breaking news
Cyber harassment
-
‘ప్రొఫైల్ ’ నకిలీ.. ‘సైబర్’ మకిలి
నకిలీ ప్రొఫైల్, సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్.. తీరు ఏదైనా సైబర్ నేరాల సంఖ్య భారత్‌లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్‌కు పెద్ద ఎత్తున మళ్లుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం.. సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్ లైన్ ఖాతాలు తెరిచి చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతర వ్యక్తులు, బ్రాండ్, సంస్థలా కనిపించడానికి నకిలీ ఆన్ లైన్ ఖాతా తెరిచి చేస్తున్న మోసాలు దేశంలో అధికంగా ఉంటున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వివరాలను ఉపయోగించి సైబర్ నేరస్తులు ఇతరులను మోసం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn) ద్వారా 39,846 నమోదయ్యాయి. నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సీఆర్పీ వేదిక ద్వారా సైబర్ వేధింపుల ఫిర్యాదులు మూడున్నర రెట్లు పెరిగి 39,077కు చేరాయి. ప్రొఫైల్ హ్యాకింగ్, గుర్తింపు చోరీ ఘటనలు మూడింతలకుపైగా అధికమై 38,295కు పెరిగాయి. ఆన్ లైన్ జాబ్, మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.కేసులు ఎన్నోరెట్లు..అధికారిక లెక్కల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు మూడింతలయ్యాయి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య రెండింతలకుపైగా పెరిగి గత ఏడాది 48,475కు చేరాయి. సైబర్ నేరస్తులు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వారు ఉపయోగించిన ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లను బట్టి తెలుస్తోంది. సైబర్ క్రిమినల్స్ చాలా సందర్భాల్లో తప్పుడు లొకేషన్ , గుర్తింపుతో తప్పుదోవ పట్టిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు గుర్తించాయి.కేటాయింపులు మూడింతలు..పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి సురక్షిత సైబర్‌స్పేస్‌ను నిర్మించడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ (ఎన్ సీఎస్పీ)ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే దేశంలోని సైబర్‌స్పేస్‌ను జల్లెడ పట్టేందుకు, సైబర్ భద్రతా ముప్పులను గుర్తించడానికి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్ సీసీసీ) ఏర్పాటు చేసింది. డేటా సంరక్షణ కోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం–2023 తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులు 5 ఏళ్లలో మూడింతలకుపైగా పెరగడం గమనార్హం. -
బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: జోగిని శ్యామలగా ప్రాచుర్యం పొందిన శ్యామలా దేవికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. తనకు భక్తురాలిగా పరిచయమైన పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సోమవారం శ్యామల సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన శ్యామల నగరంలో బోనాల సందర్భంలో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటారు. బోనాలు సమర్పించే సమయంలో అనేక మంది భక్తులు ఆమె వెంట ఉంటారు. పాతబస్తీకి చెందిన మౌనిక యాదవ్ సైతం ఇలానే శ్యామలకు పరిచయమయ్యింది. కొన్నాళ్ల క్రితం ఓ అంశానికి సంబంధించి ఇద్దరి మధ్యా స్పర్థలు వచ్చాయి. తనను వేధించిన వ్యక్తికి శ్యామల మద్దతు ఇస్తున్నారనేది మౌనిక ఆరోపణ. దీంతో కక్షకట్టిన ఆమె ఓ సందర్భంలో శ్యామల ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగింది. అయితే కొన్నాళ్లుగా శ్యామల ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలను మౌనిక పంపిస్తున్నారు. వాటిలో శ్యామలతో పాటు ఆమె కుటుంబాన్నీ కించపరిచే, అవమానించేలా అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామల సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. (చదవండి: ఎంతటి విషాదం.. భార్య మరణవార్త తెలియకుండానే భర్త కూడా..) -
సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి : సీపీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా సమయంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ ఎస్సీఎస్సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. (జీతం కోసం జీవితం అంతం చేసుకున్నాడు) కోవిడ్ కారణంగా సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఎక్కువయ్యయని వీటి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సుమారు 65వేల మంది మహిళా ఉద్యోగులు ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని, వీరి భద్రతకు ఆయా సంస్థలు విమెన్ సేఫ్టీ వింగ్స్‌ను ఏర్పాటు చేశాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉమెన్ ఫోరమ్ సభ్యుల కృషితో ఐటీ కారిడార్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. (శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!) -
సైబర్ వేధింపుల అధ్యయనం..ఎన్నారైకు ఫేస్బుక్ గ్రాంటు
వాషింగ్టన్: అమెరికాలోని టీనేజర్లలో సైబర్ వేధింపుల ధోరణులపై అధ్యయనం చేసేందుకు ప్రవాస భారతీయ నిపుణుడు సమీర్ హిందుజాకు సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ నుంచి1,88,000 డాలర్ల గ్రాంటు లభించింది. ప్రస్తుతం సైబర్బులీయింగ్ రీసెర్చ్ సెంటర్‌కి హిందుజా కో-డెరైక్టరుగా ఉన్నారు. అమెరికాలోని చాలా మంది టీనేజర్లు డేటింగ్లో హింస బారిన పడటం, ఆన్లైన్లో బెదిరింపులు, అవమానాలు, వేధింపులు మొదలైనవాటికి గురికావడం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ధోరణులపై అధ్యయనం చేసేందుకు ఫేస్బుక్ ఆధ్వర్యంలోని డిజిటల్ ట్రస్ట్ ఫౌండేషన్ నుంచి హిందుజాకు 1,88,776 డాలర్ల మేర గ్రాంటు లభించింది. 12-17 సంవత్సరాల టీనేజర్లపై అధ్యయనం జరపనున్నారు.