breaking news
like button
-
ఫేస్బుక్లో లైక్ బటన్ కనిపించదు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్లకి సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్బుక్ పేజ్ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఫేస్బుక్ తన పబ్లిక్ పేజీల 'లైక్ బటన్'ను తొలగించనుంది. వీటిని సాధారణంగా పబ్లిక్ ఫిగర్స్, ఆర్టిస్టులు, వివిధ బ్రాండ్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 'లైక్ బటన్'ను తొలగించి దాని బదులు ఫాలో అనే బటన్ ద్వారా మీరు ఇష్టపడే పేజీకి సంబందించిన అప్డేట్స్ను పొందొచ్చు. ఇకనుంచి పేజీ ఫాలోవర్స్ ఆధారంగానే ఆ పేజీ ఎంత పాపులర్ అనేది నిర్దారించనున్నారు. ఒక పేజ్‌కు లైక్, ఫాలో అనే రెండు ఆప్షన్ లు ఉన్న కారణంగా సమస్య ఏర్పడుతుండటంతో ఫేస్బుక్ లైక్ బటన్ తొలగించనున్నట్లు తెలిపింది.(చదవండి: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!) -
ఫేస్‌బుక్‌లోకి న్యూ 'రియాక్షన్స్'!
శాన్ ఫ్రాన్సిస్కో: ఇప్పటివరకు ఫేస్బుక్లో ఏదైనా పోస్టు నచ్చితే.. అది చెప్పడానికి మనం వెంటనే 'లైక్' బటన్‌ను ఉపయోగించేవాళ్లం. అంతకుమించి ఆ పోస్టు గురించి మన భావోద్వేగాన్ని వెంటనే వ్యక్తం చేయడానికి మరో మార్గం ఉండేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ త్వరలోనే సరికొత్త 'రియాక్షన్స్' ప్రవేశపెట్టబోతున్నది. 'లైక్' తరహాలో వెంటనే మన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించేందుకు మరిన్ని భావోద్వేగపరమైన ప్రతీకలను అందుబాటులోకి తెస్తున్నది. ఈ రియాక్షన్స్ సింబల్స్ అతి తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇవి ఫేస్బుక్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వెలుపల కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన 'ఈ రియాక్షన్ సింబల్స్'ని అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. కంపెనీ తాజా త్రైమాసిక ఆదాయాలపై బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ లో నిపుణులతో చర్చించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు. ఫేస్బుక్లో పెట్టిన కామెంటు, వీడియో, లేదా ఫొటో నచ్చిందని చెప్పడానికి ఇప్పటివరకు ఓ లైక్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ ఆప్షన్‌ను మరింత విస్తరిస్తూ.. సరికొత్త రియాక్షన్ సింబల్స్‌ను ఫేస్బుక్ అందుబాటులోకి తెస్తోంది. 'కోపం', 'బాధ', 'వావ్', 'హాహా', 'యాయ్', 'లవ్' వంటి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే యానిమేటెడ్ ఇమేజ్‌లను ప్రవేశపెట్టబోతున్నది. దీంతోపాటు యాథావిధిగా 'లైక్' బటన్ కూడా ఉంటుంది. 'లైక్' బటన్‌ను కాసేపు గట్టిగా ప్రెస్ చేస్తే ఈ రియాక్షన్స్ కనిపిస్తాయి. వాటిలో నచ్చినదానిని యూజర్ ఎంచుకోవచ్చు. ఫేస్బుక్లో 'డిస్లైక్' బటన్‌ను కూడా ప్రవేశపెట్టాలని చాలామంది యూజర్లు కోరుతూ వస్తున్నారు. అయితే, ఇది ప్రతికూలతలను పెంచుతుందన్న భావనతో ఈ ఆలోచనను ఫేస్బుక్ తోసిపుచ్చింది.