జవాన్ కాల్పులు : ఇద్దరు కొలీగ్స్ మృతి

జైపూర్ : స్వల్ప వివాదంతో ఆగ్రహానికి లోనైన ఓ సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఉద్ధంపూర్‌లోని శిబిరం లోపల కాల్పులు జరపడంతో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఉద్ధంపూర్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సుయి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ అంశంపై వాగ్వాదం చెలరేగడంతో జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపాడని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు జవాన్లను ఉద్ధంపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మరణించారని వైద్యులు నిర్ధారించారు. మరో బాధితుడికి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి