breaking news
car-bike
-
రైల్వేబ్రిడ్జి పై నుంచి పడ్డ కారు, బైక్.. ముగ్గురి మృతి
హైదరాబాద్: అల్వాల్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే వంతెన పైనుంచి కారు, బైక్ కిందపడ్డాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సహా బైక్ నడుపుతున్న వ్యక్తి మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం తిరుమలగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 29 బీబీ 4454 అని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతులు శక్తిసింగ్, కృష్ణమాచార్య, కమలిని అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కర్మాన్ ఘాట్ కు చెందిన కృష్ణమాచార్య కుటుంబం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శక్తిసింగ్ అనే వ్యక్తి బైక్ రాంగ్ రూట్ లో నడుపటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయిన ప్రయత్నంలో కారు రైల్వే వంతెన పైనుంచి కిందకి పడిపోగా, ఆ వెంటనే బైక్ కూడా పడిపోయింది. -
కారు, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
నల్గొండ: వేగంగా వస్తున్న కారు ముందు వెళ్తోన్న బైకును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పాతమనుగుండ్ల గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పరిడ మండలానికి చెందిన మాగి బిక్షం(58), కోనేటి యాదయ్య(55), సత్యనారాయణ కట్టె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పాత మనుగుండ్లకు వచ్చి వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనం గ్రామ శివారులోకి చేరుకున్న వెంటనే వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బిక్షం, యాదయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.