breaking news
Dairy Cows
-
వేడి ఒత్తిడి నివారణ ఎలా?
పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. → ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. → రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.వేడిమి భారం సూత్రంశరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.మేత నిర్వహణ:→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. → అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. → పచ్చిమేత/ సైలేజ్ ఇవ్వాలి. → ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.→ ప్రొ బయోటిక్స్– ఎంజైమ్‌లు ఇవ్వాలి.చల్లపూటే పనులు→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.పర్యవేక్షణ:→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.అత్యవసర ప్రణాళికలు:→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. → అత్యవసరమైన వైద్య సహాయం అందించండిగాలి ప్రసరణ – శీతలీకరణ→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.→ పశువుల శాల లేదా షెడ్లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. → పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. → తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. → షెడ్లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.షెడ్డు నిర్వహణ→ పశువులకు షెడ్‌కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్ నెట్‌ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. → షెడ్ పైకప్పుపై తెల్లని పెయింట్ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. → షెడ్ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. నీటి నిర్వహణ→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. → 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. → వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. → గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఆవు కంటికి క్యాన్సర్... శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
పెద్దతిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరుకు చెందిన బుడ్డాబాబు అనే రైతుకు చెందిన పాడి ఆవు కంటికి క్యాన్సర్ సోకడంతో పశువైద్య నిపుణులు గురువారం శస్త్రచికిత్స చేశారు. తన ఆవుకు మూడు నెలల కిందట కంటి భాగంలో గాయం కావడంతో స్థానిక పశు వైద్యశాలలో బుడ్డా బాబు పరీక్షలు చేయించాడు. కంటికి గ్రోత్ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్ రమేష్ నిర్ధారించారు. ఆ తర్వాత ఆవు కంట్లోని గాయం గడ్డలా మారి చూపు పూర్తిగా మందగించింది. క్యాన్సర్ మెదడుకు సోకకుండా ఉండేందుకు డాక్టర్ రమేష్ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దమండ్యం మండలంలో పని చేసే వెటర్నరీ డాక్టర్ విక్రంరెడ్డి, మదనపల్లిలో పని చేస్తున్న ట్రైనీ డాక్టర్ లోకేష్‌లతో కలిసి ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలోని క్యాన్సర్ కణజాలాన్ని తొలగించారు. -
25 రైతు కుటుంబాలకు పాడి ఆవులు
పెరంబూర్: నృత్యదర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ ఎందరో అనాథ బాలలను ఆదుకుంటూ వారికి విద్య, వైద్య సాయం చేస్తున్న విషయం తెలిసిందే. తన ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లారెన్స్ తాజాగా కరువు కాటకాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకోవడానికి నడుం బిగించారు. అందులో భాగంగా తొలి దశగా ఈరోడ్డులో 25 రైతు కుటుంబాలకు తలా రెండు పాడి ఆవులు చొప్పున ఉచితంగా అందించడంతో ఆర్థిక సాయాన్ని అందించారు.ఈరోడ్డు రైతుల సంఘం అధ్యక్షుడు కాశీయప్పన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లారెన్స్ పాడి ఆవులను అందించారు. ఆయన మాట్లాడుతూ తనకు ప్రత్యక్ష దైవం తన తల్లేనన్నారు.ఆ తరువాత తన అభిమానులు, రైతులను దైవంగా భావిస్తానన్నారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల పరిస్థితి తనను కలచివేసిందన్నారు. మరణించిన రైతు కుటుంబానికి రూ.3 లక్షలు అందించానని తెలిపారు.ఈ డబ్బు తనకు అభిమానులు ఇచ్చిందేనన్నారు.దాన్ని రైతు కుటుంబాలకు సాయం చేయాలని భావించానన్నారు. నాకు రాజకీయాలు తెలియవు తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల తెలియని విషయానికి వెళ్లనని అన్నారు.అయితే తనకు ధర్మం చేయడం తెలుసన్నారు.రైతులు వ్యవసాయం కోసం భార్యాల పుస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీర్చలేక సతమతమవుతున్నారన్నారు.వారిని ఆదుకునే విధంగా మొదటి దశగా ఇద్దరు భ్యాంకు రుణాలను తీర్చానని వారి తాళి పుస్తులను విడిపించానని తెలిపారు.తాను నటించిన మొట్టశివ కెట్టశివ చిత్ర పారితోషికం కోటి రూపాయలను యువకులకు సాయపడేలా ఆనంద వికటన్ ట్రస్ట్ ద్వారా అందించానని, తదుపరి విడుదల కానున్న శివలింగ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని తానే నేరుగా రైతులకు సాయం చేస్తానని తెలిపారు.తాను నాయకుడవ్వాలని కోరుకోవడం లేదని, అలా అయితే గర్వం తలకెక్కుతుందని, అందువల్ల కార్యకర్తగానే ఉండి స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తానని అన్నారు. తమిళులకు సూపర్‌స్టార్ ఒక్కరే తనను స్టంట్ మాస్టర్ సూపర్స్బురాజయన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీరంగానికి తీసుకొచ్చారని తెలిపారు. తమిళులు నివశించే అన్ని ప్రాంతాల్లోనూ సూపర్‌స్టార్ ఒక్కరే అని, అది రజనీకాంత్ మాత్రమేనని లారెన్స్ పేర్కొన్నారు.


