బస్సులో బాంబు పేలుడు: ఆరుగురు మృతి | Bus bombing kills 6 Yemen air force personnel | Sakshi
Sakshi News home page

బస్సులో బాంబు పేలుడు: ఆరుగురు మృతి

Aug 25 2013 12:06 PM | Updated on Sep 1 2017 10:07 PM

సనాలో ఆదివారం ఉదయం బస్సులో బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మరణించారని భద్రతాధికారులు వెల్లడించారు.

యెమెన్ రాజధాని సనాలో ఆదివారం ఉదయం బస్సులో బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మరణించారని భద్రతాధికారులు ఇక్కడ వెల్లడించారు. యెమెన్లోని ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘటనను బాధ్యులుగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సనా విమానాశ్రయానికి వెళ్తున్న బస్సులో బాంబు పేలుడు సంభవించిందని తెలిపారు. బాంబు పేలుడు సంభవించడంతో సైనికుల మృతదేహలు రోడ్డుపైకి విసిరివేయబడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని భద్రతాధికారులు చెప్పారు. గతంలో యెమెన్లో ఆల్ ఖైదా సంస్థ ఇటువంటి ఘటనలకు పాల్పడిన సంఘటనలు లెక్కకి మిక్కిలి ఉన్నాయని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement