breaking news
compared
-
టీవీఎస్ ఆర్బిటర్ vs ఐక్యూబ్: ఏది ఎక్కువ రేంజ్..
టీవీఎస్ మోటార్ ఇటీవలే.. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో.. ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఈవీకి అమ్మకాల పరంగా కొంత పోటీ పడుతుంది. రెండూ ఒకే కంపెనీకి చెందినవైనప్పటికీ.. డిజైన్, ఫీచర్స్, ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఆర్బిటర్ vs ఐక్యూబ్: డిజైన్ & ఫీచర్స్కొత్త టీవీఎస్ ఆర్బిటర్ 845 మిమీ ప్లాట్ సీటు, ఫ్లాట్ ఫ్లోర్ పొందుతుంది. దీని కారణంగా రైడర్ రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అనుభవించవచ్చు. ఇది 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఐక్యూబ్‌లో 32 లీటర్లు.కొత్త ఆర్బిటర్ ముందు భాగంలో హై-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంది. ఇది డీఆర్ఎల్ స్ట్రిప్‌తో కలిసి.. ఫ్రంట్ ఆప్రాన్లో విలీనం అవుతుంది. ఈ స్కూటర్ రెండు చివర్లలో 14 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీ. ఇది క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటెడ్ హిల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది.టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం డిజైన్ పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 12 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. ఆర్బిటర్ కంటే కూడా కొంత తక్కువ అండర్ సీట్ కెపాసిటీ పొందుతుంది.ఆర్బిటర్ vs ఐక్యూబ్: పర్ఫామెన్స్ & రేంజ్టీవీఎస్ ఆర్బిటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 145 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ మాత్రమే కాకుండా.. 2.2 కిలోవాట్, 3.1 కిలోవాట్, 5.3 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది. ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99000కాగా.. ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
అతడి గుండె చెదురుతోంది!
సాక్షి, హైదరాబాద్: అస్థిరమైన జీవనశైలి, హార్మోన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ గుండెపోటుతో మరణిస్తున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో 284 మంది గుండెపోటుతో మరణించగా.. ఇందులో 257 మంది పురుషులు కాగా.. 27 మంది స్త్రీలున్నారు. ఆంధప్రదేశ్‌లో 176 మంది మృత్యువాత పడగా.. 162 మంది మగవాళ్లు, 14 మంది ఆడవారున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇండియా (ఏడీఎస్‌ఐ)–2022 నివేదికలో బహిర్గతమైంది. గుండెపోట్లు ఎందుకంటే.. గుండె జబ్బులకు ప్రధాన కారణం జన్యు సంబంధమైనవే. బలహీన గుండె కండరాలు ఉంటే హార్ట్ ఎటాక్‌లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మహిళలకు మెనోపాజ్ దశ వరకు శరీరంలో హార్మోన్లు భద్రత కల్పింస్తాయి. కానీ, పురుషులకు అలా ఉండదు కాబట్టి యుక్త వయసులో కూడా మగవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.అతిగా మాంసం వినియోగం, కొవ్వు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక, మానసిక ఒత్తిడి, అస్థిరమైన జీవనశైలి వల్ల గుండెపోటు వస్తుంటుంది. గుండె ఆగుతున్న వారిలో యువకులే ఎక్కువ గతేడాది దేశంలో 32,410 మంది గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించగా.. ఇందులో 28,005 మంది పురుషులు, 4,405 మంది మహిళలు ఉన్నారని. 2021లో 28,413 మంది హార్ట్ ఎటాక్‌తో మృత్యువాత పడ్డారు. అంటే ఏడాదిలో 12.5 శాతం పెరిగింది. గతేడాది 289 మంది మైనర్లకు హార్ట్ ఎటాక్ రాగా.. ఇందులో 185 మంది బాలురు, 104 మంది బాలికలున్నారు. 18 నుంచి 45 ఏళ్ల 12,759 మంది యువత గుండెపోటుకు గురికాగా.. 11,210 మంది పురుషులు, 1,549 మంది స్త్రీలు, 45–60 ఏళ్ల వయసు ఉన్న 12,290 మంది గుండె పోటుతో మరణించగా.. మగవాళ్లు 10,854 మంది, సమహిళలు 1,436 మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వాళ్లు 7,069 మంది మరణించగా.. 5,756 మంది పురుషులు, 1,313 మంది మహిళలున్నారు. ఏం చేయాలంటే... ► సాధ్యమైనంత వరకు మానసిక, పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ► ఉదయం, సాయంత్రం వ్యాయామం తప్పనిసరి. ► స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో ప్రతి రోజు కొంత సమయం గడపాలి. ► ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం నిత్యం యోగా, ధ్యానం వంటివి చేయాలి. ► 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ► స్వీయ సంతృప్తి అత్యవసరం. లేనిపోని ఆర్భాటాలకు, డాబులకు పోయి మానసిక ఒత్తిడి తెచ్చుకోకూడదు. డాక్టర్ ఏజీకే గోఖలే గుండె శస్త్ర చికిత్స నిపుణులు, అపోలో ఆసుపత్రి -
ఆర్థికవృద్దిలో మనమే బెటర్
న్యూయార్క్: ఆర్థికాభివృద్ధిలో భారతదేశం ముందజంలోఉందని ఐక్యరాజ్య నిపుణులు తేల్చారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ధాటికి పలు దేశాలు విలవిల్లాడుతోంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2017-18 సంవత్సరానికి ఇది మరింత మెరుగుపడుతుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి గరువారం విడుదల చేసిన ఎకానమిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ఫసిపిక్ - 2016 సర్వే తేల్చింది. దిగివస్తున్న ద్రవ్యోల్బణం, కొన్ని వ్యవస్థాగత చర్యలు భారత్ ను అభివృద్ది వైపు తీసుకెళుతున్నాయని తేల్చింది. ప్రధానంగా 2016-17 లో 7.6 శాతంగా విస్తరించిన ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 2017-18 లో శాతం 7.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక వ్యవహారాల అధికారి సెబాస్టియన్ వెర్గారా ఈ సర్వేను మీడియాకు విడుదల చేశారు. స్థూల ఆర్థిక విధానం, తగ్గిన ద్రవ్యోల్బణం కొన్ని నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చెప్పుకోగదగ్గ ఆర్థికాభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. భారత్ అనుసరిస్తున్న ద్రవ్య విధానం మూలంగా ఇటీవలి సంవత్సరాలలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు. నిర్మాణాత్మక సంస్కరణలు సంబంధించి దేశంలో భారత ప్రభుత్వం ముఖ్యమైన ప్రయత్నాలు చేసిందనీ పెట్టుబడుల పెరుగుదల పరంగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చిందన్నారు. ఇటీవలి సంవత్సరాలలో స్థూల ఆర్థిక విధానం ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఇది సానుకూల సంకేతమని వ్యాఖ్యానించారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్ ను బలపరచడానికి మంచి ప్రణాళికను అందిస్తుందన్నారు. సమీప భవిష్యత్తులోదేశ ఆర్థిక వృద్ధికి ఇది మరింత తోడ్పడతుందని తెలిపారు.