breaking news
Bus bombing
-
సిరియాలో సైన్యం లక్ష్యంగా బస్ బాంబు పేలుడు
డమాస్కస్: సిరియా సైనికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన బస్ బాంబు దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లో బుధవారం ఈ దాడి జరిగింది. బుధవారం ఉదయం రద్దీ సమయంలో డమాస్కస్‌లోని ఒక జంక్షన్ వద్ద ఈ పేలుడు జరిగింది. సిరియా సైనికులు ప్రయాణిస్తున్న ఒక బస్‌కు ముందుగానే ఆగంతకులు రెండు శక్తివంతమైన బాంబులను అమర్చారు. సైనికులతో బస్సు కదులుతుండగా ఆ బాంబులను పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది సైనికులు మరణించారు. సిరియా అధ్యక్షుడు బషర్–అల్–అస్సద్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష సాయుధ కూటములు, జిహాదీ సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అధీనంలోని ప్రాంతంలో సైన్యం జరిపిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని ఓ పట్టణంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఎనిమిది మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయురాలు, ఒక మహిళ చనిపోయారు. -
బస్సులో బాంబు పేలుడు: ఆరుగురు మృతి
యెమెన్ రాజధాని సనాలో ఆదివారం ఉదయం బస్సులో బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మరణించారని భద్రతాధికారులు ఇక్కడ వెల్లడించారు. యెమెన్‌లోని ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘటనను బాధ్యులుగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సనా విమానాశ్రయానికి వెళ్తున్న బస్సులో బాంబు పేలుడు సంభవించిందని తెలిపారు. బాంబు పేలుడు సంభవించడంతో సైనికుల మృతదేహలు రోడ్డుపైకి విసిరివేయబడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని భద్రతాధికారులు చెప్పారు. గతంలో యెమెన్‌లో ఆల్ ఖైదా సంస్థ ఇటువంటి ఘటనలకు పాల్పడిన సంఘటనలు లెక్కకి మిక్కిలి ఉన్నాయని వారు వివరించారు.