breaking news
Dane van Niekerk
-
రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో డేన్ ఇలా రాసుకొచ్చింది.రిటైర్మెంట్ ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చాలా మిస్ అయ్యాను. మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే, నా సర్వస్వం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.కాగా, డేన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డేన్ 2023లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పింది. నాటి టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో డేన్ అప్పట్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంది.ఫిట్నెస్ లేకపోవడం, తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు డేన్ను ఎంపిక చేయలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించింది. డేన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత సూన్ లస్ కెప్టెన్‌గా ఎంపికై, ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది.ప్రస్తుతం 32వ పడిలో ఉన్న డేన్ సౌతాఫ్రికా తరఫున మొత్తం 194 మ్యాచ్‌లు (107 వన్డేలు, 86 టీ20లు, ఓ టెస్ట్) ఆడింది. ఇందులో 4074 పరుగులు చేసి, 204 వికెట్లు తీసింది. డేన్ సౌతాఫ్రికాకు 50 వన్డేల్లో, 30 టీ20ల్లో సారథ్యం వహించింది. ఇందులో 29 వన్డేలు, 15 టీ20ల్లో జట్టును విజయవంతంగా నడిపించింది.సౌతాఫ్రికా జట్టులో కీలక సభ్యురాలిగా ఉండిన డేన్ కోవిడ్ సమయంలో గాయాల బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.2022 వన్డే ప్రపంచకప్ సమయంలో ఆమె మడమ గాయానికి గురై టోర్నీ మొత్తానికి దూరమైంది. అప్పటి నుంచి తరుచూ గాయాలతో ఇబ్బంది పడిన డేన్.. జట్టులో క్రమంగా ఉనికి కోల్పోయింది.ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ విషయంలో తొందరపడ్డానని పశ్చాత్తాపడుతూ సెలెక్టర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా సెలెక్టర్లకు క్షమాపణ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. -
దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదని?
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్‌కు సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఫిట్నెస్ టెస్టులో విఫలమవకావడంతో వాన్ నీకెర్క్‌ను మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆమె స్థానంలో ఆల్‌రౌండర్ సునే లూస్‌ను తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ముందు వాన్ నీకెర్క్ కుడి కాలికి గాయమైంది. దీంతో ఆమె వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమైంది. అనంతరం ఆమె జట్టుకు దూరంగా ఉంటుంది. క్రికెట్ సౌతాఫ్రికా న్యూ రూల్స్ ఇవే.. క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్నెస్ రూల్స్ ప్రకారం.. మహిళా జట్టుకు ఎంపిక కావాలంటే క్రికెటర్లు కచ్ఛితంగా 9.3 నిమిషాల్లో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. అయితే వాన్ నీకెర్క్ మాత్రం మరో 30 సెకన్లు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలక్టర్లు ఆమెను పక్కనపెట్టారు. టీ20ల్లో అద్భుత రికార్డు.. టీ20ల్లో వాన్ నీకెర్క్‌కు మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో వాన్ నీకెర్క్ 1877 పరుగులతో పాటు 65 వికెట్లు కూడా పడగొట్టింది. అంతేకాకుండా టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ కూడా వాన్ నీకెర్కే కావడం విశేషం. గతేడాది కేప్‌తో స్వలింగ వివాహం వాన్ నీకెర్క్ గతేడాది తన సహచర క్రికెటర్ మరిజాన్నే కేప్‌ని స్వలింగ వివాహం చేసుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన జట్టులో కేప్‌కు మాత్రం చోటు దక్కింది. టీ20ల్లో సౌతాఫ్రికా తరుపున హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా కేప్ ఉంది. ఇక ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న జరగనున్న దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: అన్నరీ డెర్క్సెన్, సునే లూస్ (కెప్టెన్), మారిజాన్ కాప్, లారా గూడాల్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, తజ్మిన్ బ్రిట్స్, మసాబాటా క్లాస్, లారా వోల్వార్డ్ట్, సినాలో జాఫ్తా, నాన్కులులేకో మ్లాబా చదవండి: Shubman Gill: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! Your heroines for the ICC Women's #T20WorldCup 🇿🇦 #MyHero #AlwaysRising #BePartofIt pic.twitter.com/MUVZNtVQ1k — Proteas Women (@ProteasWomenCSA) January 31, 2023