breaking news
clash between two persons
-
ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌కు చేదు అనుభవం
చెన్నై: వారిద్దరూ ప్రజాప్రతినిధులు.. పక్కవారికి మంచి చెప్పాల్సిందిపోయి చిన్న విషయానికే గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యలోకి వచ్చి సర్ధిచెప్పే ప్రయత్నం చేసిన కలెక్టర్‌ను ఒక్క తోపు తోయడంతో కిందపడిపోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అంతకుముందే ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ రాష్ట్రమంత్రి రాజ కన్నప్పన్కు, స్థానిక ఎంపీ నవాస్ ఖనికి ఆహ్వానాలు పంపించారు. ఈ క్రమంలో సరైన సమయానికి మంత్రి రాజ కన్నప్పన్ హాజరయ్యారు. కానీ, ఎంపీ నవాస్ ఖని మాత్రం సమయానికి రాలేదు. దీంతో, మంత్రి కన్నప్పన్, జిల్లా కలెక్టర్ విష్ణు చంద్రన్ కలిసి అవార్డుల ప్రదానోత్సం ప్రారంభించారు. అర్హులైన వారికి అవార్డులు ప్రదానం చేస్తుండగా ఎంపీ ఖని అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో తాను లేకుండా అవార్డులు ప్రదానం చేయడంపై సీరియస్ అయ్యారు. తాను రాకముందే కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా మంత్రికి, ఎంపీకి, ఆ ఇద్దరి అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వేదికపై ఉన్న కలెక్టర్ వారిద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆవేశంలో ఉన్న ఇద్దరు నేతలు.. ఆయనను తోసిపడేశారు. దీంతో, అక్కడే సోఫా ఉండటంతో ఆయన కింద పడిపోకుండా ఆ సోఫాలో కూలబడిపోయారు. కలెక్టర్ కిందపడిపోయినా మంత్రి, ఎంపీ మాత్రం తమ గొడవను ఆపలేదు. ఇక, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Fascist @arivalayam and its allies pushed down the @CRamanathapuram into the quarrelling crowd. I condemned this barbaric act. பாசிஸ்ட் திமுகவும் அதன் கூட்டணியும் மாவட்ட ஆட்சித் தலைவரை சண்டையிடுபவர்களுக்கு மத்தியில் கீழே தள்ளி விட்டு விட்டார்கள். காட்டுமிராண்டித்தனமான இந்த… pic.twitter.com/r77o6v3jmi — Dharani R Murugesan (@Dharaniramnad) June 17, 2023 మరోవైపు, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. వారిద్దరూ కలెక్టర్‌తో వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. డీఎంకే పాలన అప్రజాస్వామికమని విమర్శించారు. ఇది ద్రావిడ అభివృద్ధి నమూనానా? అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: విమానం గాల్లో ఉండగా సడెన్‌గా డోర్ ఓపెన్.. ప్రముఖ సింగర్ టీమ్‌కు తప్పిన ప్రమాదం -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
ప్రకాశం జిల్లా : గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారాయణరెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రంగడు శుక్రవారం కత్తితో గాయపర్చాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.