breaking news
crashing out
-
ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ: కియోసాకి హెచ్చరిక
ఎప్పుడూ స్టాక్ మార్కెట్లను, బాండ్లను విమర్శించే ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా మరో ఆసిక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ ప్రమాద దశలో ఉందని హెచ్చరించారు.ఆయన మాటల్లో.. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన “ప్రతీ బుడగ” ఇప్పుడు పేలుతున్నదనీ, దీనితో పెద్ద ఎత్తున ధరలు పడిపోతున్నాయనీ తెలిపారు. అయితే, ఈ పరిణామాల మధ్య ఆయన తన ఆస్తులను (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం) అమ్మడం లేదని స్పష్టం చేశారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన వరుస పోస్ట్‌లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందని వ్యాఖ్యానించిన కియోసాకి (Robert Kiyosaki).. ప్రభుత్వాలు భారీ అప్పుల భారంతో కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి చివరకు అధిక స్థాయిలో డబ్బు ముద్రించడం తప్ప మరో మార్గం ఉండదని అన్నారు.అదే సమయంలో, అధిక ముద్రణ వల్ల డాలర్ విలువ పడిపోవడంతో “నకిలీ డబ్బు” (fiat currency) క్రాష్ అవుతుందని, దాంతో సహజంగా విలువ కలిగిన కఠిన ఆస్తులు (Hard Assets) ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.క్రిప్టో మార్కెట్లో భారీగా పడిపోయే ధోరణి గురించి ఆయన మాట్లాడుతూ.. “బిట్‌కాయిన్ క్రాష్ అవుతోంది, ప్రతీ బుడగలు పగులుతున్నాయి. నేను అమ్ముతున్నానా? లేదు. ఎందుకంటే ప్రపంచానికి డబ్బు అవసరం, నాకు కాదు” అని అన్నారు.కియోసాకి ప్రకారం.. భారీ అప్పు సంక్షోభం కారణంగా ప్రభుత్వాలు త్వరలో “ది బిగ్ ప్రింట్” (నోట్ల ముద్రణ) ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులు మరింత విలువను సంపాదిస్తాయని ఆయన నమ్మకం.BITCOiN CRASHING:The everything bubbles are bursting….Q: Am I selling?A: NO: I am waiting.Q: Why aren’t you selling?A: The cause of all markets crashing is the world is in need of cash.A: I do not need cash.A: The real reason I am not selling is because the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025 -
Chandrayaan-3: రోవర్‌కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్‌కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్ నుంచి విడుదలైన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. రోవర్ తప్పించుకున్న బిలం ఇదే.. దారిమళ్లిన రోవర్ గుర్తులు -
గ్రామాన్ని ముంచెత్తిన వరద.. అంతా బురదమయం.. వీడియో వైరల్..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండల నుంచి జారు వారుతున్న వరద నీరు నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొండ వాలులో ఉన్న మండి జిల్లాలోని ఒనైర్ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని పెద్ద పెద్ద చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని గ్రామంలోని మార్కెట్ ప్రాంతంపై ప్రవహించింది. ఇళ్లను, దుకాణాలను తనలో కలిపేసుకుంది. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. #Video| Continuous rain for 3 days wreaks havoc in #HimachalPradesh's Mandi pic.twitter.com/HieNQW5fm2 — NDTV (@ndtv) July 10, 2023 అటు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rainfalls: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
వైరల్ వీడియో: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు
-
వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు
ఇటీవల వివాహ వేడుకల్లో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక యువకుడు సినిమాలో హీరో మాదిరిగా ఓ వేడుకకి వచ్చి హాయిగా భోజనం చేసి వెళ్లిపోవాలనుకున్నాడు. గానీ అక్కడ ఉన్న పెళ్లివారు పనిష్మెంట్గా ఆ యవకుడితో ప్లేట్లు కడిగించారు. అంతకుముందు అమెరికాలోని ఓ వివాహ వేడుకలోకి ఎలుగుబంటి వచ్చి అక్కడ ఆహార పదార్థలన్నింటిని తినేసి పెద్దపెద్ద కలకలం సృష్టించింది. ఆ ఘటనలను మరువక మునుపే మరో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక ఎద్దు వివాహ వేడుక ఎంట్రీ వద్ద ఉన్న గేటును ఢీకొట్టి మరీ పెళ్లిమండపంలోకి వచ్చేసింది. అక్కడు ఉన్న ఒకతను ఆ ఎద్దును బయటకు పంపించేందుకు యత్నించినా వెళ్లకపోకపోగా... అతనిపైనే దాడి చేసేందుకు వచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు. పైగా అక్కడ ఉన్న విందు వద్దకు వచ్చి హంగామా సృష్టించింది. అనంతరం అక్కడే స్టాల్స్ ఉన్న అద్దాల గదికి వెళ్లేందుకు కూడా యత్నించి...విఫలమై వెనక్కు వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి అక్కడ నుంచి ఎద్దు వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్‌లో తల్లి) -
ఆపిల్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న తెలుగు అక్షరం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో టాప్ బ్రాండ్ ఫోన్ అది. చేతిలో ఆ కంపెనీ గాడ్జెట్ ఉందంటే అది తన తాహతకు చిహ్నం. అదే ఆపిల్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే బ్రాండ్ ఇదే. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ ఇలా పలు గాడ్జెట్లతో ఖరీదైన బ్రాండ్‌గా పేరొందింది. కానీ అలాంటి పెద్ద బ్రాండ్‌ను ఓ తెలుగు అక్షరం ముప్పుతిప్పలు పెడుతోంది. అక్షరం టైప్ చేస్తే ఫోన్లోని యాప్స్ అన్నీ వాటంతట అవే క్రాష్ అవుతున్నాయి. బగ్ కారణంగా తెలుగు అక్షరం 'జ్ఞ' టైపు చేయగానే అన్ని యాప్స్ నిలిచిపోతున్నాయి. ఛాటింగ్ యాప్స్, స్లాక్, టెలిగ్రామ్, స్కైప్ ఓపెన్ చేసి మెస్సేజ్ కంపోజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ సమస్య ఎదురౌతోంది. ఇటలీకి చెందిన ఓ ప్రోగ్రామర్ ఈ బగ్‌ను యాపిల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆపిల్ సంస్థ తన ఐఓఎస్‌లో ఈ బగ్ ఉందంటూ నిర్ధారించింది. దాన్ని సరిచేయడానికి త్వరలోనే పరిస్కారం తీసుకువస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బీటా వెర్షన్ వాడుతున్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అయితే ఈ బగ్‌తో యాపిల్ సంస్థపై సటైర్లు ఓ రేంజ్లో వస్తున్నాయి. ఇంత చిన్న బగ్‌ను పరిస్కరించలేని ఆపిల్‌కు అంత పెద్ద పేరు ఎలా వచ్చిందంటూ విమర్శిస్తున్నారు.


