breaking news
cinema complex
-
భూమా సినీ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
సాక్షి, తిరుపతి: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూమా సినీ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భూమా కాంప్లెక్స్ మూతపడింది. -
ఆసియాలో అతి పెద్ద స్క్రీన్
దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలిసారిగా.. ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్‌ని ప్రేక్షకులు చూడబోతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ‘వీ’ సెల్యూలాయిడ్ మల్టీ సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘సాహో’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ఆరంభం కానుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో మూడు సినిమా థియేటర్లను ఈ కాంప్లెక్స్‌లో నిర్మించారు. ఇందులో ఒక థియేటర్లో మాత్రం భారతదేశంలోనే ఎక్కడా లేనంత స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రపంచస్థాయిలో తీసుకుంటే ఇది మూడో భారీ స్క్రీన్ అని ప్రచారం జరుగుతోంది. ఆసియా ఖండంలో కూడా ఇదే మొదటి స్క్రీన్ అని సమాచారం. 106 అడుగులు వెడల్పు, 94 అడుగులు నిలువు స్క్రీన్ ఏర్పాటుతో పాటు 670 సీట్లు కెపాసిటీతో త్రీడీ సౌండ్ సిస్టమ్‌తో అత్యంత అ«ధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మిగిలిన రెండు థియేటర్లు 180 సీట్లు కెపాసిటీతో నిర్మించారు. సుమారు 7 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ గ్రూప్ థియేటర్స్‌ను నిర్మించారు. ఈ మల్టీ సినీ కాంప్లెక్స్ ప్రభాస్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని సమాచారం. -
సినీ కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం
ఫ్రాంక్‌ఫర్డ్(జర్మనీ): జర్మనీలోని ఓ సినీ కాంప్లెక్స్ లో దుండగుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఫ్రాంక్ఫర్డ్లోని వీర్న్హ్యిమ్ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆగంతకుడు ముసుగు ధరించి ఆయుధాలతో కాంప్లెక్స్‌లోకి దూసుకొచ్చి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 50 మందికి పైగా గాయాలయినట్టు సమాచారం. సినీ కాంప్లెక్స్‌ను పోలీసులు చుట్టుముట్టి దుండగుడిని కాల్చిచంపారు.