నారాయణ రెడ్డి మృతదేహానికి రేపు పోస్టుమార్టం
కర్నూలు: ప్రత్యర్థుల దాడిలో దారుణ హత్యకు గురైన పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో పోస్టుమార్టం నిర్వహించలేదు. రేపు(సోమవారం) పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నారాయణ రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.