breaking news
chilakalguda
-
ఉద్యోగం రాలేదని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
చిలకలగూడ: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాసనగర్‌కు చెందిన ప్రబంధ (20) సైదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇటీవల మూడు ఎంఎన్ సీ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరైంది. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎప్పటిలాగే బుధవారం రాత్రి ఇంట్లోని తన గదిలోకి వెళ్లి పడుకున్న ప్రబంధ గురువారం ఉదయం 6 గంటలకు తల్లి నిద్రలేచి చూసేసరికి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు తండ్రి సురేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్యాట్నీ చౌరస్తాలో..
చిలకలగూడ: ఉదయమంతా నగర ప్రజలపై చండప్రచండంగా నిప్పులు కక్కిన సూరీడు సాయంత్రానికి కొంత శాంతించాడు. పడమటి కొండల్లో... ప్రకృతి ఒడిలోకి చేరుకునే వేళ మేఘాల కాన్వాసుపై రమ్యమైన రంగులతో వినూత్న చిత్రాన్ని ఆవిష్కరించాడు. చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. సికింద్రాబాద్ ప్యాట్నీ చౌరస్తాలో కనువిందు చేసిన ఈ మనోహర దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. చిత్రం:ఆడెపు నాగరాజు