breaking news
catesvar Pujara
-
కష్టాల్లో రెస్టాఫ్ ఇండియా
ముంబై: రంజీ చాంపియన్ గుజరాత్ బౌలర్లు సమష్టిగా రాణించారు. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా బ్యాట్స్మెన్ ను వణికించారు. దీంతో రెండో రోజు ఆటలో రెస్టాఫ్ ఇండియా 72 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ అఖిల్ హేర్వాడ్కర్ (48) రాణించగా, మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ (8 బ్యాటింగ్), పంకజ్ సింగ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో చింతన్ గజ, హార్దిక్ పటేల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, మోహిత్ తడాని 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 300/8 ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 102.5 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు సెంచరీ సాధించిన చిరాగ్ గాంధీ (202 బంతుల్లో 169; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ స్కోరు వద్ద నిష్క్రమించాడు. -
విజయనగరంలో రంజీ మ్యాచ్
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు విజయనగరంలోని డాక్టర్ పీవీవీ రాజు ఏసీఏ స్టేడియం(స్పోర్ట్స్ కాంప్లెక్స్) వేదికైంది. సౌరాష్ట్ర, విదర్భ మధ్య జరగనున్న ఐదురోజుల ఆట బుధవారం ప్రారంభ మైంది. ముందుగా టాస్ గెలిచిన సౌరాష్ర్ట కెప్టెన్ జయదేవ్షా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విదర్భ భ్యాటింగ్ ఆరంభించింది. భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చటేశ్వర్ పుజారాతో పాటు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పాల్గొంటుండంతో ఆటను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు హజరయ్యారు.