breaking news
chief of the Army
-
ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించింది వీరే..
చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్, కుమార్తె, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో తమిళనాడులోని సలూన్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా నీలగిరి కొండల్లోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ నుంచి భారీగా మంటలు చెలరేగి కాలిబూడిదైంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని భారత వాయుసేన విభాగం ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. చదవండి: హెలికాప్టర్ నుంచి మృతదేహాలు పడటం కళ్లారా చూశా: ప్రత్యక్ష సాక్షి బిపిన్ రావత్ షెడ్యూల్ ఇలా.. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ఆర్మీ అధికారిక కార్యక్రమంలో మధ్యాహ్నం 2:40 గంటలకు రావత్ మాట్లాడాల్సి ఉంది. హెలికాప్టర్లో ప్రయాణించిన వారి వివరాలు.. 1. బిపిన్ రావత్ 2.మధులిక రావత్ 3. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ 4. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ 5. ఎన్కే గురు సేవక్ సింగ్ 6. ఎన్కే జీతేంద్రకుమార్ 7. లాన్స్ నాయక్ వివేక్ కుమార్ 8. లాన్స్ నాయక్ సాయి తేజ 9. హవల్దార్ సత్పాల్.. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. #WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper. (Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J — ANI (@ANI) December 8, 2021 -
ఎలక్షన్ వాచ్..
వీకే సింగ్‌కు చేదు అనుభవ ఆర్మీ మాజీ చీఫ్, ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న జనరల్ వీకే సింగ్‌కు ఆ పార్టీ నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశానికి సోమవారం హాజరైన సింగ్‌ను ఆ పార్టీ కార్యకర్తలే తీవ్రంగా వ్యతిరేకించారు. ‘గో బ్యాక్ జనరల్’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక నాయకులే తమకు కావాలని, బయటి వారి నాయకత్వం అవసరం లేదని కార్యకర్తలు అలజడి సృష్టించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అరవింద్ భారతి, హాపూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సంజయ్ త్యాగీ సహా డజనుకుపైగా కార్యకర్తలు సింగ్‌ను పూర్తిగా నిలువరించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీలోకి ఎన్ఆర్ఐ నీరజ్పాటిల్ బెంగళూరు: లండన్‌లోని లాంబెత్ మాజీ మేయర్, ప్రవాస భారతీయుడు(ఎన్ఆర్ఐ) నీరజ్ పాటిల్ సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్, మాజీ మంత్రులు సురేశ్ కుమార్, వి. సోమన్నలు పాటిల్‌ను లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించారు. నీరజ్ మాట్లాడుతూ.. మోడీ ప్రధాని కావాలనే సంకల్పంతో బీజేపీలో చేరినట్టు చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ: బీజేపీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిదని బీజేపీ దుయ్యబట్టింది. ఈ విషయం గ్రహించే ఆపార్టీ సీనియర్లు లోక్‌సభ బరిలో నిలిచేందుకు వెనుకాడుతున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ సోమవారం తన బ్లాగులో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ ఖాయమని, అందుకే ఆపార్టీలోని దాదాపు సీనియర్ నేతలందరూ ఆరోగ్యం సహా వివిధ కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నారని జైట్లీ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ తనదైన ప్రయాస పడుతున్నారని, అందుకే ఆయన ‘ఒపీనియన్ పోల్స్ ఓ జోక్’ అని, ‘యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది’ అని చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. ‘ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 2009నాటి ఫలితాలు వస్తాయని రాహుల్ భావిస్తున్నట్టున్నారు. అది అప్పటి మాట. ప్రస్తుతం తమిళనాడులో ఒంటరిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చిన విషయాన్ని గుర్తించాలి’ అని జైట్లీ అన్నారు. పార్టీ పెట్టను: అళగిరి చెన్నై: కొత్త పార్టీ స్థాపించే యోచనేదీ తనకు లేదని డీఎంకే బహిష్కృత నేత, కరుణానిధి తనయుడు అళగిరి ప్రకటించారు. తాను డీఎంకేతోనే ఉన్నానని, కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం ఆయన మధురైలో తన అనుచరులతో సమావేశమై మాట్లాడారు. డీఎంకేను, కరుణను ద్రోహుల నుంచి కాపాడుకోవడమే ప్రస్తుతం తన ముందున్న లక్షమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి తాను మద్దతిస్తున్నట్లు అళగిరి చెప్పారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందన్నారు. మోడీ అవినీతికి పాల్పడరని చెప్పలేదు: వికీలీక్స్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడరని తాము ఎప్పుడూ ధ్రువీకరించలేదని.. ప్రపంచ దేశాల, నేతల గుట్టుమట్లను బయటపెట్టే వికీలీక్స్ వెబ్సైట్ వెల్లడించింది. మోడీ అవినీతికి లొంగే మనిషి కానందునే అమెరికా ఆయనకు భయపడిందంటూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే వ్యాఖ్యానించినట్లు ఉన్న పోస్టర్లను కొందరు బీజేపీ మద్దతుదారులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఆ వెబ్సైట్ ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లతో వివరణనిచ్చింది. అయితే వికీలీక్స్ వివరణను బీజేపీ తేలిగ్గా తీసి పారేసింది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు మోడీకి వికీలీక్స్ నుంచి కానీ అసాంజే నుంచి కానీ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. సరైన అభ్యర్థి లేకుంటే ‘నోటా’ నొక్కండి: హజారే రాలేగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌సభ ఎన్నికల్లో మంచి పేరు, వ్యక్తిత్వం కలిగిన అభ్యర్థి కనుక లేనట్టైతే ఈవీఎంలలోని ‘పైవారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్-నోటా) ఆప్షన్‌ను ఉపయోగించుకోవాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే ఓటర్లకు సూచించారు. ‘కేవలం పాలనను మార్చడం (అధికారంలో ఉన్న పార్టీని) ద్వారా దేశం మార్పును చూడబోవడం లేదు. ఒక ప్రభుత్వం అవినీతిలో గ్రాడ్యుయేషన్ చేస్తే మరొకటి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. అందువల్ల ఏదో పాలకులను మార్చడం ద్వారా ప్రాథమిక మార్పు అనేది రాదు. రాష్ర్టంలో, దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగే వారినే శాసనసభలకు, లోక్‌సభకు పంపాలి..’ అని హజారే సోమవారం ఇక్కడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా పార్టీ దొంగనో, గూండానో, అవినీతిపరుడ్నో ఎన్నికల బరిలోకి దింపినట్టైతే.. ఆ పార్టీ చేసిన పొరపాటునే తాము చేయకుండా ఓటరు నిర్ణయం తీసుకోవాలని అన్నా సూచించారు. పాఠ్యాంశాల్లోని ‘మత పార్టీ’పై బీజేపీ ఫిర్యాదు అగర్తలా: వామపక్ష కూటమి నేతృత్వంలోని త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో తరగతి పుస్తకాల్లోని పాఠాల్లో తమపై కావాలని మత ముద్ర వేసిందని బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర విద్యాశాఖను కోరామని ఈసీ చెప్పింది. ఆ నివేదిక అందిన తర్వాత పైఅధికారులకు పంపుతామని ప్రధాన ఎన్నికల అధికారి అశుతోశ్ జిందాల్ తెలి పారు. ఆ తరగతిలోని రాజకీయ శాస్త్రంలో ఉన్న ‘ఇండియా పార్టీ సిస్టం’ అనే పాఠ్యాం శంలో తమను ముస్లిం లీగ్, హిందూ మహాసభ, శివసేనలతో కలపి మత పార్టీ అని రాశారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక ఈ మధ్య నిర్వహించిన పరీక్షలో కిందివాటిలో మత పార్టీని గుర్తించండని కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ, బీఎస్పీ పేర్లతో కూడిన ప్రశ్న ఇచ్చారని తెలిపింది. దీనిపై చర్య తీసుకోవాలని కోరింది.