breaking news
councilor murder
-
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ హత్యకేసు: ఆర్థిక లావాదేవీలే కారణం
సాక్షి, సూళ్లురుపేట (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సురేష్ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బినామీ బాలు అనే వ్యక్తి పక్కా ప్లాన్‌తో సురేష్‌ను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దారుణ హత్య
సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ తాళ్లూరు వెంకటసురేష్ (49) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. కారును పార్క్ చేయడానికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో పాశవికంగా పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని 16వ వార్డు కౌన్సిలర్ అయిన వెంకటసురేష్ సోమవారం తన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం సూళ్లూరుపేట చేరుకున్నారు. కుటుంబ సభ్యులను బ్రాహ్మణ వీధిలోని ఇంటివద్ద దింపిన వెంకటసురేష్ కారును పార్కింగ్ చేయడానికి పొట్టి శ్రీరాములు వీధిలోని పార్కింగ్ స్థలానికి వెళ్లారు. అక్కడ నుంచి ఎంతసేపటికీ ఆయన తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతని కుమారుడు ధీరజ్ పార్కింగ్ స్థలానికి వెళ్లి చూడగా.. ఒళ్లంతా కత్తిపోట్లతో కారు డ్రైవింగ్ సీటులో రక్తపు మడుగులో వెంకటసురేష్ పడి ఉన్నాడు. కారు హ్యాండ్ గేర్ వంకర్లు తిరిగిపోయి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు వెంకటసురేష్ శరీరంపై కిడ్నీలు, లివర్ ఉన్నచోటే అతి పాశవికంగా పొడిచినట్టుగా గుర్తించారు. వెంకటసురేష్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. వెంకట సురేష్‌కు సౌమ్యుడిగా పేరుంది. ఆయనకు ఎవరితోనూ వివాదాలు గాని, రాజకీయ విభేదాలు గాని లేవని చెబుతున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు అతడిని హత్యచేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం ఐరాల(చిత్తూరు జిల్లా): మండలంలోని వేదగిరివారిపల్లె పంచాయతీకి చెందిన గూబలవారిపల్లెలోని అటవీ ప్రాంతంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కె.చంద్రశేఖర్‌పై హత్యాయత్నం జరిగింది. పాతకక్షల కారణంగా టీడీపీకి చెందిన అరుణ్‌నాయుడు, వేదగిరివారిపల్లె సర్పంచ్ రాజేంద్ర ఆదివారం సాయంత్రం నుంచి తనపై దాడి చేసేందుకు కాపు కాశారని బాధితుడు తెలిపారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న తనపై కారంపొడి చల్లి ఇనుపరాడ్లతో దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వాపోయారు. ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. -
డీఎంకే కౌన్సిలర్ హత్య
టీనగర్: పడప్పై చర్చి ప్రాంగణంలో డీఎంకే కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి ఆరుగురి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై తాంబరం సమీపాన పడప్పై, పెరియార్ నగర్ ఐదవ వీధికి చెందిన ధనశేఖరన్(35) పడప్పై పంచాయతీ డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా, పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తున్నారు. సొంతంగా లారీ ఉండడంతో ఇతను అదే ప్రాంతంలో ఇసుక క్వారీలను లీజుకు తీసుకున్నారు. కాగా డేవిడ్‌నగర్‌లో ఉన్న ఒక చర్చికి ఆదివారం ఉదయం మోటార్ బైక్‌లో ధనశేఖరన్ బయలుదేరాడు. ఆ సమయంలో రెండు బైకుల్లో వెంబడించిన ఆరుగురు వ్యక్తులు ధనశేఖరన్‌పై కత్తులతో దాడి జరిపింది. వారి నుంచి తప్పించుకున్న ధనశేఖరన్ అదే ప్రాంతంలోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలోకి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ధనశేఖరన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి డీఎంకే శ్రేణులు అధిక సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.