breaking news
Classical status
-
తీర్పు సరే మనలో మార్పేదీ?
రెండో మాట మరోవైపు ప్రాచీన ప్రతిపత్తి హోదావల్ల తమిళం ఏడాదికి రూ. 10–15 కోట్ల కేంద్ర నిధులు అందుకుంటూనే ఉంది. కానీ గుర్తింపు ఉన్నా కూడా, తీర్పు వాయిదా పడిన ఫలితంగా ఈ ఎనిమిదేళ్లుగా రూ. 80 కోట్లకు పైగా నిధులను తెలుగువారు కోల్పోయారు. చివరికి మద్రాసు హైకోర్టు బెంచ్ తమిళ సోదరుల కుట్రల వల్ల తెలుగుకు ఎదురైన అడ్డంకిని తొలగిస్తూ మంచి వ్యాఖ్య చేసింది. ఇతర భాషలకు ప్రాచీన ప్రతిపత్తి కల్పించినట్టయితే తమిళ భాష ప్రాశస్త్యం కనుమరుగైపోతుందన్న పిటిషనర్ వాదనను నిరాకరించింది. ‘ఆంధ్ర(తెలుగు) భాష సుందరమైనది. తెలుగు కవిత, దాని సంగీతం మనోహరమైనవి. ఆ భాష గాన మాధుర్య గుణం చేత ఆంధ్ర పద నిర్వచనం కన్యాకుమారి నుంచి తపతీ నదీతీరం దాకా నివసిస్తున్న జనులందరినీ ఒక్కచోట చేర్చగలుగుతోంది. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు కూడా తెలుగు గాన మాధుర్యం చేత ఆంధ్రులే అవుతారు. త్యాగరాజు గానం చేసిన తెలుగుభాష ‘దేవభాష’ (సంస్కృతంతో సమానం) అయినందుననే తెలుగును ప్రాచ్య ఖండపు ఇటాలియన్ భాష అనడం న్యాయంగా ఉంది.’ – నోబెల్ గ్రహీత, సుప్రసిద్ధ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ (94 ఏళ్ల నాడు ఫిబ్రవరి 21, 1922న హైదరాబాద్ నిజాం కళాశాల తెలుగు విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రానికి ఇచ్చిన సమాధానంలో అభిభాషణం.) దాదాపు 3,000 సంవత్సరాల చరిత్ర... లిపి, శాసనాలు, చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక సంబంధమైన ఆవిర్భావ దశల ద్వారా తన ఉనికిని నిరూపించుకున్న భాష... అలాంటి తెలుగు భాషను ప్రాచీన/శ్రేష్ఠమైన భాషలలో ఒకటిగా గుర్తించడానికి పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అవసరమా? ఇంతకీ ఈ అవసరం తెలుగువారు తమకు తాము కల్పించు కున్నది కాదు. ఆ మాటకొస్తే ద్రావిడ భాషా కుటుంబంలోని ఇరుగు పొరుగైన కర్ణాటక, కేరళ రాష్ట్రాలూ, ఒడిశా రాష్ట్రాల భాషాభిమానులూ తమ తమ మాతృభాషలకు ప్రాచీన హోదా కల్పిస్తారా, లేదా అని కేంద్రాన్ని నిలదీసిన ఫలితంగా అనివార్యమైన పోరాటం కూడా కాదు. మరి ఎందుకు అవసర మైనట్టు? అసలు శ్రేష్ఠ భాషా ప్రతిపత్తి ఆలోచనకు బీజం ఎక్కడ పడినట్టు? తమిళ మంత్రుల రాజకీయం యూపీఏ ప్రభుత్వంలో కొందరు తమిళులు భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈ పరిణామానికి బీజం పడింది. 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలలో ప్రత్యేక అధ్యయనం, అనంతర పరిశోధనలను ప్రోత్సహించాలని నాటి కేంద్రం ప్రతిపాదించింది. ఆ ఆలోచన ప్రాతిపదికగా కొందరు తమిళ మంత్రులు మంత్రిమండలి సమావేశంలో తమిళ భాషకు ఆ ప్రతిపత్తిని లోపాయికారీగా సాధించుకున్నారు. ఇది మొదటి కుట్ర. రెండో కుట్రలో వారు తలపెట్టిన దుర్మార్గం– ఇలాంటి ప్రతిపత్తికి కావలసిన అర్హతకు పెట్టిన కాలపరిమితి. అది– 1,000 నుంచి 1,500 సంవత్సరాలు. అయినా, ఈ అర్హత ప్రమాణంలోకి ఇతర భాషలు కూడా ఇమిడే అవకాశం ఉంది. నిజానికి సంస్కృతాన్ని ప్రాచీన భాషగా అంతకు ముందే కేంద్రం గుర్తించింది. కానీ ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. ఈ లోపునే తమిళ సోదరులు తమ భాషకు ప్రాచీన హోదా కట్టబెట్టించారు. పైగా తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిశా లకు ఆ ప్రతిపత్తి దక్కకుండా తమ వంతు ప్రయత్నం చేశారు. కుంభకోణాల ఊబిలో నేటికీ కూరుకుపోయి ఉన్న నాటి కేంద్రమంత్రి మారన్ కేంద్రానికి రాసిన లేఖలో, ‘భాషల ప్రాచీనార్హతకు కనీసం 2,000–3,500 సంవత్సరాల పరిమితిని నిర్ణయించాల’ని ప్రతిపాదించారు. ఇది కేంద్ర నిర్ణయాన్ని మరింత జటిలం చేసింది. 2002–2004 మధ్య జరిగిన ఈ కుట్ర బయటపడేసరికి ఇంతక్రితం ఉదహరించిన భాషా ప్రాంతాల భాషావేత్తలూ, పరిశోధకులూ తిరగబడవలసిన పరిస్థితి తలెత్తింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భాషా సమితులు, భాషోద్యమకారులు, భాషావేత్తలు తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి కోసం పట్టుపట్టడం మొదలుపెట్టారు. కానీ వీరి ఆందోళనకు రాష్ట్ర స్థాయి కేంద్రీకృత వ్యవస్థ కొరవడింది. తెలుగు అధికార భాషా సంఘం కృషి ఏమైనా, 2005 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రాచీన ప్రతిపత్తి ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రాచీనతకు సంబంధించిన సర్వ ఆధారాలను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమర్పించింది. కేంద్ర మంత్రిమండలిలోని తమిళ తంబీల అడ్డంకుల మధ్యనే తుదకు కేంద్రం, తమిళేతర దక్షిణాది భారతీయ భాషలకు ప్రాచీన ప్రతిపత్తి హోదాను సశాస్త్రీయంగా ప్రకటించింది (2008). ఆ ప్రకటనను సవాలు చేస్తూ దారితప్పిన ఒక తమిళ ‘గాం«ధీ’ ‘గిరీశం’ పాత్ర పోషిస్తూ, మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఆకుకు అందని పోకకు పొందని న్యాయవాది వాదనల ఫలితంగా తీర్పు ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు ప్రాచీన ప్రతిపత్తి హోదావల్ల తమిళం ఏడాదికి రూ. 10–15 కోట్ల కేంద్ర నిధులు అందుకుంటూనే ఉంది. కానీ గుర్తింపు ఉన్నా కూడా, తీర్పు వాయిదా పడిన ఫలితంగా ఈ ఎనిమిదేళ్లుగా రూ. 80 కోట్లకు పైగా నిధులను తెలుగువారు కోల్పోయారు. చివరికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ తమిళ సోదరుల కుట్రల వల్ల తెలుగుకు ఎదురైన అడ్డంకిని తొలగిస్తూ శాశ్వతంగా నిలిచిపోయే వ్యాఖ్య చేసింది.‘ఇతర భాషలకు కూడా ప్రాచీన ప్రతిపత్తి కల్పించినట్టయితే తమిళ భాష ప్రాశస్త్యం కనుమరుగై పోతుందన్న తమిళ పిటిషనర్ వాదనను కోర్టు ఆమోదించ జాలదు. ఎందుకంటే ఒక భాష ప్రాశస్త్యం, ఉన్నతి మరొక భాష అభివృద్ధి మీద, పతనంమీద ఆధారపడి ఉండబోదని గ్రహించాలి.’ ఈ సందర్భంగానే ఒక భాషనూ, ఆ భాషకు సంబంధించిన పదాలనూ ప్రస్తావిస్తూ ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ ‘ప్రపంచ భాష’లలోని ప్రతి పదమూ ‘సంరక్షించదగిన ఒక నక్షత్రమే’నన్న చెప్పిన సంగతి మరచి పోరాదు. భాష ప్రాచీనతకు ఏది కొలమానం, ఏది కాదు అన్న మీమాంస ఇప్పటిది కాదు. చివరికి ‘సంస్కృతం’ ఎవరికీ మాతృభాష కాకపోవడానికి, దాని ‘లిపి’ కృత్రిమమైనదని అనడానికి కారణాల్ని వెల్లడిస్తూ అది ‘యాదృ చ్ఛిక సంఘటన’ అనీ, కనుకనే దానిని ‘సంస్కరించవలసి’ వచ్చిందనీ (Sancort or Sanctum Scriptum) కర్నల్ వాన్ కెన్నెడీ అనే పరిశోధక పండితుడు ఒక సుదీర్ఘమైన బృహత్ గ్రంథం రాశాడు. కనుకనే దాని పుట్టు వెంట్రుకల తబ్శీళ్లు తెలియరావని, అందుకే అది ఎవరికీ మాతృభాష కాకుండా కృత్రిమ లిపిగా ఉండిపోయి ఎదుగుదల లేని మృతభాషగా ఉండి పోవలసి వచ్చిందనీ వాన్ కెన్నెడీ పేర్కొన్నాడు. (‘ది ఆరిజన్ ఆఫ్ సాంస్క్రీట్’ గ్రంథం, 9వ అధ్యాయం 1, పేజీ–450). దీని ఆవిర్భావం పశ్చిమాసియా. భాషలన్నీ పరస్పరం తోబుట్టువులు అనుకున్నప్పటికీ, ‘కన్న వారెవరో మాత్రం తెలియద’న్నాడు క్లాప్రోత్ అనే మరొక భాషా శాస్త్ర పండితుడు. బహుశా అందుకనే ఒక భాష ఆవిర్భావ, ప్రగతి దశలకు ప్రాచీనత, శిష్ట ప్రతిపత్తిని ఒక నిర్దిష్ట కాలానికే యూరోపియన్లు పరిమితం చేయలేదని గుర్తించాలి. కనుకనే వారు భాష, సాహిత్యాదులకు, వాస్తు, కళాది రంగాలకు కాలాతీతమైన విలక్షణతను (ఏజ్‌లెస్ డిస్టింక్షన్) ఆపాదించవలసి వచ్చింది. రచననూ, దాని శైలినీ, విశ్వజనీన లక్షణాన్నీ అది ఏ కాలానికి చెందినా– ప్రాచీనమైనా, ఆధునికమైన ‘క్లాసిక్’ అన్నారు లేదా క్లాసికల్ రచన అన్నారు. ఈ ప్రమాణాలతోనే షేక్స్పియర్ నాటకాలనీ, ‘గాన్ విత్ ది విండ్’ లాంటి చలన చిత్రాలని గానీ, సరికొత్త పోకడలు పోయిన చిత్ర కళాఖండాలను, బీథోవెన్, మొజార్డ్, హెడెన్ వంటి వారి సంగీతాన్ని ‘క్లాసికల్ యుగం’ లోనివిగానే భావించారు. చివరికి 18–19 శతాబ్దాలలో రాజకీయ, ఆర్థిక, మానవీయ శాస్త్రాలలో వచ్చిన, తరువాత ఆడమ్ స్మిత్ ‘వెల్త్ ఆఫ్ నేషన్స్’, రికార్డో ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్’, మిల్ ‘పొలిటికల్ ఏకానమీ’, కారల్ మార్క్స్ ‘లేబర్ థీరీ ఆఫ్ వాల్యూ’ వంటి రచనల్ని కూడా క్లాసికల్ కానికి చెందినవిగానే కీర్తించవలసి వచ్చింది. అలాగే నన్నయ నుంచి పోతన దాకా, శ్రీశ్రీ నుంచి నారాయణరెడ్డి, జాషువా; సుబ్బు లక్ష్మి, సుశీల, బాలమురళీలు గాత్ర మాధుర్యంతో గాంధర్వ లోకాలు చూపిం చిన వారంతా పేరుకు ఆధునికులైనా, కాలనియతి లేని క్లాసికల్ యుగకర్తల కిందికే వస్తారు. తెలుగు భాష ప్రాచీనతకు మరొక నిదర్శనంగా సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడూ, ప్రామాణిక పండితుడైన జార్జి థాంప్సన్ ‘ప్రాచీన కాలం నుంచి చుట్టరికాలకు, బంధుత్వాలకు సంబంధించిన పేరుకు బహుళ సంఖ్యలో ప్రత్యామ్నాయ పదాలున్న భాష ప్రపంచ భాషల్లో ఒక్క తెలుగు భాష మాత్రమేనని’ ప్రాచీన గ్రీస్ చరిత్రలో పేర్కొనడం మనకి గర్వకారణం. తెలుగును ‘సుందర తెలుగు’ అని ప్రశంసించినందుకు తమిళ మహా కవి సుబ్రహ్మణ్య భారతిని, ద్రావిడ భాషా కుటుంబంలోని తమిళ, తెలుగు భాషల వ్యాకరణ సంప్రదాయాలు సింధు నాగరికత వారసత్వమేనని సమాన హోదాతో అంగీకరించిన ప్రసిద్ధ తమిళ పండితుడు పరిశోధకుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య మలయాండేనీ తమిళ చాందసులు వెలివేసినంత పనిచేశారు. తమిళనాడులోని వైగై నదీలోయ, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర లోయలోనూ తెలుగు, తమిళ సంస్కృతాలు మూడు పూవులూ, ఆరు కాయలుగా ప్రవర్ధి ల్లుతూ వచ్చాయని మలయాండే నిరూపించాడు. తెలుగు లిపికి మూలమైన ‘బ్రాహ్మీ’ కూడా ద్రవిడ భాషా కుటుంబంలోనిదేనని ఆంధ్రప్రదేశ్ సర్వీసులో పనిచేసిన తమిళ పండితుడు కాశిపాండ్యన్, ఎడ్వర్డ్ థామస్‌లు స్పష్టం చేశారు. ఈ ఆధారాలకు తుల్యమైనవే రాయప్రోలు వారు ‘తన గీతి అఱవ జాతిని పాఠకులుగా దిద్ది వర్ధిల్లిన తెలుగువాణి’ అర్పించిన కైమోడ్పులు. సుర వరంవారు ‘ఆంధ్రకుమారి’ని తలచుకుంటూ ‘తేనెతేటల నవకంపు సోల కును సాటియగును మా తెలుగు భాషమతల్లి’ అని కీర్తించారు. అదీ తెలుగు సొగసు. ‘వచ్చిండన్నా, వచ్చాడన్నా’ ఒకటే. కృత్రిమ విభజనతో పలకరిం పులు మరుగున పడినట్టు అనిపించినా మళ్లీ ఆత్మీయతలు చిగురించే కాలం రాకపోదు. అందాకా ‘ఇది మా తెలుగు కాదు’ అనకుండానే ఉభయత్రా మాండలిక, ప్రాదేశికాల మాధుర్యాన్ని జుర్రుకోవచ్చు. అయితే ఒకటి. తెలుగు ప్రతిపత్తికి పట్టిన గ్రహణం వీడిందని అనుకున్నా, బోధనా భాషగా తెలుగు ఎదగకుండా అడ్డుపడుతున్న గ్రహణం అలానే ఉంది. అది దుస్సహం. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘క్లాసికల్’ పీటముడికి సత్వర స్పందనే పరిష్కారం
సందర్భం ఏ దశలోనైనా గుర్తింపుపొందిన సాహిత్యం ఆ భాషలో వచ్చి ఉంటే దాన్ని విశిష్ట భాషగా గుర్తించవచ్చనేది యునెస్కో వంటి సంస్థల అవగాహన. దీనికీ, శాసనాలు వెతుక్కుని ప్రాచీనతలు నిర్ధారించుకునే చాదస్తానికి ఎలాంటి సంబంధం లేదు. తెలుగు, కన్నడ, మలయాళ, ఒడియా భాషలకు క్లాసికల్ హోదా వర్తింపునకు సంబం ధించి మద్రాస్ హైకోర్టు పంపిన నోటీసులకు జవాబు గా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాట క, కేరళ, ఒడిశా ప్రభుత్వాలు తమ వాదనలను ఈ బుధవా రం (ఏప్రిల్ 8) సమర్పించా ల్సి ఉంది. ఆ ప్రభుత్వాలు తమ తమ భాషలకు విశిష్ట హోదా రావడం, ఏ విధం గానూ తమిళ భాషాభివృద్ధికి విఘాతం కాదని హైకోర్టు కు విన్నవించాలి. అంతేకాకుండా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా తమిళుడైన ఆర్ గాంధీ, ఈ నాలుగు భాషల అభివృద్ధికి ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన క్లాసికల్ (విశిష్ట) హోదాకు అకారణంగా అడ్డుపడు తున్నారనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లాలి. ఈ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అంశంపై సమాధానం ఇచ్చేటప్పడు, తమ భాషల పరిరక్షణా, పరిశోధనా రంగాల అభివృద్ధి ఏ విధంగానూ తమిళ ప్రజల ప్రయో జనాలకు నష్టం కలిగించదని కోర్టుకు స్పష్టం చేయాలి. అసలుకు క్లాసికల్ హోదా అంటే ఏమిటో ఈ రాష్ట్రా లలో ఏ మేరకు అవగాహన ఉందో చూద్దాం. ఈ ఆంగ్ల పదాన్ని ఒక్కో రాష్ట్రం వారు ఒక్కోలా తమ భాషలో వ్యవహరిస్తున్నారు. ‘శాస్త్రీయ తమిళ్’ అంటూ హిందీలో ఉపయోగిస్తూనే, ‘సెందమిళ్’ అంటూ తమ తమిళ భాషా భివృద్ధి సంస్థను మైసూరు నుంచి వేరు చేసి తమ రాష్ట్రం పట్టుకుపోయి ఎంచక్కా కేంద్రప్రభుత్వ నిధులతో ఒరిగే సమస్త లబ్ధినీ 2008 నుంచీ పొందుతున్నారు. ఇక కన్నడలో దీన్ని ‘అభిజాతె కన్నడ’ అంటున్నారు. మనం తెలుగులో ప్రాచీన భాష అంటున్నాము. మలయాళంలో ‘శ్రేష్టభాష’ అంటున్నారు. ఒడియాలో ‘శాస్త్రీయ మాన్య త’ అంటున్నారు. వీటిలో ఏ పేరూ క్లాసికల్ అంటే సాహి త్య విశిష్టత అనే అర్థంలో లేదు. దాదాపు అన్ని భాషల వారూ ఈ హోదా విషయమై క్లాసికల్ అనే పదానికి సం స్కృతపదాన్నే తమ భాషలో వాడుతున్నారు. వాస్తవానికి ఏ దశలోనైనా విశిష్టంగా గుర్తింపు పొం దిన సాహిత్యం ఆ భాషలో వచ్చి ఉంటే ఆ భాషను విశిష్ట భాషగా గుర్తించవచ్చనేది అంతర్జాతీయ విద్యావంత సమాజంలో, యునెస్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు గల అవగాహన, దీనికీ శాసనాలు వెతుక్కుని ప్రాచీన తలు నిర్ధారించుకునే చాదస్తానికి ఎలాంటి సంబంధం లేదు. మనం ప్రాచీనం అనుకున్నాం కాబట్టి, అలా తమి ళులు తప్పుదారి పట్టించారు కాబట్టి, అందరం ఈ ప్రాచీనతే విశిష్టత అని నమ్ముతూ నిష్ఫలంగా వెతు క్కుంటూ పోతున్నాం. అదే తమిళులకు కూడా కావల సింది కాబట్టి, గుట్టు చప్పుడు కాకుండా వారి భాష సంస్థ అభివృద్ధి అవుతుండగా, మిగతా దక్షిణాది భాషల అభివృద్ధిని వారు కేసుల ద్వారా తొక్కి పట్టి ఉంచుతు న్నారు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మిగిలిపోయాం. ఇప్పటికైనా ఈ కేసునుంచి త్వరగా బయటపడి తెలుగు క్లాసికల్ సంస్థను రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ముందుగా ఆర్ గాంధీ అనే తమిళుడు మనకు వ్యతిరేకంగా వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించే కోర్టుకు చెప్పాల్సిన అంశాలపై తెలుగు రాష్ట్రాలకు స్పష్టత ఉండాలి. తనను తాను ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకుని భాషాభిమానిగా చెన్నై నివాసి తొమాటి సంజీవరావు వ్యక్తిగా ఒంటి చేత్తో పోరాడుతూ చూపుతున్న అంకితభావం మన ప్రభుత్వాలకూ, పౌర సమాజానికీ ఆదర్శం కావాలి. గుర్తించాల్సిన అంశాలు: 1. క్లాసికల్ అంటే కాల సూచి కాదు. ఆయా భాషా సాహిత్యాలలో ఒక విశిష్ట రచన వచ్చిందా అన్న దానికి సంబంధించిన గుర్తింపు మాత్రమే. 2. ఎంత వేల ఏళ్ల కిందటి ‘సంగం’ సాహి త్యం గురించి తమిళులు మాట్లాడినా వారు 2008లో ఈ క్లాసికల్ హోదా పొందినప్పుడు, కాల నియమం ఒక వెయ్యి ఏళ్లు మాత్రమే ఉన్నది. దీనిని వారు పొందాల్సిన లబ్ధి పొందాక, 2009లో సంస్కృతానికి కూడా ఈ క్లాసి కల్ హోదా ఇస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం 1500- 2000 ఏళ్లుగా సవరించింది. 3. దీనిపై అంతర్జాతీయం గా ఏ మార్గదర్శక నిబంధనావళి లేదు. నాలుగు వందల ఏళ్లు చరిత్ర లేని భాషలను కూడా అంతర్జాతీయ సమా జం క్లాసికల్ భాషలుగా గుర్తించింది. 4. పెపైచ్చు వేల ఏళ్ల కిందటే తమ భాషలో రచనలు ఉన్నాయని చెబు తున్న తమిళులు ఎరగవలసింది ఏమిటంటే, ఆ రచనలు జరిగింది మూల ద్రవిడంలో, అంటే, మొత్తం దక్షిణాది భాషలకు కుదురు అయిన భాష అది. 5. అయిదు వం దల ఏళ్లు మించిన రచనా వారసత్వం లేని మలయాళం, ఒడియా భాషలు క్లాసికల్ హోదాకు అర్హం అని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడే కాల నియమ నిబంధనతో క్లాసికల్ హోదాకు సంబంధం లేదన్న అవగాహన గల అంతర్జాతీయ సమాజపు ఆలోచనకు దగ్గరగా వచ్చినట్టే. అందువల్ల, తెలుగు, కన్నడ, భాషా సమాజాలు ఇప్పు డిక తాము అంత ప్రాచీనులం అంటే ఇంత ప్రాచీనులం అని శాసనాలు చూపెట్టే ఈ తెలివి తక్కువ పనులు మానుకుని, తగు వాదనలతో, తమ జవాబులను కోర్టు కు సమర్పించాల్సి ఉన్నది. 6. అటు కేంద్ర ప్రభుత్వ మూ, ఇటు ఈ నాలుగూ రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో సమర్పించే విషయపు ఏకాభిప్రాయంపైనే, ఈ కేసు త్వరగా తేలే విషయం ఆధారపడి ఉన్నది. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్రాల సాంస్కృతిక శాఖలు తక్షణ చర్యలు, ఏడేళ్ల కాలం గడిచిపోయిన ఈ తరుణంలోనైనా మొదలు పెట్టగలిగితే, మంచి జరుగుతుంది. 7. పౌర సమాజం, అందుకు తగు ఒత్తిడిని, సాంఘికంగా, సాం స్కృతికంగా, ఆచరణ చేయవలసిన రాజకీయ వర్గాలపై తీసుకురావడం, ప్రభుత్వ వర్గాలను సచేతనం చేయడం మనం అందరం చేయవలసిన పని. (వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 98492 00385