breaking news
Cuba flight
-
క్యూబా విమాన ప్రమాదంలో 107 మంది మృతి
హవానా: క్యూబాలో ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన విమానం శుక్రవారం కూలిపోయిన ఘటనలో 107 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు మహిళా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించామనీ, ప్రస్తుతం వీరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదంలో ఆరుగురు మెక్సికన్ విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. క్యూబా రాజధాని హవానా నుంచి 110 మంది ప్రయాణికులు, సిబ్బందితో బోయింగ్ 737 విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.08 హోల్గ్యిన్ నగరానికి బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. -
ఘోరం: విమానం కూలి 100 మంది దుర్మరణం
హవానా : క్యూబా రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కూలి దాదాపు 100 మరణించారు. జోస్ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్ తీసుకున్న బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందులో 100 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్కేనెల్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గురైన బోయింగ్ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్ ఎయిర్‌లైన్స్ అద్దెకు తీసుకుని నడుపుతుంది. -
క్యూబాకు అమెరికా తొలి విమానం
సాంటాక్లారా: అమెరికా, క్యూబా దేశాల మధ్య బుధవారం మరో చరిత్రాత్మకమైన రోజు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాండర్డేల్ నగరం నుంచి బయల్దేరిన ‘జెట్‌బ్లూ ఫ్లయిట్-387’ అనే ప్రయాణికుల విమానం క్యూబా దేశంలోని సాంటాక్లారాకు చేరుకోవడానికి 51 నిమిషాలు పట్టింది. అందుకు ఇరు దేశాల ప్రజలు 55 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి క్యూబాతోని సరైన సంబంధాలు లేకపోవడం వల్ల ఇరుదేశాల మధ్య కమర్షియల్ విమానాలు నిలిచిపోయి 55 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత తొలి కమర్షియల్ విమానం అమెరికాలోని హాలివుడ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి బయల్దేరి క్యూబాలోని సాంటా మారియా విమానాశ్రయంలో దిగింది. అక్కడ అమెరికా విమానాశ్రయంలో నీటి ఫిరంగులతో విమానానికి వీడ్కోలు పలగ్గా, ఇక్కడ క్యూబా విమానాశ్రయంలో కూడా నీటి ఫిరంగులతో స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో విమానాశ్రయం అధికారులు, కార్మికులు, ప్రయాణికులు ఇరు దేశాల జెండాలు పట్టుకొని పాల్గొన్నారు. ముందుగా విమానం నుంచి అమెరికా రవాణా శాఖ మంత్రి ఆంథోని ఫాక్స్ దిగారు. ఆయనకు విమానాశ్రయం సిబ్బంది స్వాగతించారు. ఆయన వెంట జెట్‌బ్లూ ఫ్లైట్ కంపెనీ సీఈవో రాబిన్ హేస్ కూడా దిగారు. ఆయనకు నగర అధికారులు సాంటాక్లారా నగరం పెయింటింగ్స్‌ను బహుమానంగా ఇచ్చారు. ఒకప్పుడు క్యూబాకు రావాలంటే విమానాఞశ్రయానికి వెళ్లి టిక్కెట్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ప్రొపెల్లర్ విమానంలో రావాల్సి వచ్చేదని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయిందని హేస్ వ్యాఖ్యానించారు. ఇప్పడు ఆ లైన్లోనే టిక్కెట్లు కొనుక్కోవచ్చని, అమెరికాలోని పది నగరాల నుంచి క్యూబాకు రావచ్చని ఆయన తెలిపారు. త్వరలోనే మరిన్ని అమెరికా ఎయిర్‌లైన్స్ మరికొన్ని కమర్షియల్ విమానాలను క్యూబాకు నడపనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2014 డిసెంబర్ నెలలోనే క్యూబా అధ్యక్షులు రౌల్ కాస్ట్రోను కలసుకొని దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నప్పటికీ ఆర్థిక ఆంక్షలు కొనసాగడం వల్ల అమెరికా తొలి ప్రయాణికుల విమానం ఇక్కడికి రావడానికి ఇంతకాలం పట్టింది. ఇది ఇరు దేశాల సంబంధాల్లో చరిత్రాత్మకమైన రోజని అమెరికాలోని క్యూబా అంబాసిడర్ జోస్ రామన్ కబనాస్ వ్యాఖ్యానించారు.