breaking news
Dameracherla
-
నీళ్ల బకెట్లో పడి బాలుని మృతి
దామరచర్ల (నల్గొండ జిల్లా): నీళ్ల బకెట్ లో పడి చిన్నారి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రాపోలులో ఆదివారం చోటుచేసుకుంది. కొండ్రాపోలు బాండవ తండాకు చెందిన హుసేన్,సునీత దంపతుల 11 నెలల కుమారుడు ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృతిచెందాడు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇంటి బయట ఉన్న బకెట్లో పడిపోయాడు. చిన్నారి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
వడగళ్ల వానతో పులకించిన ప్రజలు
దామరచర్ల : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. సాయంత్రం 4 గంటల తర్వాత మొదలైన వర్షం అరగంట పాటు అలాగే కురవడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమైంది. చుక్కనీరు లేక తాగునీటికి కటకటలాడుతున్న సమయంలో వర్షం పడడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.