breaking news
CCPS
-
సైబర్ చోర్ టెకీస్
సాక్షి, హైదరాబాద్: ‘చదువుకోకపోతే దొంగ అవుతావా?’అని చిన్నప్పుడు స్కూలుకు వెళ్లకపోతే తల్లిదండ్రులు తిట్టడం అందరికీ అనుభవమే. కానీ, మంచి చదువు చదివినవారు కూడా కొందరు ఈజీ మనీకి అలవాటుపడి నేరాల బాట పడుతున్నారు. తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వాడి సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నివేదిక ప్రకారం సైబర్ నేరా లు చేస్తున్నవాళ్లలో 45 శాతం మంది బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత సాంకేతిక విద్య పట్టభద్రులే ఉన్నారు. వారిలోనూ 49 శాతం మంది వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉన్నది. సైబర్ నేరాలకు పాల్పడుతున్నవాళ్లలో మూడు శాతం మంది ప్రభు త్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఉక్కుపాదం మోపుతున్న టీజీసీఎస్పీ సైబర్ నేరాల కట్టడి కోసం తెలంగాణ పోలీసులు టీజీసీఎస్బీని ఏర్పాటు చేశారు. ఈ నేరాల తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తులో అడ్డంకులను అధిగమించడంతోపాటు పక్కాగా దర్యాప్తు చేపట్టేందుకు నేరుగా టీజీసీఎస్బీ డైరెక్టర్ పర్యవేక్షణ కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను (సీసీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలల్లో 76 సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణవ్యాప్తంగా 795 సైబర్‌నేరాలతో, దేశవ్యాప్తంగా 3,357 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు అధికారులు తెలిపారు. న్యూ ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వీరిని అరెస్టు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్‌లపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. కొన్ని కేసుల్లో స్థానిక పోలీసుల సహకారం సైతం ఉండటంలేదని టీజీసీఎస్బీ పోలీసులు తెలిపారు. ఏ తరహా నేరాలు ఎక్కువ? సైబర్ నేరాల్లో పార్ట్‌టైం జాబ్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ (స్టాక్ ట్రేడింగ్), డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్, హ్యాకింగ్, అడ్వరై్టజ్‌మెంట్, మ్యాట్రిమోనియల్ మోసాలు ఎక్కువ ఉంటున్నాయి. పట్టుబడుతున్న వారిలో సైబర్ మోసాలకు పాల్పడే వారితోపాటు మ్యూల్ బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లు, అకౌంట్ ఆపరేటర్లు, సిమ్‌కార్డులు సరఫరా చేసేవాళ్లు, బ్యాంకు అధికారులు, ట్రావెల్ ఏజెంట్లు, హ్యాకర్లు సైతం ఉన్నారు. సైబర్‌సేఫ్ తెలంగాణే మా లక్ష్యం సైబర్ నేరగాళ్ల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉన్నాం. సైబర్‌సేఫ్ తెలంగాణే మా లక్ష్యం. ప్రజలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీరు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 87126 72222 వాట్సప్ నంబర్లో లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లోనూ ఫిర్యాదు చేయవచ్చు. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీ -
స్టాక్స్ వ్యూ
డీఎల్ఎఫ్ బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.250 ఎందుకంటే: ప్రమోటర్ల దగ్గరున్న కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(సీసీపీఎస్) కన్వర్షన్‌ను ఒక ఏడాది కాలం పాటు వాయిదా వేసింది. దీంతో నిధుల సమీకరణకు కంపెనీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ నెల 19న జరగాల్సిన ఈ కన్వర్షన్ ఏడాది కాలం పాటు వాయిదా పడింది. మరోవైపు ఈ సీసీపీఎస్లపై చెల్లించాల్సిన కూపన్ రేటు 9 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించారు. దీని వల్ల డివిడెండ్‌గా చెల్లించాల్సిన 144 కోట్లు కంపెనీకి ఆదా అవుతాయి. మరోవైపు డీఎల్ఎఫ్ ప్రమోటర్లు మార్కెట్లో మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించరాదన్న సెబీ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ఆరు నెలలకు తగ్గించింది. శాట్ తాజా ఉత్తర్వు కారణంగా కంపెనీ నిధుల సమీకరణకు అడ్డం కులు దాదాపుగా తొలగినట్లే. కంపెనీ అమ్మకాలు పుంజుకునేదాకా రీట్, క్విప్‌ల ద్వారా నిధులు సమీకరించడం షేర్ ధరపై సానుకూల ప్రభావమే చూపవచ్చు. అమ్మకాలు పుంజుకుంటే, నగదు నిల్వలు పుష్కలంగా కంపెనీకి అందుబాటులోకి వస్తాయి. దీంతో మిడ్-ఇన్‌కం ప్రాజెక్ట్‌లను కంపెనీ ప్రారంభించగలుగుతుందని అంచనా. బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత మార్కెట్ ధర: రూ.1,382 టార్గెట్ ధర: రూ.1,930 ఎందుకంటే: ఈ కంపెనీలో 35 శాతం దాకా వాటాలు ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)ఇన్వెస్టర్లు తమ వాటాను తగ్గించుకుంటున్నారని, త్వరలో ప్రారంభం కానున్న సెర్చ్‌ప్లస్(ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్) వ్యాపారంపై ప్రకటనల వ్యయం అంచనాలను మించి పెరిగిపోవచ్చని, తదితర అంశాల కారణంగా ఈ షేర్ ధర ఇటీవల కాలంలో 25 శాతం వరకూ క్షీణించింది. నాలుగేళ్లలో లోకల్ సెర్చ్ బిజినెస్ 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యాజమాన్యం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న సెర్చ్ ప్లస్ వ్యాపారం ఆదాయం 2018-19 కల్లా కంపెనీ రాబడిలో 14 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. ఇ-టెయిలింగ్‌లో ప్రవేశించడం వంటి కారణాల వల్ల కంపెనీ ఆదాయం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. అలాగే నాలుగేళ్లలో ఈపీఎస్ 39 శాతం చొప్పున చక్రగతిన పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో జేడీ క్యాష్ పేరుతో వాలెట్ సర్వీసునూ అందించనున్నది. జేడీ క్యాష్ డెవలప్మెంట్ దాదాపు పూర్తయిందని, త్వరలో ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,930గా నిర్ణయించాం.