breaking news
cole
-
భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలి.. సింగరేణి డైరెక్టర్ల దిశానిర్దేశం..!
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్‌ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్‌పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కాన్ఫరెన్స్‌లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వకీల్‌పల్లిగనిలో.. రామగుండం డివిజన్–2 వకీల్‌పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూస్ మైనర్యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్‌పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్‌లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సింగరేణికి వానగండం
రుద్రంపూర్(ఖమ్మం), న్యూస్‌లైన్ : కొత్తగూడెం రీజియన్ పరిధి ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల్లోని ఉపరితల(ఓసీ) గనులలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా సుమారు 17వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. కొత్తగూడెం ఏరియాలో ని గౌతంఖని ఓసీలో 4వేల టన్నులు, సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో 5వేల టన్నులు, ఇల్లెందు ఏరియా జేకే ఓసీలో 5వేల టన్నులు, కోయగూడెం ఓసీలో 3 వేల టన్నుల బొగ్గు ఉత్ప త్తి నిలిచిపోయినట్లు అధికారులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మణుగూరు ఏరియాలో వర్షం ప్రభావం అంతగా లేకపోవడంతో ఉత్పత్తి కొనసాగింది. మిగతా ఏరియాల్లో వర్షం వల్ల ఓసీలలో క్వారీలు, హాలేజీ రోడ్లన్నీ బురదమయంగా మారా యి. దీంతో డంపర్లు, డోజర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయా యి. రోడ్డు మార్గం గుండా జరగాల్సిన బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడింది. వర్షం ఇలాగే కొనసాగితే శనివా రం కూడా ఉత్పత్తికి అంతరాయం కలుగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్పత్తిలో కొంత వెనుబడి ఉన్న ఏరియాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మార నుంది. ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో కార్మికులపై అదనపు పనిభారం పడుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు సమస్యలు తెచ్చిపెడుతున్నాయని అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఆర్జీలో 35వేల టన్నుల లోటు గోదావరిఖని(కరీంనగర్) : రామగుండం రీజియన్‌లో శుక్రవారం కూడా వర్షం కురవడంతో ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం షిఫ్టులలో 55 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదు కాగా పనులు ముందుకు సాగలేదు. ఆర్జీ-1 ఏరియా పరిధిలోని మేడిపల్లి ఓసీలో 7వేల టన్నులకు 1300 టన్నులు మాత్రమే వెలికితీయగలిగారు. కాంట్రాక్టు సంస్థ లు మట్టి తొలగింపు పనులు పూర్తిగా నిలిపివేశాయి. ఆర్జీ-2 ఏరియా ఓసీపీ-3లో 60 వేల క్యూబిక్ మీటర్ల ఓబీకి గాను వెయ్యి క్యూబిక్ మీటర్లు వెలికితీశారు. 15వేల టన్నుల బొగ్గుకు 6వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-1లో 10,400 టన్నులు, ఓసీపీ-2లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మట్టి వెలికితీత పనులు సాగలేదు. భూపాలపల్లిలో 10వేల టన్నులు.. భూపాలపల్లి(వరంగల్) : రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఓసీలో రోజుకు 5 వేల టన్నుల బొగ్గు వెలి కితీయాల్సి ఉండ గా గురు, శుక్రవారాల్లో ఏమాత్రం ఉత్పత్తి జరగలేదని అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సైతం వర్షం కొనసాగడంతో ప్రాజెక్టులోకి నీరు చేరి పనిస్థలాలు నీట మునిగాయి. రోడ్లు బురదమయంగా మారడంతో డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బెల్లంపల్లి రీజియన్‌లో 18వేల టన్నులు.. శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : వర్షం కారణంగా శుక్రవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని మూడు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి-1, 2, ఖైరిగూడ ఓసీపీల్లో 13 వేల టన్నులు, శ్రీరాం పూర్ ఓసీపీలో 5 వేల టన్నుల ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.