breaking news
CK blues
-
సీకే బ్లూస్ విజయం
సాక్షి, హైదరాబాద్:సాయిసుశాంత్ (134 నాటౌట్), ఆర్. సుశాంత్ (91) అద్భుత బ్యాటింగ్‌తో ఎ-డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో సీకేబ్లూస్ జట్టు 2 వికెట్ల తేడాతో నోబుల్ సీసీపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నోబుల్ సీసీ 44.5 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. అనిరుధ్ కపిల్ (105), మొహమ్మద్ శంషుద్దీన్ (111) సెంచరీలతో రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రతీక్ 5, అశ్వద్ రాజీవ్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 282 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సీకే బ్లూస్ జట్టు 44.3 ఓవర్లలో 8 వికెట్లకు 285 పరుగులు చేసి గెలిచింది. సారుు సుశాంత్ అజేయ సెంచరీతో చెలరేగగా... ఆర్. సుశాంత్ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. నోబుల్ సీసీ బౌలర్లలో హిమాన్షు చౌదరీ 5, కె. ధ్రువ సారుు 3 వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయ్‌పురి విల్లోమెన్: 244 (విక్రమ్ 72, అఫ్రోజ్ పాషా 49; అనూప్ సింగ్ 3/39), సికింద్రాబాద్ క్లబ్: 204 (సంజీవ్ 83; షకీర్ అహ్మద్ 3/32). మహేశ్ సీసీ: 201/7 (షకీర్ 30, నరేశ్ 38; కేసరి శ్రీకాంత్ 3/25), అంబర్పేట్ సీసీ: 204/6 (శ్రీకాంత్ 73, రిజ్వాన్ 64). కాకతీయ సీసీ: 256/9 (రాము 54, రవి 42; జయదేవ్ 3/31), సికింద్రాబాద్ క్లబ్: 192 (సీవీ ఆనంద్ 74; రాజశేఖర్ 3/44). భారతీయ సీసీ: 334/9 (జగదీశ్ 106 నాటౌట్, పృథ్వీ 60; జాఫరుల్లా ఖాన్ 7/30), ఎలెవన్ మాస్టర్స్: 307 (కమల్ సావరియా 154, జాఫరుల్లా ఖాన్ 64; దత్తు 5/50, హరీశ్ 3/37). ఆర్జేసీసీ: 280 (పృథ్వీ 53, సతీశ్ 71; జయచంద్ర 3/60), విమ్కో సీసీ: 140 (రోహిత్ 30). ఆడమ్స్ ఎలెవన్: 274/8 (సచిన్ కుమార్ 33, దుర్గేశ్ 152, ఫయాజ్ 46), బాయ్స్ టౌన్: 135/8 (ఖురేషి 42, ముస్తఫా 44 నాటౌట్; దుర్గేశ్3/36). పీఎన్ యంగ్‌స్టర్స్: 135 (బిలాల్ 43; శేషగిరి 3/27), ఎస్‌యూసీసీ: 140/1 (రజనీకాంత్ 35, యశ్వంత్ 36 నాటౌట్, చంద్రశేఖర్ 60 నాటౌట్). ఏకలవ్య సీసీ: 143/9, స్టార్లెట్స్ సీసీ: 145/8 (సుముఖేశ్ 42; తిలక్ 4/17). ఏబీ కాలనీ: 95 (వైష్ణవ్ 5/33, నితిన్ 4/16), విక్టరీ సీసీ: 96/7. యాదవ్ డెరుురీ: 231/7 (ప్రణీత్ 85, ప్రణవ్ 77 నాటౌట్; వంశీ 4/45), వాకర్ టౌన్: 225 (అబ్దుల్ 48, సందీప్ 52; సాహిల్ 4/58). ఎస్కే బ్లూస్: 315 (ప్రదీప్ 118, బిశ్వజీత్ 70; అనిరుధ్ 4/66), టీమ్కుమ్: 146 (విఘ్నేశ్వర్ 62; బిశ్వజీత్ 4/18). ఎల్‌ఎన్‌సీసీ: 138 (మదన్క్షీర్ సాగర్ 6/46), హైదరాబాద్ పేట్రియాట్స్: 140/3 (పుణీత్ 30, శైలేష్ 46 నాటౌట్). కిషోర్ సన్స: 218 (నితిన్ 55, చిరాగ్ 43; నిఖిల్ 4/46, పృథ్వీ 4/46), గ్రీన్లాండ్స: 112 (నిఖిల్ 38; శేఖర్ 6/22). ఆల్‌సెయింట్స్: 94 (హన్స రాజ్ 6/30), లాల్ బహదూర్: 96/4 (సఫ్దర్ అలీ 35). సెయింట్ ఆండ్రూస్: 244 (ఆర్యన్ 80; జితేశ్ 3/38, భరత్ 3/63), సెయింట్ సాయి: 202 (జితేశ్ 110, హుస్సేన్ 39; ప్రియాంశు 3/37, శంకర్ 5/41). విజయ్ సీసీ: 181 (మయక్ 35, అర్జున్ 30; మూర్తి 3/30), యంగ్ సిటిజన్: 109 (అమర్నాథ్ 30; ఓంప్రకాశ్ 3/30, అర్జున్ 3/38, ఫరీద్ 4/29). అక్షత్ సీసీ: 195/9 (అవినాశ్ 40, రిత్విక్ 50 నాటౌట్), రిలయన్స సీసీ: 181 (లోకేశ్54, కేశవ్53; రోనక్ 3/56). సత్యం కోల్ట్స్: 71 (రిత్విక్ 32, రిషికేశ్ 32; రాహుల్ 3/10), శాంతి ఎలెవన్: 72/2. ఇంటర్నేషనల్ సీసీ: 239 (సచిత్ 48, ఆరోన్ జార్జ్ 34; సారుు వెంకట్ 3/30), సత్య సీసీ: 225 (సాత్విక్ 78; ఆర్యన్ 4/24). -
అశ్వద్ రాజీవ్ 9/48
అయినా సీకే బ్లూస్‌కు తప్పని ఓటమి ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: అశ్వద్ రాజీవ్ (9/48) సంచలన బౌలింగ్‌తో రాణించినప్పటికీ... అతని జట్టు సీకే బ్లూస్ బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం చవిచూసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ ప్యాట్రిక్స్ 69 పరుగుల తేడాతో సీకే బ్లూస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ ప్యాట్రిక్స్ 246 పరుగుల వద్ద ఆలౌటైంది. సాయి వినయ్ (51), రోహిత్ యాదవ్ (44), సాహిల్ కృష్ణ (39) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సీకే బ్లూస్ 177 పరుగులకే ఆలౌటైంది. బాలకృష్ణ (51) అర్ధసెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రోహిత్ 6, సుమిత్ 2 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆల్ సెయింట్స్: 319/8 (సాత్విక్ రెడ్డి 168, సయ్యద్ తమీమ్ 73; నీరజ్ కుమార్ 2/60, దేవేందర్ అగర్వాల్ 2/ 37); జై సింహా: 315/9 (ప్రమోద్ మహాజన్ 93, నీరజ్ 68, సాయి తేజ 52; ముజ్తజా 3/92, సాత్విక్ రెడ్డి 3/75). గ్రీన్లాండ్స్: 269/5 (సుధీంద్ర 109, పృథ్వీ రాజ్ 57, అనుజ్ యాదవ్ 51; గోపి 2/ 49); హైదరాబాద్ పాంథర్స్: 145 (ఆలౌట్) (విఘ్నేశ్ పటేల్ 26; నిఖిల్ 5/25, పృథ్వీరాజ్ 3/32). సెయింట్ ప్యాట్రిక్స్: 246 (ఆలౌట్) (సాయి వినయ్ 51, రోహిత్ యాదవ్ 44; రాజీవ్ 9/48); సీకే బ్లూస్: 177 (ఆలౌట్) (బాలకృష్ణ 57 నాటౌట్, సుశాంత్ 30; రోహిత్ యాదవ్ 6/41, సుమిత్ 2/44). వాకర్ టౌన్: 151 (ఆలౌట్) (చంటి 36, ప్రశాంత్ 29 నాటౌట్; మదన్ క్షీరసాగర్ 5/36, పవన్ వర్మ 3/49); హైదరాబాద్ పేట్రియాట్స్: 152/5 (మహేశ్ 62, విజయ్ 30; ఆశిష్ 2/23). ఎస్‌యూసీసీ: 251/9 (చరణ్ తేజ 120, యశ్వంత్ 38; ప్రభాజన్ 4/62); యునెటైడ్: 82/10 (అభయ్ స్వరూప్ 3/29). లాల్‌బహదూర్ పీజీ: 50 ( సాయి కార్తీక్ 6/5); మణికుమార్: 51/1. స్వస్తిక్ యూనియన్: 307 (అగ్రజ్ 50, వినోద్ కుమార్ 38,విజయ్ 100; ఫహీముద్దీన్ 3/52, లఖన్ 3/10); నోబెల్ సీసీ: 178 ( వినాయక్ 50, శంషుద్దీన్ 57; విజయ్ కుమర్ 5/46). టైమ్ సీసీ: 184 (సుమంత్ 44, బాబర్ 38); సత్యం కోల్ట్స్: 82 (చేతన్ 3/19, బాబర్ 5/10).