breaking news
candis
-
క్యాండీస్ తినటమే పని.. జీతం రూ.61 లక్షలు!
ఒట్టావా: ఒళ్లు వంచి రోజంతా కష్టపడినా జీతం అంతంతమాత్రమేనని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. తినటమే పనిగా ఉంటే.. దానికి లక్షల్లో జీతం వస్తే.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? అవునండీ.. అలాంటి ఉద్యోగాలూ ఉన్నాయి. ఓ ఛాక్లెట్ల తయారీ సంస్థ ‘చీఫ్ క్యాండీ టేస్టర్’ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాండీలు(మిఠాయిలు, ఛాక్లెట్లు) తినటమే ఆ ఉద్యోగం. జీతం కూడా భారీగానే ఇస్తోంది. ఏడాదికి రూ.61 లక్షలు మరి. క్యాండీలు అంటే ఇష్టపడే వారు వెంటనే ఈ ఆఫర్‌ను ఒడిసిపట్టండి మరి. కెనడాకు చెందిన క్యాండీ ఫన్‌హౌస్ అనే ఆన్లైన్ రిటైలర్ సంస్థ ఛాక్లెట్స్ నుంచి వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్‌ను నియమించుకోవాలని భావిస్తోంది. అందుకు 1,00,000 కెనెడియన్ డాలర్లు(సుమారు రూ.61.14 లక్షలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను గత జులైలో లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది సంస్థ. తల్లిదండ్రుల అనుమతితో 5 సంవత్సరాల వయసు పైబడిన వారంతా ఈ ఉద్యోగానికి పోటీ పడొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని తాము ఊహించలేదని సీఈఓ జమిల్ హెజాజి పేర్కొన్నారు. ఒక చీఫ్ క్యాండీ ఆఫీసర్‌గా నెలకి 3,500 పీసులు తినాలి. రోజుకు 117 అన్న మాట. అయితే.. అవి చాలా ఎక్కువని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగానికి పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు పంపించారు. తమ పిల్లలు దరఖాస్తు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిదండ్రులు. Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6 — Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022 ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
రుచి చూసే ఉద్యోగం.. గంటకు రూ.1700
ఈ ప్రపంచంలో నూటికి 99 శాతం మంది మనుషులు తిండికోసం డబ్బులు సంపాదిస్తారు. కానీ, ఒక్క శాతం ఇందుకు పూర్తి భిన్నం.. తింటూ డబ్బులు సంపాదిస్తారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ, అలాంటి రుచికరమైన ఉద్యోగం దొరకదు. ఒక వేళ తింటూ డబ్బు సంపాదించే అవకాశం మీకు వస్తే వదులుకుంటారా? లేదు కదు! అయితే వెంటనే కెనడాకు చెందిన ‘‘ క్యాండి ఫన్‌హౌస్’’ అనే క్యాండీల తయారీ కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. క్యాండీ, చాక్లెట్ టేస్ట్ టెస్టర్ జాబ్స్‌కు దరాఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 15వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది. ( ఏందిది కికా.. నిజమా లేక భ్రమా!) ఈ లోపు మీరు మీ దరఖాస్తును పంపించేయండి. సదరు కంపెనీ తాము తయారు చేసే పదార్ధాలను రుచి చూసే ఉద్యోగుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. గంటకు 30 కెనడియన్ డాలర్లు( దాదాపు 1700 రూపాయలు) ఇస్తామంటోంది. ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిందల్లా ఆ కంపెనీ తయారు చేసే 3,000 క్యాండీలు, చాక్లెట్లను రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి. -
వార్నర్‌కు రెండో అమ్మాయి...
సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌కు మళ్లీ కూతురు పుట్టింది. ఆమెకు ఇండీ రే అని పేరు పెట్టాడు. గురువారం ఉదయం భార్య క్యాండిస్, చిన్నారితో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పెట్టి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను, క్యాండిస్ కలిసి అందమైన పాపకు ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నాం. మమ్మీ, డాడీ చాలా సంతోషంగా ఉన్నారు’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. వార్నర్‌కు ఇప్పటికే 16 నెలల వయసు ఉన్న ఇవీ మే అనే అమ్మాయి ఉంది.