breaking news
Coffee plantations
-
'ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు'
అమరావతి: లక్ష ఎకరాల్లో గిరిజనుల ద్వారా కాఫీ తోటలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 800 మందికి, ఎంటర్‌ప్రై న్యూర్షిప్ ప్రోగ్రామ్‌లో 220 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐదు లక్షల వరకు రుణం ఇచ్చి పండ్లతోటలు, ఎన్టీఆర్ జలసిరి కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కాఫీ తోటలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. -
బొర్రాకు పర్యాటకుల తాకిడి
ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో బొర్రాతోపాటు అనంతగిరి సమీపంలోని గోస్తనీ నది ప్రాంతం, కటిక, తాడిగుడ జలపాతాలు, కాఫీ తోటలు, టైడా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. ఛత్తీస్‌గఢ్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో వచ్చారు. అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో బొర్రా గుహలతోపాటు మండలంలో కాశీపట్నం గోస్తనీనది పరివాహక ప్రాంతం, కటికి, తాడిగుడ జలపాతాలు, కాఫీ తోటల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చిన వాహనాలు రైల్వేస్టేషన్ నుంచి గుహల వరకు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో సర్యాటకులు ఇబ్బందలు పడ్డారు. ఛత్తీస్‌ఘడ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతోపాటు తెలంగాణ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.


