breaking news
danavaipeta
-
85 రోజులుగా నరకాన్ని చూస్తున్నాం
-
85 రోజులుగా నరకాన్ని చూస్తున్నాం
వైఎస్ జగన్ వద్ద దివీస్ బాధితుల ఆవేదన సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘మంచినీరు ఇస్తున్నట్టు మభ్యపెట్టి ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటామంటున్నారు. 85 రోజులుగా పోలీసులతో మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు సర్వనాశనమవుతాయి. పొలాలు తీసుకుంటే మేమెక్కడి పోవాలి. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీ పెట్టనీయం. మీ అండ మాకు కావాలి’’ అంటూ దివీస్ ప్రతిపాదిత గ్రామ ప్రజలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వద్ద తమ కష్ట, నష్టాలు చెప్పుకొన్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ ప్రతిపాదిత గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన విచ్చేశారు. ఈ సభలో బాధితులు తమ ఇబ్బందులను వైఎస్ జగన్‌కు ఇలా వివరించారు. మంచినీరు కుళాయిలు పెట్టి మభ్యపెట్టారు ఈ మండలంలో 50 గ్రామాలు ఫ్యాక్టరీకి అతి దగ్గరలోనే ఉన్నాయి. మేమంతా సన్న, చిన్నకారు రైతులం. ఎన్టీఆర్ పేరుమీద మంచినీటి కుళాయిలు పెట్టి... ఆ తర్వాత ఫ్యాక్టరీ బోర్డులు పెట్టాక తెలిసింది. ఎండాకాలంలో కూడా ఇక్కడ తీరంలో మంచి వాతావరణం ఉంటుంది. ఇదంతా పాడవుతుందని ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే మాపై కేసులు పెట్టారు. పిఠాపురం సీఐ ఆడపిల్లలని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు. – మట్ల ముసలయ్య, రైతు, పంపాదిపేట ప్రాణాలు పోయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటాం దివీస్‌కు వ్యతిరేకంగా 82 రోజులుగా పోరాడుతున్నాం. 144 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారండి. మాకు ఎమ్మెల్యేగారు అండగా ఉన్నారు. వామపక్షాల వాళ్లు, ఐద్వా వాళ్లు మాకు మద్దతుగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారండి. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటారంట. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుంటాం. – మంగులూరి సుశీల, కొత్తపాకల మహిళలపై కేసులు పెట్టి వేధిస్తున్నారండి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా పొలాలు లాగేసుకున్నారండి. ఎకరానికి ఐదు లక్షలిస్తామంటున్నారండి. ఐదు లక్షలతో మా పిల్లల్ని ఎలా పెంచాలండి? ఫ్యాక్టరీ వల్ల మా సంతానానికి సంతానం పుట్టరండి. పొలం, డబ్బు లేకపోతే మళ్లీ సంపాయించుకోవచ్చు. సంతానం లేకపోతే ఎలా తెచ్చుకోగలమండి? మాకు ఏమీ వద్దండి. మా సంతతి సంతతిని కాపాడాలని కోరుతున్నామండి. – అంజాలపు రామకృష్ణవేణి, పంపాదిపేట ఎన్నికల ముందు ఏరువాక చేసి భూములిస్తామన్నడు నేను ఎకరం రైతునన్న. ఎన్నికల ముందు చంద్రబాబు ఇక్కడే ఏరువాక చేసి, మీ భూమి మీకిచ్చేస్తామన్నారు. ఎకరం రూ. 50 లక్షల విలువ చేసే భూములు వైఎస్ మూడు లక్షలకే తీసుకెళ్లి వాళ్ల కొడుకుకు కట్టబెడుతున్నారంటూ అబద్ధాలు చెప్పి ఎన్నికల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు వచ్చి మా పొలాలు లాగేసుకుంటున్నాడన్నా. పొద్దున సుప్రభాతం బదులు పోలీసుల సైర¯ŒS వింటున్నామన్నా. మాకు దీని నుంచి విముక్తి కల్పించన్నా. – బుచ్చిబాబు, పంపాదిపేట యనమల పట్టించుకోవడంలేదు నేను హెచరీస్ ఉద్యోగిని సారు. ఏడో తరగతి చదివాను. నెలకు ఎనిమిదివేలు జీతం వస్తుంది సారు. అక్షరం ముక్కలేని వాడుకు కూడా 20 వేలు కూడా వస్తుంది సారు. ప్రతి హెచరీలో 100 మంది పని చేస్తారు. నాకు ఎకరం పొలం ఉంది. 144 సెక్షన్ పెట్టడంతో చాలా దారుణంగా ఉంది సారు. ఇక్కడ 30 ఏళ్లు పాలించిన యనమల రామకృష్ణుడు మేము ఎలా ఉన్నామో కూడా చూడలేదు. – యనమల శ్రీను, తాటాకుల పాలెం ఇదంతా యనమల చేయించారండి కనీసం మాట్లాడుకోనీయకుండా పోలీసులు వేధిస్తున్నారండి. బయటూరోళ్లను తీసుకొచ్చి మీటింగ్‌లు పెట్టి వారితో ఫ్యాక్టరీ కావాలని చెప్పించారండి. ఇదంతా యనమల రామకృష్ణుడు చేయించారండి. ఓ రోజు పోలీసులు వచ్చి నువ్వు సీఐ మీద తిరగబడ్డావంటూ జాకెట్ చించేసి జీపు దగ్గరకు తీసుకెళ్లారండి. నన్ను, మా ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారండి. – బండ్లి మంగ, కొత్తపాకల భూములు తీసుకుని చెక్కులు వేస్తామంటున్నారండి ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నట్లు తెలపకుండానే మా భూములు తీసుకుంటామని, చెక్కులు మా అకౌంట్లో వేస్తామని కలెక్టర్‌గారు చెబుతున్నారండి. తుని సీఐ ఓ రౌడీలా ప్రవర్తిస్తున్నారండి. మాకు గాయాలైతే ఎమ్మెల్యే రాజా గారు అన్నవరం ఆస్పత్రిలో కట్లు కట్టిస్తుంటే యనమల కృష్ణుడు గుండాలతో కొట్టించాడండి. మా అమ్మకు చేయి విరిగింది. – అంగులూరి శ్రీను, కొత్తపాకల పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారు దివీస్‌కు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాడుతుంటే అధికారపార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి సహాయంతో పోరాటం చేస్తున్నాం. కలెక్టర్‌గారు దారుణంగా వ్యవహరిస్తున్నారండి. మేము వినతిపత్రం ఇస్తే ఫ్యాక్టరీ నిర్మించడానికి వారికి అనుమతి ఇచ్చేశామని చెబుతున్నారు. -అరుణ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ -
20వేల మంది రోడ్డున పడుతున్నా...
-
సర్కారే కాటేస్తోంది!
13 గ్రామాలు, 25 వేల జనాభాకు తీవ్ర నష్టం బాధితులతో నేడు వైఎస్ జగన్ ముఖాముఖి సాక్షి ప్రతినిధి, కాకినాడ: దివీస్ రసాయనాల పరిశ్రమ వల్ల 13 గ్రామాల్లో 25 వేల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఆ పరిశ్రమకు కొమ్ముకాస్తుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగిసిపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలోని తొండంగి మండలం దానవాయిపేట వద్ద దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమను స్థాపిస్తున్నారు. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 20 వేల మంది రోడ్డున పడుతున్నా.. ఏటా రూ.16 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం నష్టపోతున్నా, గాలికొదిలేసిన సర్కారు.. స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. తీర ప్రాంతంలో సరుగుడు, జీడిమామిడి సాగు చేసేందుకు పేద రైతులకు పట్టాలుగా ఇచ్చిన దాదాపు 505 ఎకరాల భూమిని దివీస్ రసాయనాల పరిశ్రమ కోసం ప్రభుత్వం కేటాయించింది. భూ సేకరణ చట్టాన్ని సైతం ఉల్లంఘించి రూ.35 లక్షలకు పైబడి ఉన్న మార్కెట్ ధరను పక్కన పెట్టి, కేవలం రూ.5 లక్షలు రైతులకు పరిహారంగా ఇచ్చి పేదల పొట్టకొడుతోంది. ఎస్ఈజెడ్ పేరుతో సేకరించిన పదివేల ఎకరాల్లో సింహభాగం ఇప్పటికీ అదే ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్నా దానిని పక్కన పెట్టి కొత్తగా అతితక్కువ ధరకు భూములను సేకరించిన తీరుతోనే వివాదం రాజుకుంది. హేచరీల మనుగడ ప్రశ్నార్థకం... దివీస్ పరిశ్రమ వల్ల ఓ వైపు రైతాంగం తీవ్రంగా నష్టపోతే అదే ప్రాంతంలో దాదాపు 250కి పైగా ఉన్న హేచరీల మనుగడ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఆక్వా జోన్‌గా ఉన్న ఈ ప్రాంతంలో దివీస్ వల్ల సముద్ర జలాలు కలుషితమై హేచరీలు మూతపడే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. దేశంలోని ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలతోపాటు ఇతర జిల్లాలకు కూడా 60 శాతం రొయ్య పిల్లలు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్న పరిస్థితుల్లో దివీస్ వల్ల ఇక ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బేనంటున్నారు. మరో వైపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 ఏళ్లుగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. రసాయనాలతో ముప్పు దివీస్ పరిశ్రమకు వినియోగించే అనేక రకాల రసాయనాలు, వాటి ద్వారా వచ్చే వ్యర్థాలు, విడుదలయ్యే విషవాయువుల వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి కాలుష్యం వల్ల తీర గ్రామాల్లోని 10 వేల మందికిపైగా మత్స్యకారులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ కారణంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిన ముప్పు ముంచుకొస్తోంది. ఎగిసిపడ్డ ఉద్యమం.. దివీస్ పరిశ్రమ వల్ల ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్‌తోపాటు వామపక్ష పార్టీల ఆందోళనతో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం ఆందోళనకారులపై విరుచుకు పడుతోంది. ప్రజలకు భరోసాగా నిలిచిన నాయకులపై కేసులు పెట్టి, లాఠీలు ఝుళిపిస్తూ ఉక్కుపాదం మోపుతోంది. దాదాపు 80 రోజులుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజల గొంతునొక్కి.. పోలీసులు, ప్రైవేటు సైన్యం సహాయంతో కర్కశంగా వ్యవహరిస్తున్నా బాధితులు మాత్రం మొక్కవోని దీక్షతో కదంతొక్కుతున్నారు. బాధిత గ్రామాల్లో 4 వేల మం దికి పైగా పోలీసులు మోహరించి అన్ని రోడ్లలో చెక్ పోస్టు లు ఏర్పాటు చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు అనేక మం ది వామపక్షాల నేతలు ప్రజల పక్షాన నిలబడి పోలీసుల దౌర్జన్యాలను, ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాపై 307తోపాటు 22 కేసులు నమోదు చేసింది. ఈ దివీస్ పరిశ్రమ వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఉండడం వల్లే ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు దానవాయిపేటలో వైఎస్ జగన్ పర్యటన సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం సందర్శించనున్నారు. దివీస్ పరిశ్రమ స్థాపన వల్ల నష్టపోనున్న బాధిత ప్రజలతో మధ్యాహ్నం తర్వాత ముఖాముఖి మాట్లాడతారని, బహిరంగ సభలో వారినుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వేలాది మంది కడుపుకొట్టే అభివృద్ధి ఎందుకు? ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజం తొండంగి: ఆక్వా కల్చర్ ద్వారా అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం లభించడానికి కారణమైన తీర ప్రాంత రైతులు, పరిసర గ్రామాల ప్రజలకు నష్టం చేకూర్చే కాలుష్య కంపెనీలతో చేసే అభివృద్ధి ఎందుకని వైఎస్సార్సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఆక్వా హేచరీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సీఏఏ ప్రమాణాలకు అనుగుణంగా హేచరీల ద్వారా 60 శాతం నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ఇలాంటి చోట కాలుష్య దివీస్ పరిశ్రమను పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచక పరిస్ధితులను సృష్టిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ దత్తత తీసుకున్న దానవాయిపేట పంచాయతీలో చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ఫండ్ ఇచ్చిన కాంట్రాక్టర్లకు రూ.300 కోట్ల విలువైన భూమిని పాతిక కోట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తీరంలో పోలీసుల దమనకాండకు అంతు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఉద్యమానికి మద్దతు పలికిన వివిధ పార్టీల నేతలను పోలీసులు బూటుకాళ్లతో తన్నిస్తున్నారన్నారు. తాము అభివృద్ధికి అడ్డుపడమని, ప్రజలకు నష్టం చేకూర్చే కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకమన్నారు. -
జనగర్జన