breaking news
Central Bank manager
-
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య
తుని : తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలో బ్యాంక్ మేనేజర్ బుధవారం ఉదయం దారుణహత్యకు గురయ్యారు. విశాఖ ఎస్.తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులును గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని తేటగుంట పంటపొలాల్లో పడవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
కౌలు రైతుల మైండ్ బ్లాక్
►రుణమాఫీకి బాబు సర్కారు భారీ మెలిక ►పాస్ పుస్తకాలు కావాలంటూ కొర్రీలు ►అదెలా సాధ్యమని ప్రశ్నిస్తూగొట్టిపాడులో ఆందోళన ►పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీ... ►ఆ తరువాత ఒరిజినల్ తప్పనిసరి : సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ప్రత్తిపాడు: పంట రుణాలు మాఫీ అవుతాయని ఆశల పల్లకిలో విహరిస్తున్న కౌలు రైతులకు బాబు సర్కా రు దిమ్మ తిరిగే మార్గదర్శకాలతో షాక్ ఇచ్చింది. ఒకే సర్వే నంబరులో ఉన్న పంట పొలానికి భూ యజమానితో పాటు కౌలు రైతు బంగారు రుణం తీసుకున్నట్లయితే కౌలు రైతుకే లబ్ధిచేకూర్చాలని తాజాగా బ్యాంకర్లకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అయితే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు మాఫీ కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలంటూ మెలిక పెట్టారని కౌలు రైతులు వాపోతున్నారు. ►ఈ నిబంధనను నిరసిస్తూ గురువారం ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట కౌలు రైతులు ఆందోళన చేశారు. ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ రుణమాఫీ అంటూ ఓటర్లను ఆకర్షించిన చంద్రబాబు ఇప్పుడు ఇలా కొర్రీలు పెట్టడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ►బ్యాంకర్లు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు కాపీ అడుగుతున్నారని, రుణమాఫీ నాటికి ఒరిజనల్ పట్టాదారు పాస్ పుస్తకం కావాలని, లేకుంటే రుణమాఫీ వర్తించదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు భూ యజమా ని పొలం కౌలుకు ఇవ్వడమే కష్టంగా మారిందని, అలాంటపుడు పాస్ పుస్తకాలు అందు లోనూ ఒరిజినల్స్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ►ఇదిలా ఉంటే బ్యాంకర్లు మరో అడుగు ముందుకు వేసి కౌలు రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా జిరాక్సు కాపీ తీసుకువచ్చేటప్పుడు దానిపై పట్టాదారు సంతకం (రుణమాఫీకి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని) కూడా తీసుకోవాలంటూ చెబుతుండటంతో కౌలు రైతులు డోలాయమానంలో పడుతున్నారు. పాస్ పుస్తకాలు కావాలంటున్నారు ... గత ఏడాది ఎకరన్నర పొలం కౌలుకు సాగు చేశాను. బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ. 80 వేల రుణం తీసుకున్నాను. ఇప్పుడు ఆ రుణం మాఫీ కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకాలు కావాలంటున్నారు. లేకుంటే రుణమాఫీ వర్తించదని చెబుతున్నారు. భూ యజమానులు పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారు. అంతా గందరగోళంగా ఉంది. - మేడా కోటేశ్వరి, గొట్టిపాడు పుస్తెలు తాకట్టు పెట్టాం... పుస్తెలు తాకట్టు పెట్టి మరీ కౌలుకు పొలం చేశాం. మొన్నటిదాకా బంగారంపై రుణాలు పోతాయని ఆశపడ్డాం. ఇప్పుడు పాస్ పుస్తకాలు కావాలంటూ కొర్రీ పెట్టారు. సొంత పొలాల్లేని మాకు పాస్ పుస్తకాలు ఎక్కడ నుంచి వస్తాయి. రైతులకు రుణాలు ఉన్నప్పుడు, మాకు పాస్ పుస్తకాలెందుకు ఇస్తారు. - కుంభా వీరరాఘవమ్మ, మారెల సుబ్బాయమ్మ, గొట్టిపాడు. పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి ... కౌలు రైతులు బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే ఇప్పుడు పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీలు ఇవ్వమంటున్నాం. మాఫీ నాటికి ఒరిజినల్ పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకువస్తే అందులో రుణమాఫీ అయినట్లు నమోదు చేస్తాం. ఏదిఏమైనా పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిసరి. ఒకే సర్వే నంబరులో కౌలు, రైతు భూ యజమాని బంగారంపై రుణం పొంది ఉంటే అందులో కౌలు రైతుకే మాఫీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. - అమిత్‌కుమార్, మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గొట్టిపాడు.