breaking news
CS Shetty
-
కంపెనీల కొనుగోళ్లకూ బ్యాంక్ నిధులు!.. ఎస్బీఐ చైర్మన్
ముంబై: లిస్టెడ్ కంపెనీలు చేపట్టే విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) లావాదేవీలకు కూడా నిధులు సమకూర్చడంపై బ్యాంకులు దృష్టి పెడుతున్నాయి. దీనికి అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంకును దేశీ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) సూత్రప్రాయంగా అభ్యర్తించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయం తెలిపారు.వినియోగాన్ని పెంచేందుకు ఓవైపు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోపక్క ప్రయివేట్ రంగం సైతం సామర్థ్య విస్తరణపై పెట్టుబడులకు ఉపక్రమించాలని సూచించారు. సాధారణంగా బలవంతపు టేకోవర్లకు తోడ్పడకూడదనే ఉద్దేశమే, ఎంఅండ్ఏ ఫండింగ్‌కి బ్యాంకులను దూరంగా ఉంచడానికి కారణమని పేర్కొన్నారు.అయితే.. అత్యంత పారదర్శకంగా, వాటాదారుల అనుమతితో లిస్టెడ్ కంపెనీలు చేపట్టే కొనుగోళ్లకైనా నిధులు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ ఆర్బీఐకు విన్నవించనున్నట్లు తెలియజేశారు. దీనితో బలవంతపు టేకోవర్లకు ఫండింగ్ చేసే సందర్భాలు తగ్గుతాయని పేర్కొన్నారు. భారత వాణిజ్య సమాఖ్య, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన 2025 ఎఫ్‌ఐబీఏసీ సందర్భంగా శెట్టి పలు అంశాలపై స్పందించారు.పెట్టుబడి వ్యయాలు ఇలా..దేశీ కార్పొరేట్ రంగం అంతర్గత వనరులు, ఈక్విటీ, రుణ మార్కెట్ల ద్వారా ప్రస్తుతం పెట్టుబడి వ్యయాలను సమకూర్చుకుంటున్నట్లు ఎస్బీఐ చీఫ్ శెట్టి తెలియజేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగం పుంజుకోనుందన్న అంచనాలతో కంపెనీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే నిలకడైన డిమాండ్ వాతావరణం కనిపించినప్పుడు మాత్రమే పెట్టుబడి వ్యయాలు పుంజుకుంటాయని అత్యధికులు చెబుతున్నట్లు ప్రస్తావించారు.జీఎస్టీ రేట్లలో వ్యవస్థాగత సంస్కరణలు, రూ. 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు తదితర పలు చర్యలకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి డిమాండ్ మళ్లీ భారీస్థాయిలో పుంజుకుంటే కార్పొరేట్లకు పెట్టుబడి వ్యయాలు లేదా తగిన ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. సామర్థ్య విస్తరణవైపు కంపెనీలు ఇప్పటికిప్పుడు దృష్టి పెడితే అటు క్యాపిటల్ మార్కెట్లు, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రుణ మార్కెట్లు కచ్చితంగా మద్దతిస్తాయని వివరించారు.కస్టమర్ సర్వీసుల పెంపు, సైబర్ సెక్యూరిటీ పటిష్టత, మరింత ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు దేశీ బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎంఎస్ఎంఈలు)కు రుణాలందించడంపై ఇటీవల బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ - జూన్(క్యూ1)లో వీటికి 19 శాతం అధికంగా రూ. 5.28 లక్షల కోట్ల రుణాలందించినట్లు వెల్లడించారు. -
ప్రభుత్వానికి ఎస్బీఐ భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి(2024–25) షేరుకి రూ. 15.9 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో సంస్థ ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 8,077 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేథ్ సమక్షంలో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డివిడెండ్ చెక్ అందించారు. కాగా.. అంతక్రితం ఏడాదిలో షేరుకి రూ. 13.7 చొప్పున ప్రభుత్వానికి రూ. 6,959 కోట్లకుపైగా డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. గతేడాది ఎస్బీఐ 16 శాతం అధికంగా రూ. 70,901 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు 2023–24లో రూ. 61,077 కోట్ల లాభం సాధించింది. -
చిన్న సంస్థల రుణాల ట్రాకింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉండాలి
చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్ఐఎస్ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు. చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్ రేటింగ్స్‌ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సీఎస్ శెట్టి.. ఎస్బీఐ అభివృద్ధికి పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 600 బ్రాంచ్‌లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.ఎస్బీఐ కొత్త శాఖలను పెద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ గత ఆర్ధిక సంవత్సరంలో 137 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించింది. ఇందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.2024 మార్చి నాటికి ఎస్బీఐ దేశంలో 22,542 శాఖలను, 65,000 ఏటీఎంలను, 85,000 బిజినెస్ కరస్పాండెంట్లను కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అనుకున్న విధంగా అన్నీ సక్రమంగా జరిగితే ఎస్బీఐ శాఖల సంఖ్య 23,142కు చేరుతుంది. ఎస్బీఐకు ప్రస్తుతం 50 కోట్ల కంటే ఎక్కువ ఖాతాదారులు ఉన్నట్లు సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రతి భారతీయ కుటుంబానికి మేము బ్యాంకర్ అని చెప్పడానికి మేము గర్విస్తున్నామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐడిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిపాజిటర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలో ఎస్బీఐ ఉన్నట్లు సీఎస్ శెట్టి వెల్లడించారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లు ఇటీవల పేర్కొన్నారు.