breaking news
candels
-
కొవ్వొత్తులతో పీస్ వాక్..!
కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ (సీసీహెచ్ఎల్) ‘గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజమ్’ పేరిట వినూత్న రీతిలో సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. బేగంపేటలోని క్లబ్ ప్రాంగణంలో కొవ్వొత్తులు చేత పట్టుకొని మోడల్స్ మంగళవారం ప్రదర్శన చేశారు. శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే నినాదాలు ముద్రించిన ప్రత్యేక వస్త్రధారణలో మౌనంగా ‘పీస్ వాక్’ చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళిగా 26 కొవ్వొత్తుల ప్రదర్శనలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ‘గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నటుడు సునీల్ దత్ తో కలిసి ‘గ్రౌండ్ జీరో’ నిర్వహించామన్నారు. అలాగే శాంతి సామరస్యాల పట్ల తమ నిబద్ధతకు ప్రతీకగా లక్ష మంది సంతకం చేసిన చారిత్రాత్మక ‘ఫ్రెండ్షిప్ బ్యాండ్’ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమోదించారన్నారు. అదే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, తీవ్రవాదం ప్రపంచ ముప్పుగా మారిన నేపథ్యంలో దీనిని ఎదుర్కోడానికి అంతర్జాతీయ సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు
ఉజ్జయిని: మహా శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఏకంగా 18,82,229 దీపాలు వెలిగించారు. గిన్నిస్ రికార్డు సృష్టించారు. శనివారం సాయంత్రం క్షిప్రా నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 2022లో అయోధ్యలో అత్యధికంగా 15.76 లక్షల దీపాలు వెలిగించారు. ఉజ్జయినిలో గత శివరాత్రి సందర్భంగా 11,71,078 దీపాలు వెలిగించారు. -
కెరీర్ కాంతిమంతం
దీపం జీవితానికి ప్రతీక. ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. ఆ వెలుగును ఒడిసిపట్టుకోవడం తెలిస్తే జీవితం ప్రకాశవంతమవుతుంది. సరదాగా నేర్చుకున్న క్యాండిల్ మేకింగ్‌తో జీవితాన్ని కాంతిమంతం చేసుకున్న సుజాత మేడబాల అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లక్కీ క్యాండిల్స్... ఇది హైదరాబాద్, ప్రగతినగర్‌లో ఓ చిన్న పరిశ్రమ. పరిశ్రమ చిన్నదే కానీ, అందులో తయారయ్యే క్యాండిల్స్ మాత్రం చిన్నవి కావు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన మోసినట్లు మోయాల్సినంత పెద్ద క్యాండిల్స్ తయారవుతాయక్కడ. రెండు అడుగుల చుట్టుకొలత, రెండున్నర అడుగుల ఎత్తున్న క్యాండిల్ అది. అందుకే ఆ క్యాండిల్ పేరు సరదాగా బాహుబలి క్యాండిల్‌గా వ్యవహారంలోకి వచ్చేసింది. ఇంతకీ బాహుబలి క్యాండిల్ బరువు ఎంతో తెలుసా? 30 కేజీలు. ధర తెలిస్తే క్యాండిల్ వెలుగులో చుక్కలు కూడా కనిపిస్తాయి మరి. ఆ క్యాండిల్ ధర 30 వేల రూపాయలు. ఇది కస్టమైజ్డ్ క్యాండిల్ అని, ఒకరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని, ఈ క్యాండిల్ కోసం ప్రత్యేకంగా మౌల్డ్ తయారు చేయించాల్సి రావడంతో ఆ ధర తప్పలేదని చెప్పారు సుజాత. ఆమె పరిశ్రమలో తయారయ్యే క్యాండిల్స్‌లో ఎక్కువ భాగం డిజైనర్ క్యాండిల్సే. పిల్లర్ క్యాండిల్, కంటెయినర్ క్యాండిల్, సెంటెడ్ క్యాండిల్, పెయింటెడ్ క్యాండిల్, ప్రింటెడ్ క్యాండిల్, ఫ్లోటింగ్, పర్సనల్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. పండుగలు, ఇతర ధార్మిక వేడుకల కోసం రిచువల్స్ క్యాండిల్స్ ప్రత్యేకం. ‘‘దీపం వెలుగు మనసును ఉత్తేజితం చేస్తుంది. అందుకే సెంటెడ్, అరోమాటిక్ క్యాండిల్స్‌లో సందర్భాన్ని బట్టి ఫ్రాగ్నెన్స్ను ఎంచుకోవాలి. మా ప్రయోగంలో నాలుగురకాల నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో సోయా వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్, పామ్ వ్యాక్స్ క్యాండిల్స్... ఈ మూడు వేగన్ క్యాండిల్స్. అంటే ఈ మైనం జంతువులు, పక్షుల వంటి ఏ ప్రాణి నుంచి సేకరించినది కాదు. ఇక నాచురల్ వ్యాక్స్‌లో నాలుగవది బీ వ్యాక్స్. తేనెపట్టు నుంచి సేకరించే మైనం అన్నమాట. సాధారణంగా క్యాండిల్ తయారీలో ఉపయోగించేది పారాఫిన్ వ్యాక్స్. ఇప్పుడు నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు, ధర గురించి పట్టింపు కూడా ఉండడం లేదు. దాంతో ప్రయోగాలు చేయడానికి అవకాశం కూడా బాగా ఉంది. నేను పదేళ్లుగా ముగ్గురు ఉద్యోగులతో ఈ పరిశ్రమ నడిపిస్తున్నాను. ముగ్గురూ మహిళలే. మహిళలనే ఎందుకు చేర్చుకున్నానంటే... ఇది భుజబలంతో చేసే పని కాదు, సృజనాత్మకంగా చేయాల్సిన పని. పైగా మొత్తం చేతుల మీద జరిగే పని. భారీ మొత్తంలో మైనాన్ని కరిగించి ఒకే మూసలో పోయడం కాదు, ప్రతిదీ ప్రత్యేకమే. మనసు పెట్టి చేయాల్సిన పని. సహనం కూడా చాలా ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలైతే బావుంటుందనుకున్నాను. అలాగే ఒక మహిళగా సాటి మహిళలకు అవకాశం ఇస్తే బావుంటుందని కూడా అనిపించింది. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, భారీ ఆర్డర్ ఉన్నప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా మహిళలకే’’ అన్నారు సుజాత. వైజాగ్‌లో చిరుదీపంగా మొదలైన పరిశ్రమ, హైదరాబాద్‌లో కాంతులు విరజిమ్ముతున్న వైనాన్ని కూడా వివరించారామె. ‘‘వైజాగ్‌లో ఒక టైనింగ్ ప్రోగ్రామ్‌లో ఒకరోజు శిక్షణ తీసుకున్నాను. అది కూడా సరదాగానే. పిల్లలు పెద్దయిన తర్వాత ఖాళీ దొరికింది. దాంతో నేర్చుకున్న పనిని రకరకాలుగా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచిస్తూ పేపర్ కప్పు క్యాండిల్ చేశాను. అలా మొదలైన ప్రయోగాలను కొనసాగిస్తూ వచ్చాను. మా వారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి క్యాండిల్ తయారీలో నాకు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేసింది. ఇక కంపెనీ రిజిస్టర్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించాను. నా టైమ్‌పాస్ కోసం మొదలు పెట్టిన ఈ ఆలోచన... ఇప్పుడు మా వారికి రిటైర్మెంట్ తర్వాత వ్యాపకంగా మారింది. నా ఆలోచనతో రూపుదిద్దుకున్న పరిశ్రమ ఇప్పుడు ఒక ఈవెంట్‌కి రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే క్యాండిల్స్‌ని సరఫరా చేసే స్థాయికి చేరింది. మాకు మంచి వ్యాపకం, మరికొందరికి ఉపాధి. నా పరిశ్రమ కాంతిమంతం చేస్తున్నది నా జీవితాన్ని మాత్రమే కాదు, వేలాది ఇళ్లను, లక్షలాది మనసులను’’ అన్నారామె వాలెంటైన్స్ డే క్యాండిల్స్ చూపిస్తూ. – వాకా మంజులారెడ్డి -
వాడవాడలా కొవ్వొత్తులతో నిరసన
కాపుల ప్రదర్శనల హోరు బోట్‌క్లబ్ (కాకినాడ) : కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మూడేళ్లు గడుస్తున్నా రిజర్వేషన్ల విషయం పట్టించుకోవడం లేదని, కాపులు రోడ్డెక్కే çపరిస్థితి తీసుకొచ్చారని కాపు జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా సోమవారం రాత్రి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకూ ఈ ఉద్యమం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పి గన్నవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పి.గన్నవరంలో మూడు రోడ్లు సెంటర్లో జరి గిన కొవ్వొత్తుల ర్యాలీ, సుమారు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగాయి. కాపు యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.