగిలిన వారు పాత్రోచితంగా నటించారు. ఈనాటకానికి హార్మోనియంతో కలిగట్ల రమణ సహకారం అందించారు. గ్రామానికి చెందిన కళాకారుడు దొడ్డిపట్ల జగ్గారావు ‘దుర్యోధన’ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. -
ధర్మవరంలో చోరీ
రూ.2 లక్షల నగదు, బంగారం, వెండి నగలు దోపిడీ ఇంటిని పరిశీలించిన పోలీసుఅధికారులు ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో చోరీ జరిగిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లి శుక్రవారం రాత్రి స్వగ్రామం వచ్చారు. తాళం తెరిచి, ఇంటిలో ప్రవేశించిన వారు చోరీ జరిగిన సంగతిని గుర్తించారు. ధర్మవరం గ్రామానికి చెందిన ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు పాఠశాలకు దసరా సెలవుల కారణంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి ఇంటి వచ్చారు. ఇంటి ప్రధాన గేటు తాళం తీసుకుని, ఇంటిలోకి ప్రవేశించగా, పడక గది తాళం బద్దలకొట్టి ఉండడం, బీరువా తలుపులు తెరిచి ఉండడంతో 100 నంబర్‌కు ఫిర్యాదు చేశానని చిన్నారావు విలేకరులకు తెలిపారు. అగంతకులు ప్రధాన ద్వారం పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్‌ను తొలగించి, లోనికి చొరబడి, రూ.2 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువ చేసే 9.5 కాసుల బంగారు నగలు, 50 తులాల వెండి వస్తువులతోపాటు కెమెరా, వాచీ, సెల్‌ఫోన్ చోరీకి గురయ్యినట్టు గమనించారు. ఈ మేరకు దాడి చిన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ, ఎస్సై ఎం.నాగదుర్గారావు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.