breaking news
clerk posts
-
నేను హైకోర్టు లాయర్.. నేను కాబోయే కలెక్టర్..
► అమాయకులనుబురిడీ కొట్టించిన భార్యభర్తలు ► ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు ► పట్టుకున్న పోలీసులు హైదరాబాద్: హైకోర్టులో గుమాస్తా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒకామె, కలెక్టరేట్లో క్లర్క్ పోస్టులు ఇప్పిస్తానని ఆయన.. ఇద్దరూ కలిసి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొని పరారీలో ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆ దంపతులిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్న సమయంలో మలక్‌పేట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం భీమా రం గ్రామానికి చెందిన బిటుకు రాజలింగం(45), బిటుకు ప్రసన్న(40) భార్యభర్తలు. తేలికగా డబ్బు సంపాదించే మార్గానికి తెరలేపారు. హైకోర్టులో తాను లాయర్‌ను అంటూ ప్రసన్న నమ్మించి అక్కడ క్లర్క్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.4 నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేసింది. తాను రెండు రోజుల్లో కలెక్టర్‌గా అపాయింట్ కాబోతున్నానని ఉద్యోగాల పేరుతో రాజలింగం కూడా ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని అనుష్క కుక్కూస్ అనే ఖరీదైన అపార్ట్మెంట్లో నెలకు రూ.75 వేల అద్దెతో కిరాయికి దిగారు. ఒక బీఎండబ్ల్యూ కారును కూడా అద్దెకు తీసుకున్నారు. వెంట ఇద్దరు గన్మెన్లను నియమించుకున్నారు. కారు డ్రైవర్, ఇంట్లో పని మనుషులు ఇలా అట్టహాసం చూపించారు. ఇదంతా నమ్మిన ప్రభుకిరణ్, రంగారా వు, ఎన్. బ్రహ్మలింగం, పి.నానాజీ, చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాలో బాధితులున్నారు. వీరంతా లక్షల రూపాయలు చెల్లించారు. హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్లు, క్లర్క్‌లు, గుమస్తాలు ఇలా రకరకాల ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకున్నారు. నెల రోజుల్లోనే అపార్ట్మెంట్ ఖాళీచేసి పరారయ్యారు. బాధితులు ప్లాట్ వద్ద కు వచ్చి చూడగా ఖాళీ చేసినట్లు తేలింది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయామని తెలుసుకొని బాధితులంతా పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు, రాజలింగం, ప్రసన్నలపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. శని వారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు వీరి ఆచూకీ లభించగానే వెంబడించారు. సిగ్నల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారులో తప్పించుకున్నారు. అయితే కొద్ది దూరంలోనే మాటువేసిన మలక్‌పేట పోలీసులకు చిక్కినట్లు తేలడంతో బంజారాహిల్స్ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి మోసాలు పెద్ద సంఖ్యలో వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారుగా 40 మందిని మోసం చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నా యి. వీరిద్దరినీ తమ కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. -
ఉద్యోగ సమాచారం
ఎన్‌పీసీఐఎల్‌లో వివిధ పోస్టులు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ గ్రేడ్ (హ్యూమన్ రిసోర్స, ఫైనాన్స అండ్ అకౌంట్స్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్), స్టైపెండరీ ట్రైనీ, నర్స్, ఫార్మాసిస్ట్, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనవి. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10. మరిన్ని వివరాలకు www.npcil.nic.in చూడొచ్చు. ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్-ఖాళీలు: 400), (ఎలక్ట్రానిక్స్-ఖాళీలు: 198) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): అక్టోబర్ 3, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఏటీసీ): అక్టోబర్ 6. మరిన్ని వివరాలకు www.aai.aero చూడొచ్చు. ఎంపీఎంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్ మైసూర్ పేపర్ మిల్స్ (ఎంపీఎం).. పేపర్, పవర్ బ్లాక్, ఆర్ అండ్ డీ/ క్యూసీ, షుగర్, హెచ్ఆర్డీ అండ్ ఏ విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. వయసు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 3. వివరాలకు www.mpm.co.in చూడొచ్చు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రేడ్స్ మెన్ మేట్, ఫైర్‌మెన్ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. ట్రేడ్స్ మెన్ మేట్ (ఖాళీలు-55), ఫైర్‌మెన్ (ఖాళీలు-32), లోయర్ డివిజన్ క్లర్క్స్(ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును ‘కమాండింగ్ ఆఫీసర్, 6 మౌంటెన్ డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్, పిన్‌కోడ్-909006, సీ/ఓ 56 ఏపీఓకి పంపించాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 18. సాయ్‌లో అసిస్టెంట్ డెరైక్టర్స్ స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. సివిల్ సర్వీసెస్ (మెయిన్స్, ఇంటర్వ్యూ)-2014లో ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి అసిస్టెంట్ డెరైక్టర్ (ఖాళీలు-8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.sportsauthorityofindia.nic.in చూడొచ్చు. మజగావ్ డాక్ షిప్ బిల్డర్సలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్.. గేట్-2016 స్కోర్ ఆధారంగా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 35. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. వివరాలకు www.mazagon dock.gov.in చూడొచ్చు. గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీలో ఎల్డీసీలు కోల్‌కతాలోని గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ (జీఎస్ఎఫ్).. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. వయసు 18- 37 ఏళ్లు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నిమిషానికి ఇంగ్లిష్‌లో 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 19. మరిన్ని వివరాలకు www.gsf.gov.in చూడొచ్చు.