breaking news
car lifting
-
మధురానగర్‌లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి కారులో ...
హైదరాబాద్: మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి అనంతరం శృంగారం కోసం ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడకు చెందిన మహిళకు సంగీత్‌కుమార్ అనే వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో మనస్పర్దలు రావడంతో మూడు నెలల కిందట ఆమె షేక్‌పేటలోని తన తల్లితో ఉంటుంది. ఈనెల 19న మధ్యాహ్నం యూసుఫ్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి మద్యం సేవించి తిరిగి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి మీ ఫ్యామిలీ నాకు తెలుసు, కారు ఎక్కు మీ ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. అయితే మార్గ మధ్యలో కారు ఆపి తనతో శృంగారం చేయాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమె కారు దిగి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు పైకెత్తి ప్రాణాలు రక్షించారు!
లండన్: అది నగరంలో ఎప్పుడు బిజీగా ఉండే కింగ్ విలియం స్ట్రీట్. సమయం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట. వివిధ ఆఫీసుల్లో పని చేస్తున్నవారు భోజనం కోసం ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఓ పాతికేళ్ల అమ్మాయిని ఓ క్యాబ్ ఢీకొట్టి ఆగిపోయింది. క్యాబ్ ముందు చక్రాల కింద ఆ అమ్మాయి ఇరుక్కుపోయింది. డ్రైవర్‌కు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రత్యక్ష సాక్షి లారా ఫేర్స్ వెంటనే కారు వద్దకు పరుగులు తీసి బాటసారులను కేకలు వేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు 30 మంది బాటసారులు కారు వద్దకు వచ్చి విషయం తెసుకున్నారు. వారిలో టూరిస్టులు కూడా ఉన్నారు. వారు తమ చేతుల్లోని బ్యాగులను పక్కన పెట్టి, తలా ఒక చేయివేసి కారును అమాంతం ఎత్తి పక్కకు తీసుకెళ్లారు. ఇంతలో అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది కారు ప్రమాదంలో గాయపడిన అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో తీసుకరావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అక్కడి వైద్యులు తెలియజేశారు. ముందు కారు చక్రాల వెనక ఆ పాతికేళ్ల యువతి సెమీ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు ధైర్యం చెప్పేందుకు ఓ బాటసారి కారు కింద దూరి జోకులతో ఆమెను నవ్వించేందుకు ప్రయత్నించడం కూడా ఆసక్తి కలిగించింది. అదే సమయంలో ఈ సంఘటనను గమనించిన ఓ టెక్నాలజీ కన్సల్టెంట్ టియాన్ ట్రామ్స్ మొత్తం సంఘటనను తన ఆఫీసు కిటికీ నుంచి వీడియోలో చిత్రీకరించి దాన్ని స్థానిక మీడియాకు విడుదల చేశారు. లండన్‌లోనే గత మే నెలలో యాక్సిడెంట్ కారణంగా ఓ బస్సు చక్రాల కింద ఓ సైక్లిస్ట్ చిక్కుకుపోతే దాదాపు వంద మంది ప్రయాణికులు, బాటసారులు బస్సు చక్రాలను పైకెత్తి సైక్లిస్ట్ ప్రాణాలను రక్షించారు. ఇలా మానవత్వాన్ని చాటిచెప్పే అరుదైన సంఘటనలు ఇటీవల కనిపిస్తున్నాయి. ఓ రైల్వే ఫ్లాట్‌ఫారమ్‌కు, రైలుకు మధ్య ఓ ప్రయాణికుడి కాలు ఇరుక్కుంటే ప్రయాణికులు రైలునే పక్కకు వొంచి ఆ ప్రయాణికుడిని కాపాడడం, మరో దేశంలో మంచులో విమానం టైర్లు కూరుకుపోతే ప్రయాణికులు విమానాన్నే ముందుకు తోయడం లాంటి సంఘటనలు తెలిసినవే.