breaking news
court permit
-
పాస్‌పోర్ట్ నిబంధనల్ని మార్చండి
చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్‌పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పందించింది. ‘రుణ ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్‌పోర్టులను రుణం పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రుణం పూర్తిగా చెల్లించేవరకు రుణదాత వద్దే పాస్‌పోర్టు ఉండాలి. ఉంచకపోతే పాస్‌పోర్టు తాత్కాలికంగా రద్దుచేయాలని, పాస్‌పోర్టు రెన్యూవల్‌కు కోర్టు అనుమతి ఉండాలని తెలిపింది. మంగళం అనే అంగన్వాడీ కార్యకర్త..అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్పోర్టుతో సింగపూర్ వెళ్లడంతో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించడంపై కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్‌కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలంది. -
కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన
-
కోర్టు అనుమతిస్తే ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన
హైదరాబాద్: కోర్టు అనుమతిస్తే ఈ నెల 27, 28 తేదీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధితులను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. ఒక వేళ కోర్టు అనుమతి ఇవ్వకపోతే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటిస్తారని చెప్పారు. ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శిస్తారన్నారు. వైఎస్ జగన్ పిలుపు ఇచ్చిన విధంగా ఈ నెల 26న సమైక్య శంఖారావం సభ యథాతథంగా జరుగుతుందని కొణతాల చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శంఖారావం సభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఆయన సభ జరుగుతుందని స్పష్టం చేశారు.