breaking news
Camera eye
-
తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మోషన్ డిటెక్షన్, సౌండ్ టెక్నాలజీ..కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్ యాక్టివేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూం రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్‌గా కెమెరా యాక్టివేట్ అయి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్ అవుతుంది. ఒకసారి చార్్జచేస్తే రెజల్యూషన్ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి.స్పై కెమెరాలతో ప్రమాదాలు..స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఫ్లోర్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్రూమ్లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్ పెట్టాలి.మొబైల్స్‌తోనూ..స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ ప్లేస్ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్‌ని వాడుతున్నారు.ఎన్నో రకాలు..చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్‌లు, రిస్ట్ వాచీలు, ఫ్లవర్ వాజ్‌లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, స్విచ్‌బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.అనేక రకాల పరీక్షలు..స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్ డ్రాప్ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్ డ్రాప్ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్ రూమ్స్‌లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్ చేసి, ఫ్లాష్ లైట్‌ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.గుర్తించడం ఎలా?స్మార్ట్ఫోన్లు వాడేవారికి గూగుల్ ఫ్లే స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే యాప్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్ అప్లికేషన్లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్ డిటెక్టర్ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్ -
వర్చువల్ ఎవరెస్ట్ జర్నీ
ఎవరెస్ట్ శిఖరం 360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది. ‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జక్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
గీత దాటితే.. మోతే!
సాక్షి, కర్నూలు: వాహన చోదకులూ.. జర జాగ్రత్త. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేశారో ఇక అంతే సంగతులు. నిఘా కళ్లు మీమ్మల్ని వెంటాడబోతున్నాయి. కెమెరా కన్ను ప్రతిపక్షణం పహారా కాయబోతోంది. అసాంఘిక శక్తుల ఆటకట్టించడమే కాదు.. అక్రమాక్కుల ఆగడాలను కట్టడి చేయడమే ధ్యేయంగా కర్నూలు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే.. వాహనదారుని చిరునామాకే ఈ-చలాన్(జరిమానా) పంపేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సో.. బీ కేర్ ఫుల్. ఈ-నిఘా ఎలాగంటే! కర్నూలు నగర పరిధిలో పోలీసులు ప్రారంభించిన ఈ-నిఘా వ్యవస్థ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అనుబంధ సమస్యలను పరిష్కరించేందుకు 30 ప్రాంతాల్లో 120 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇకపై నిబంధనలు ఉల్లఘించిన వారిపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. సిగ్నల్స్ చూడకుండా రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు ముకుతాడు వేయనున్నారు. నిర్విరామంగా పనిచేసే ఈ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉల్లంఘనులను గుర్తించనున్నారు. ఇంటికే ఈ-చలాన్ ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై నిలబడి అనుమానం వచ్చిన వాహనాలను ఆపి రికార్డులను పరిశీలించి.. ఏవైనా పత్రాలు సరిగా లేకపోతే ఆ మేరకు జరిమానా విధించి డబ్బులు వసూలు చేసేవారు. అయితే కొందరు అధికారులకు ఈ విధులు వరంగా మారాయి. వాహనదారులకు రసీదులు ఇవ్వకుండా వారి నుంచి వసూలు చేసిన మొత్తాలను తమ జేబుల్లో నింపుకుంటున్నట్లు ఆరోపణలు అనేకం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను.. కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ద్వారా గుర్తించి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వారి చిరునామాలకే ఈ-చలాన్లు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అధికారులను ఇకపై కేవలం చలాన్ రాయడానికే పరిమితం చేసి.. జరిమానాను ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకం కానున్న ఈ-నిఘా వ్యవస్థ ఈ-నిఘాను సమర్థంగా అమలు చేసి కెమెరాల వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా పరిధిలో 6 పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ జరుగుతోంది. దీంతో పాటు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని కర్నూలులో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. లక్ష్యాలు ఎక్కువగా ఉండడం.. ఉన్న సిబ్బందితోనే అన్ని పనులు చేయాల్సి రావడంతో పోలీసు శాఖపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది నేరాల దర్యాప్తు, నియంత్రణపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న దృష్ట్యా కర్నూలు పోలీసు ఉన్నత వర్గాలు ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. నేరాల్లో ఆధారాల సేకరణకు ఎక్కువ సమయం తీసుకుంటుండడం, ఇదే అదునుగా నేరాగాళ్లు తప్పించుకుంటున్నారన్న అపవాదు ఉండడంతో సులభంగా ఆధారాలను సేరకించేందుకు అవసరమైన మార్గాలను ఆన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే తొలిసారి జిల్లావ్యాప్తంగా ఈ-నిఘా వ్యవస్థను సంపూర్ణంగా అమలు చేసే దిశగా కసరత్తు ముమ్మరమైంది.