breaking news
Collected taxes
-
దోపిడీ టాకీస్!
కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్(పేరుమార్చాం) దసరా సెలువులకు కాస్త విశ్రాంతి దొరికిందని శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ సినిమాహాల్కు సినిమా చూసేందుకు వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్‌స్థలంలో నిలిపి లోపలికి వెళ్తుండగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. ‘మీ బైక్‌కు పార్కింగ్ రుసుం చెల్లించాలి’ అని రశీదు చించి ఇచ్చారు. ఆశ్చర్యానికి గురైన శ్రీనివాస్ ‘ సుప్రీంకోర్టు పార్కింగ్ రుసుం వసూలు చెయొద్దంది కదా..?’ అని నిలదీశాడు. దానికి ‘ఇక్కడ వసూలు చేస్తాం. మాకు రూల్స్ వర్తించవు.. రుసుం కట్టే వెళ్లండి’ అని సినిమాహాల్ నిర్వాహకులు హుకుం జారీ చేశారు. ససేమీర అన్న శ్రీనివాస్‌పై ఒకింత దాడికి దిగారు. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని అక్కడి నుంచి వెళ్లాడు. కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పలు సిని మాహాళ్లలో నిర్వాహకులు ‘అంతా తమ ఇష్టం’గా వ్యవహరిస్తున్నారని సినిమాకు వెళ్లే ప్రేక్షకులు అంటున్నారు. నిత్యం ఉద్యోగ, వ్యాపారాలతో బిజీగా గడిపి... ఖాళీ సమయంలో కాస్త విశ్రాంతి కోసం సినిమా చూసేందుకు హాల్‌కు వెళ్తే.... నిలువుదోపిడీకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. బైక్‌పై వెళ్తే.. బండి లోపల పెట్టింది మొదలు... క్యాంటీన్లో కూడా అధిక ధరలకు తినుబండారాత విక్రయాలు చేస్తున్నారని, హాల్ ఆవరణలో కనీస భద్రతాచర్యలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే... దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు.. సినిమా థియేటర్లలలో పార్కింగ్‌ఫీజు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, అప్పటి నగరపాలక కమిషనర్ శశాంకాలు నగరంలో ఉన్న సినిమాహాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రతీ థియేటర్లో నాణ్యమైన మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే థియేటర్లకు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆదేశాలు బేఖాతర్.. ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ నగరంలోని పలు సినిమాహాళ్ల నిర్వాహకులు నిబంధనలను పెడ చెవిన పెడుతున్నారు. అడ్డగోలుగా పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నారు. సినిమాకు వచ్చే ప్రేక్షకులకు సరైన వసతులు కల్పించడం లేదు. నాసిరకమైన ఫుడ్ అందుబాటులో ఉంచుతున్నారు. దాన్నీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో పలు థియేటర్ల క్యాంటీన్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినా... పద్ధతిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రశ్నిస్తే.. దాడులే.. నగర నడిఒడ్డున ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన సినిమాహాల్ నిర్వాహకులు సినిమాకు వచ్చేవారిపట్ల రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ తహసీల్దార్ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. నిర్వాహకులు పార్కింగ్ ఫీజు అడిగారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయెద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందని, ఫీజు కట్టనని చెప్పిన పాపానికి అతడిపై దాడికి యత్నించారు. నెట్టివేసి అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయమై సదరు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ ఉన్నతాధికారికే న్యాయం జరగలేదంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ థియేటర్లో జరిగే అన్యాయాలను గురించి ప్రశ్నిస్తే... పట్టించునే వారే కరువయ్యారని శుక్రవారం సైతం దాడికి గురైన వ్యక్తి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు సినిమాహళ్లలో నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సినిమాకు వచ్చే ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధితశాఖతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సినిమాహళ్లలో పార్కింగ్‌ఫీజు విషయంలో నిబంధనల ప్రకారం, భద్రత ప్రమాణాలు పాటించని వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలుకు పూనుకుంటాం.– తుల శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ, కరీంనగర్ -
పంచాయతీ పన్ను పెంపుపై కన్ను
ఏలూరు, న్యూస్‌లైన్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రజల నుంచే పన్నులు వసూలు చేసి ఆ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీల ఆదా యం అంతంతమాత్రంగా ఉండ డం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వద్ద నిధుల్లేకపోవడంతో ప్రజల నుంచే ప న్నులు వసూలు చేసి ఆ పనులను పూర్తి చేయాలని సర్కారు యోచి స్తోంది. ఇక నుంచి గ్రామాల్లో కొత్త పద్ధతిలో పన్నులను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో అధికారులు పన్నుల వా తకు కసరత్తు మొదలుపెట్టారు. ఇంతకు ముందులా ఏడాదికి ఐదు శాతం చొప్పున కాకుండా ఐదేళ్లకు కలిపి ఒకేసారి పన్ను భా రం మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పెనుగొండ మండలంలో ఈ పక్రియను సోమవారం నుంచి శాస్త్రీయ పద్ధతిలో పన్ను మదింపును చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలుత అక్కడి గ్రామాల్లో ఈ పద్ధతిపై ప్రయోగం చేసి ఎదురయ్యే అనుకూల, ప్రతికూల పరిస్థితులపై అవగాహనకు వచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమస్యలను తీర్చేందుకేనట..!జిల్లావ్యాప్తంగా 884 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలకు సరైన ఆదాయ వనరులు లేవు. కొన్నిచోట్లయితే విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితులు కూడా లేదు. అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. అరకొర నిధులతో పనులు పూర్తికావడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీల్లో కూడా పన్నుల పెంపు, వసూలుపై దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటి విలువను మదించి పన్ను ఇప్పటి వరకు గ్రామాల్లో 1990 కంటే ముందు నిర్ణయించిన పన్నులే ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో చాలా చోట్ల పెంకుటిల్లులు, తాటాకిళ్లు ఉన్నచోట కొత్తగా డాబాలు (స్లాబ్) ఇళ్లు వెలిశాయి. ప్రస్తుతం ఇవే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల వాణిజ్యం పరిధిలోకి వచ్చే దుకాణాలు కూడా భారీగా వెలిశాయి. కానీ వారు మాత్రం నేటికీ పాత పద్ధతిలోనే పన్నులు కడుతున్నారు. దీంతో సామాన్యుడితో సమానంగానే ధనికులు కూడా అవే పన్నులు చెల్లించేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పన్నులు పెంచే పద్ధతిని తీసుకొస్తున్నారు. ఇక నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం నివాస గృహం అయితే చదరపు అడుగుకు రూ. 25 పైసలు, వాణిజ్య భవనాలైతే చదరపు అడుగుకు రూ. 50 పైసలు విధిస్తారు. ఖాళీ స్థలాలకు కూడా పన్ను విధించనున్నారు. రూ.15 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం జిల్లాలో పన్ను మదింపు ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీల ఆదా యం రూ.15 కోట్లకు చేరనుందని డీపీవో అల్లూరి నాగరాజు వర్మ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇప్పటి వరకు రూ.10 కోట్ల మేర ఆస్తి, మంచినీటి పన్ను కింద ఏటా వసూలు అవుతుందన్నారు. ఇక నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను మదింపు చేపడతామన్నారు. పెనుగొండ మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా వారం రోజుల కసరత్తు చేసి అనంతరం అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు. కొత్త విధానం ఇదీ.. కొత్త పన్నుల పద్ధతిలో గ్రామాల్లో ఏ సౌకర్యాలు కావాలనే దానిపై ప్రజలను అడిగి అధికారులు ఒక నివేదిక తయారు చేస్తారు. దీనికోసం ఐదేళ్లలో వివిధ పథకాల కింద వచ్చే నిధులను అంచనా వేస్తారు. ఆ సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి? ప్రభుత్వపరంగా ఎన్ని వస్తాయో లెక్కిస్తారు. ఈ నిధులకు తోడు అదనంగా అవసరమయ్యే వాటిని పన్నుల రూపేణా వసూలు చేస్తారు. గ్రామానికి సౌకర్యాలు కావాలంటే ఈ అదనపు పన్నులు చెల్లించడం తప్పదని కొందరు అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకూ ఏటా ఆస్తి పన్నులో ఐదు శాతం పెంచుతూ వస్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన ఆదేశాల మేరకు ఐదేళ్లకు కలిపి ఒకేసారి పన్ను వేయనున్నారు.