breaking news
cisf jawan
-
ఐదు కుటుంబాల్లో విషాదం
హైదరాబాద్: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా వివిధ కారణాలతో మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన మృతి చెందిన ఘటనలు బుధవారం కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ పరిధిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో.. హెచ్‌బీకాలనీ, వెంకటేశ్వరనగర్ కాలనీలో నివసించే శాంతం భాగ్యమ్మ(48) ఇళ్లలో పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. గత నెల 19న ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చీరకు అంటుకున్నాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ కలహాలతో గృహిణి.. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందిన గృహిణి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్‌బీకాలనీ, కృష్ణానగర్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ గోదావరికి చెందిన శ్రీకాంత్, హైమగంగా భవానీ దంపతులు 3 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి రెండు సంవత్సరాల వయసు ఉన్న పాప ఉంది. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల నడుమ గొడవ జరిగింది. మనస్థాపం చెందిన భవాని భర్త నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందింది. ప్రేమ విఫలమై.. ప్రేమ విఫలమైందని మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్‌బీకాలనీలో చోటుచేసుకుంది. ఎల్‌ఐజీకి చెందిన విద్యార్థి హబ్సీగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రేమ విఫలమైందన్న కారణంతో ఇంటో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. ఆర్థిక ఇబ్బందులతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. జార్ఖాండ్‌కు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ దినేష్ దాస్ రెండు సంవత్సరాల క్రితం బదిలీపై నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎఫ్సీకి వచ్చాడు. భార్యతో కలిసి ఎన్ఎఫ్సీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. సంతానం లేరు. అప్పుల బాధ తాళలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందినట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య ఉప్పల్: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ హనుమసాయినగర్‌లో నివాసముండే శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అన్విత్‌రెడ్డి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: గుర్తు తెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదరు యువతి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి మెట్రోస్టేషన్ గోడ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్లో ఉన్న సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమె మాటల్లో పెట్టి రక్షించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా యువతి పట్టించుకోలేదు. ఎలాగైనా ఆమె కాపాడాలన్న ఉద్దేశ్యంతో జవాన్లు.. ఆమె పై నుంచి దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. యువతిని కాపాడాలని సిబ్బంది ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా యువతి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ముందు జాగ్రత్తగా అధికారులు అంబులెన్స్‌ను పిలిపించడంతో వెంటనే ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 Something dangerous that I witnessed today when I reached Akshardham metro station...This girl in white shirt wanted to commit suicide, while DMRC employees and jawans tried their best to convince this girl. Although she jumped from the edge, but was rescued.@NewsroomPostCom pic.twitter.com/la2XCyu9Tn — Neha Singh (@NehaSingh1912) April 14, 2022 -
ఆపదలో చిక్కుకుంది.. రియల్ హీరో కంటపడింది
నిజమైన హీరోలు ఎవరో తెలుసా? దేశానికి కాపలా కాసే సైనికులు. అంతేనా.. ఆపదలో ఉన్నవాళ్లకు సాయం అందించేవాళ్లు కూడా ఆ ట్యాగ్‌కు అర్హులే. అలాంటిది ఆపదలో ఉన్న ఆ చిన్నారి రియల్ హీరో కంటపడింది. ఊరుకుంటాడా మరి?.. ఆ వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి మెట్రో స్టేషన్ దగ్గర ఆడుకుంటూ.. పైకి ఎక్కేసింది. తీరా 25 అడుగుల ఎత్తుకి చేరి.. అక్కడ చిక్కుకుపోయింది. భయంతో ఏడ్పు అందుకోగా.. ఆ ఏడ్పు విన్న కొందరు.. అక్కడే ఉన్న కొందరు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని సాయం కోరారు. వెంటనే.. ఉరుకుల మీద అక్కడికి చేరుకున్నాడు ఓ సిబ్బంది. #WATCH : राजधानी दिल्ली के निर्माण विहार मेट्रो स्टेशन पर ग्रिल में फंसी बच्ची, सीआईएसएफ जवान ने दिलेरी दिखा बच्ची को बचाया@CISFHQrs @OfficialDMRC video source _ @NeerajGaur_#delhimetro #cisf #Delhi pic.twitter.com/l4EY1JIuIq — Tarun Sharma (@tarun10sharma) February 28, 2022 జాగ్రత్తగా అక్కడికి చేరుకుని ఆ చిన్నారిని రక్షించి కిందకు తీసుకొచ్చాడు. ఆ దగ్గర్లోనే ఆ అమ్మాయి ఇళ్లు ఉందట!. అందుకే ఆడుకుంటూ అక్కడికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నిర్మాన్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య
మద్దిపాడు: పెళ్లయిన 38 రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది.. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాను అయిన భర్త ఢిల్లీ నుంచి వచ్చి మరీ రిజర్వాయర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన పొదిలి మహానంది (30)కి ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన తురకపల్లి ప్రియాంకతో గత డిసెంబర్ 29న వివాహమైంది. సంక్రాంతి పండుగ తరువాత తాను పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ క్యాంప్‌కు చేరుకున్నాడు. శుక్రవారం రాత్రి ప్రియాంక ఉరేసుకుని చనిపోయిందని సమాచారం రావడంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి రైలులో ఒంగోలు వచ్చాడు. ఒంగోలు నుంచి ఆటోలో మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బ్యాగ్, ఇతర లగేజ్ ఉంచి, రిజర్వాయర్ 14వ గేటు వద్ద తన దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్, పర్స్ వదిలేసి రిజర్వాయర్‌లోకి దూకేశాడు. అంతకు ముందు 4 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి తాను చనిపోవడానికి రిజర్వాయర్ వద్దకు వచ్చినట్లు తెలపడంతో బంధువులు వెంటనే బయలుదేరి రిజర్వాయర్ వద్దకు వచ్చి పరిశీలించగా ఫోన్, దుస్తులు కనిపించడంతో మద్దిపాడు ఎస్ఐ శ్రీరామ్‌కు సమాచారం అందించారు. గజఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది సాయంతో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. మహానంది తల్లిదండ్రులు, బంధువులు రిజర్వాయర్ వద్దకు వచ్చి మృతదేహాన్ని చూసి విలపించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. -
వైరల్: సల్మాన్‌ను అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ సెక్యురిటీ అధికారికి రివార్డు
బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్‌ను అడ్డుకున్నసెక్యూరిటీ అధికారిని సత్కరించినట్లు తాజాగా సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. కాగా ఇటీవల ‘టైగర్-3’ షూటింగ్ నేపథ్యంలో రష్యా వెళ్లెందుకు న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన సల్మాన్.. కారు దిగి చెకింగ్ దగ్గర ఆగకుండానే నేరుగా లోపలికి వెళ్లిపోతున్నాడు. దీంతో అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారి సల్మాన్‌ను అడ్డుకుని డ్యాక్యూమెంట్స్ చూపించాల్సిందిగా కోరారు. దీంతో ఆ అధికారికి అడ్డు చెప్పలేక సల్మాన్ డాక్యుమెంట్స్ చూపించి లోపలికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Salman Khan: చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీకి సల్మాన్ గ్రీన్ సిగ్నల్! The contents of this tweet are incorrect & without factual basis. In fact, the officer concerned has been suitably rewarded for exemplary professionalism in the discharge of his duty. @PIBHomeAffairs — CISF (@CISFHQrs) August 24, 2021 దీంతో సల్మాన్‌ను అడ్డుకున్నందుకు సదరు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారి ఇబ్బందుల్లో పడ్డారని, ఆయన ఫోన్‌ను సీజ్ చేసి అధికారులు వారించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. ఈ విషయంలో తమ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతేగాక తన ఫోన్‌ను సీజ్ చేయలేదని, కనీసం మందలించడం కూడా జరగలేదని తెలిపారు. ఆయన ఓ సెలబ్రిటీ అనేది సంబధం లేకుండా విధుల్లో తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించినందుకు సదరు అధికారిని సత్కరించి, రివార్డు ప్రకటించినట్లు సీఐఎస్ఎఫ్ తమ ట్వీట్లో పేర్కొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సీఐఎస్ఎఫ్లో కరోనా కలకలం
కోల్‌కతా : కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందిన ఓ జవాన్ శుక్రవారం మరణించారు. మరణించిన జవాన్‌ను కోల్‌కతాకు చెందిన జీఆర్ఎస్ఈఎల్ యూనిట్‌కు చెందిన సుశాంత్ కుమార్ ఘోష్‌గా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. కోవిడ్-19తో కోల్‌కతాలో ఇప్పటివరకూ ముగ్గురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది మరణించారు. ఇక ఈ నెల ఆరంభంలో నగరంలోని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఎస్ఐ (55) కోవిడ్-19 సోకి మరణించారు. అంతకుముందు కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం వద్ద విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ ఒకరు కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు. చదవండి : కరోనా మరణాల్లో చైనాను దాటిన భారత్ -
జవాన్ కాల్పులు : ఇద్దరు కొలీగ్స్ మృతి
జైపూర్ : స్వల్ప వివాదంతో ఆగ్రహానికి లోనైన ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ ఉద్ధంపూర్‌లోని శిబిరం లోపల కాల్పులు జరపడంతో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఉద్ధంపూర్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సుయి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ అంశంపై వాగ్వాదం చెలరేగడంతో జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపాడని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు జవాన్లను ఉద్ధంపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మరణించారని వైద్యులు నిర్ధారించారు. మరో బాధితుడికి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. -
లక్షల్లో కట్నం.. తిరస్కరించిన పెళ్లికొడుకు
జైపూర్ : వధువు కుటుంబసభ్యులు లక్షల్లో కట్నం ఇస్తామని చెప్పినా వరుడు అందుకు ఒప్పుకోకుండా కేవలం రూ. 11 కట్నం తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతనే రాజస్తాన్‌కు చెందిన జితేంద్ర సింగ్ కుమార్. వివరాల్లోకి వెళితే.. జితేంద్ర సింగ్ కుమార్ సీఐఎస్ఎఫ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 8న జితేంద్ర సింగ్ వివాహం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో వధువు తండ్రి కట్నం కింద రూ. 11 లక్షలు ఒక పళ్లెంలో తీసుకొని వచ్చాడు. దానిని జితేంద్ర సింగ్‌కు ఇవ్వబోతుంటే అతను అడ్డు చెప్పి తన రెండు చేతులు జోడించి కట్నం వద్దని తెలిపారు. సంప్రదాయ ప్రకారం రూ. 11తో పాటు ఒక కొబ్బరిబొండంను వదువు తల్లిదండ్రుల నుంచి స్వీకరించారు. 'నాకు అర్ధాంగిగా రానున్న వ్యక్తి రాజస్తాన్ జ్యుడీషిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఆమె పరీక్షలో పాసయి జిల్లా కలెక్టర్‌గా ఎంపికైతే మా కుటుంబానికి అంతకు మించిన ఆనందం ఏముంటుంది. నాకు డబ్బు ముఖ్యం కాదని, కుటుంబ సంతోషమే గౌరవమని' జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ మాటలకు వధువు తండ్రి ముఖం కన్నీళ్లతో నిండిపోవడం అక్కడున్నవారిని భావోద్వేగానికి గురి చేసింది. ' మొదట్లో అతను డబ్బు వద్దన్నప్పుడు నేను కంగారు పడ్డాను.వరుని కుటుంబసభ్యులు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సరిగా లేవని అనుకున్నారేమోనని భావించా. కానీ వారి కుటుంబం వరకట్నానికి వ్యతిరేకత అని తెలుసుకొని చాలా సంతోషించా' అని వధువు తండ్రి ఆనందంగా పేర్కొన్నారు. -
సెలవు కోసం గొడవ.. నలుగురిని కాల్చేశాడు!
అతడు రెండు నెలల పాటు యోగా శిబిరానికి హాజరై వచ్చాడు. మళ్లీ సెలవు కావాలన్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ అతడికి ఒక్కసారిగా కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిల్ తీసుకున్నాడు.. దాన్ని అన్‌లాక్ చేశాడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురు తోటి జవాన్లను బలిగొన్నాడు. ఈ ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గల నబీ నగర్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీజీసీఎల్) యూనిట్లో జరిగింది. నిందితుడు బల్వీర్‌సింగ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక ఏఎస్ఐ కూడా ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. విధులు ముగించుకుని షిఫ్ట్ మారుతున్న సమయంలో జవాన్లు ఒకచోట చేరారు. ఇంతలో అక్కడ చిన్న వివాదం తలెత్తడంతో అకస్మాత్తుగా బల్వీర్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. "బల్వీర్ తన సర్వీస్ రైఫిల్ తో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది సహోదర హత్యతో సమానం" అని ఎస్పీ అన్నారు. ఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారని తెలిపారు. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించిందని సీఐఎస్ఎఫ్ పేర్కొంది. బిహార్ విద్యుత్తు బోర్డులో ఎన్టీపీసీ, ఎన్సీజీసీఎల్ జాయింట్ వెంచర్‌గా నడుస్తున్నాయి. -
ఆరుగురే..
హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు త్వరలో బాధ్యతల స్వీకరణ మదురై ధర్మాసనానికి సీఐఎస్ఎఫ్ భద్రత ఆ న్యాయమూర్తిపై చర్యలు తప్పవు సీజే వ్యాఖ్య సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టులో ఖాళీల భర్తీకి కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. అయితే, ఆరుగుర్ని మాత్రమే నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు. మదురై ధర్మాసనానికి సీఐఎస్ఎఫ్ భద్ర త కల్పించేందుకు తగ్గ పరిశీలనకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, మదురై మేలూరు ధ ర్మాసనం న్యాయమూర్తి మహేంద్ర భూ పతిపై చర్యలు తప్పవని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మద్రాసు హైకోర్టు పరిధిలో మదురై ధర్మాసనం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిధిలో న్యాయమూర్తుల సంఖ్య 75 ఉండాల్సి ఉంది. అయితే, 34 మంది మాత్రమే ఉ న్నారు. 41 పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులకు పని భారం ఎక్కువే. ఈ పరిస్థితుల్లో మరో రెండు మూడు నెలల్లో ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య మ రింతగా పెరగడం ఖాయం. ఖాళీల భర్తీ ని మిత్తం తొమ్మిది మందితో కూడిన జాబితాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సిఫారసు చేశారు. ఇందులో ఆరుగురు సీనియర్ న్యాయవాదులు, ముగ్గురు జి ల్లా జడ్జిలు ఉన్నారు. అయితే, ఈ జాబితా మీద వ్యతిరేకత బయలు దేరడం, తదుపరి మార్పులు చేర్పులు సాగి, చివరకు సుప్రీం కోర్టు, కేంద్ర న్యాయ శాఖ ఆరుగురి నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ఇందులో నలుగురు సీనియర్ న్యాయవాదులు, ఇద్దరు జిల్లా జడ్జీలు ఉన్నారు. న్యాయవాదుల్లో భారతీదాసన్, ఎస్ఎస్ సుందర్, ఎంవీమురళీ ధర్, కృ ష్ణకుమార్ త్వరలో న్యాయమూర్తులుగా పదవులు చేపట్టబోతున్నారు. అలాగే, జిల్లా జడ్జిగా ఉన్న గోకుల్ దా సు, హైకోర్టు రిజిస్టార్ హో దాతో ఉన్న పొన్ కలైయరసన్‌లు ఉన్నారు. అయితే, గోకుల్ దాసు జిల్లా జడ్జిగా మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందనున్నడం గమనార్హం. హైకోర్టు న్యాయమూర్తులుగా ఈ ఆరుగురి నియామకం ఇక లాంఛనమే. ఈ ఆరుగురి సంతకాల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి దరఖాస్తులు హైకోర్టుకు వచ్చి చేరాయి. సంతకాల అనంతరం బుధవారం రాష్ర్టపతి భవన్‌కు పంపించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తరువాయి, ఈ ఆరుగురు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మదురై ధర్మాసనంకు భద్రత: మద్రాసు హైకోర్టుకు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) భద్రత గత ఏడాది కల్పించిన విషయం తెలిసిందే. ఇదే భద్రతను మదురై ధర్మాసనంకు కూడా కల్పించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.సుమోటోగా కేసును స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ అందుకు తగ్గ పరిశీలనకు ఆదేశించింది. బుధవారం ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ చేస్తూ, ఏప్రిల్ ఐదో తేదిన న్యాయమూర్తి నేతృత్వంలో నియమిం చిన భద్రతా కమిటీ సమావేశం కావాలని, మదురై ధర్మాసనంలో సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాట్లకు తగ్గ పరిశీలన చేపట్టాలని సూచించారు. అలాగే, సీఐఎస్ఎఫ్ భద్రతకు గాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిం చాల్సిన మొత్తం ఇంకా అందని దృష్ట్యా, అందుకు తగ్గ చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో భద్రతా కమిటీ నేతృత్వంలో ఐదో తేదీ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టి ఉన్నారు. ఇందులో ఆ కమిటీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, సీఐఎస్ఎఫ్ వర్గాలు పాల్గొననున్నాయి. చర్యలు తప్పవు: గ్రానైట్ స్కాం నిందితులు పిఆర్ పళని స్వామి, సహాదేవన్లను ఓ కేసు నుంచి విడుదల చేస్తూ మదురై జిల్లా మేలూరు కోర్టు న్యాయమూర్తి మహేంద్ర భూపతి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హై కోర్టు పర్యవేక్షణలో గ్రానైట్ స్కాం విచారణ సాగుతున్న సమయంలో ఆ న్యాయమూర్తి తీర్పు చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఆ న్యాయమూర్తిపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో,తాజా తీర్పు వ్యవహారం హైకోర్టుకు చేరింది. కృష్ణమూర్తి అనే న్యాయవాది తాజా తీర్పు వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి సం జయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే మదురై ధర్మాసనం నుంచి ఆ న్యాయమూర్తిపై చర్యకు సిఫారసులు వచ్చినట్టు, అందుకు తగ్గ ప్రక్రియ ముగియగానే చర్యలు తప్పదని సీజే వ్యాఖ్యానించడం విశేషం. -
పని ఒత్తిడి ఎక్కువై.. ముగ్గురిని చంపేశాడు!
భద్రతా దళాలకు పని ఒత్తిడి ఎక్కువ కావడం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో సీఐఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రతాప్ సింగ్ బుధవారం తెల్లవారుజామున సహచరులపై కాల్పులు జరిపి ముగ్గురిని హతమార్చి, మరో ఇద్దరిని గాయపర్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నరోరా అణు విద్యుత్ ప్లాంటు నుంచి ఇటీవలే అతడు కల్పకం ప్లాంటుకు బదిలీ మీద వచ్చాడు. ఇక్కడ పని ఒత్తిడి బాగా ఎక్కువ కావడం, దానికితోడు ఇంటికి దూరంగా ఉండటంతో భరించలేకపోయాడు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలోకల్పకం టౌన్షిప్లో సీఐఎస్ఎఫ్ జవాన్లంతా రోల్ కాల్‌కు వెళ్తారు. మొత్తం 110 మంది జవాన్లు అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో విజయ్ ప్రతాప్ సింగ్ ముందుగా ఆయుధాల స్టోర్స్‌కు వెళ్లి, అక్కడినుంచి 9 ఎంఎం స్టెన్ గన్, 60 బుల్లెట్లు తీసుకున్నాడు. ముందుగా బ్యారక్స్‌లోని మొదటి అంతస్థుకు చేరుకుని, అక్కడ సిబ్బందికి డ్యూటీలు వేసే మోహన్ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపాడు. రాజస్థాన్‌కు చెందిన అతడు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత పోర్టికోలోకి వెళ్లి అక్కడ విధులకు హాజరవుతున్న బలగాలపై కాల్పులు జరిపాడు. దాంతో సేలంకు చెందిన ఏఎస్ఐ గణేశన్ (58), మదురైకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు (54) కూడా మరణించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఏఎస్ఐ ప్రతాప్ సింగ్, జమ్ము కాశ్మీర్‌కు చెందిన కానిస్టేబుల్ గోవర్ధన ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఎలాగోలా సహచరులు విజయ్ ప్రతాప్ సింగ్‌ను పట్టుకుని, ఒక గదిలో వేసి తాళం పెట్టారు. తర్వాత పోలీసులు అతడి మీద ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం) కింద కేసులు పెట్టారు.