breaking news
chandi homam
-
సింగపూర్లో ఘనంగా చండీ హోమ మహోత్సవం
సింగపూర్: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేయబడింది.SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్యక్రమానికి తోడ్పడిన వాలంటీర్ల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
మై విలేజ్ షో అనిల్ దంపతుల చండీ హోమం (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరో అడివిశేష్ ఇంట్లో చండీ హోమం (ఫోటోలు)
-
జోగుళాంబ ఆలయంలో చండీహోమాలు
అలంపూర్రూరల్ : ఐదోశక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయంలో మంగళవారం సామూహిక చండీహోమాలు జరిగాయి. గురుపౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హోమాలకు తరలివచ్చారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య నాడు చండీహోమాలను నిర్వహిస్తుంటారు. సుదూర ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజనవసతి కల్పించారు. చండీహోమాలకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. -
ఘనంగా శత చంఢీ హోమం
నల్లకుంట : హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠం సోమవారం భక్తులతో పోటెత్తింది. పౌర్ణమిని పురస్కరించుకొని మఠంలోని శక్తి గణపతి, శంకరభగవత్పాదులు, చంద్రమౌళీశ్వరుడు, లోకమాత శారదాంబలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శత చంఢీ హోమం నిర్వహించారు. ప్రాంగణంలో మహిళా భక్తులచే కైలాస గౌరీ వ్రతం నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందజేశారు. మధ్యాహ్నం దాదాపు 300 మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శ్రీలలితా ప్రచార సేవక్ ఆధ్వర్యంలో శంకరమఠం ప్రాంగణంలో కొనసాగుతున్న శ్రీ లలితా అనుగ్రహ భాషణంపై ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం శ్రీ లలితా స్వరూపులు భగవాన్ శ్రీవత్స శ్రీ గురుదేవులు అనుగ్రహ భాషణలు ఇచ్చారు.


