breaking news
burried
-
ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది! సరిగ్గా 11 రోజుల తర్వాత..
ఒక్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా అనే మహిళ పొరపాటున సజీవ సమాధి అయ్యిందనే విషయం గుప్పుమంది. ఆమె డెత్ సర్టిఫికేట్లో షాక్‌కి గురయ్యి, గుండెపోటుతో మరణించినట్లు ఉంది. దీంతో తాము ఖననం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె సమాధి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లు ఆ సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఓ మనిషి మూలుగు వినిపోస్తుందని అందరూ చెప్పడంతో.. బంధువులు ఆమె చనిపోయిన 11వ రోజున ఆమె సమాధికి వద్దకు చేరుకుని తవ్వడం ప్రారంభించారు. వెలికితీయగా బంధువులంతా అల్మెడాని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లతో టెన్షన్ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది. అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్ ఘటన అనేక ట్విస్ట్‌లతో బాధకరంగా ముగిసింది. (చదవండి: మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"నే పునర్నిర్మించారు!) -
పాపం చిట్టితల్లి.. బతికుండగానే
లక్నో: ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన చిన్నారిని బతికుండగానే కుండలో పెట్టి మరి పూడ్చిపెట్టిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. వివరాలు.. హితేష్ కుమార్ సిరోహీ అనే వ్యాపారి భార్య వైశాలికి ఏడో నెల. అయితే రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైశాలి నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు పుట్టిన కొద్దిసేపటికే ఆ బిడ్డ మరణించింది. పసికందు మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి సిరోహీ శ్మశానికి వెళ్లాడు. మృతదేహాన్ని పూడ్చడం కోసం శ్మశానంలో గుంత తవ్వుతుండగా.. మూడు అడుగుల లోతున అతడికి ఓ మట్టికుండ అడ్డు తగిలింది. దాన్ని బయటకు తీసి, తెరచి చూసిన సిరోహీకి ఒక్క సారిగా షాక్ తగిలినట్టయ్యింది. ఎందుకంటే ఆ కుండలో అప్పుడే పుట్టిన ఓ చిన్నారి సజీవింగా ఉంది. ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దాంతో సిరోహీ వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించాడు. పోలీసులకు కూడా సమాచారం అందించాడు. బతికుండగానే చిన్నారిని కుండలో పెట్టి పూడ్చిపెట్టిన ఘటన బరేలీలో కలకలం రేపింది. మరోవైపు చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. అన్ని సదుపాయాలున్న మరో ఆస్పత్రికి తరలించారు వైద్యులు. ఈ సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా స్పందించడమే కాక ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆటోలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా ఆకీవీడు మండలం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోలో బాణాసంచా తరిలిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి ఆటోడ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలంరేగింది. ఆ వివరాలు.. ఏలూరులో నిర్వహించే జాతర కోసం భీమవరంలోని ముసలయ్య అనే బాణాసంచా తయారీదారి నుంచి భారీ ఎత్తులోబాణాసంచా సామాగ్రిని ఆటోలో తరలిస్తుండగా ఆకీవీడు జాతీయరహదారిపై ఐబీపీ పేట్రోలు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ నాగరాజు ఆటోలోనే సజీవదహనమయ్యాడు. మిగిలిన ఇద్దరు హలకొండ సత్యనారయణ, 70 శాతం కాలిపోగా కొల్లా శ్రీనివాస్ 40 శాతం కాలిన గాయాలతో ఆటోలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. స్థానికులు 108 సాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటో వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ముందు ఒక నెంబర్, వెనుక ఒక నెంబర్ ఉండటంతో సాధ్యం కాలేదు. -
ఆటోలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
-
8 రోజులు సజీవ సమాధి.. అయినా బతికిన చిన్నారి!
చైనాలో గ్రహణం మొర్రితో పుట్టిన ఓ బాబును ఆమె తల్లిదండ్రులు ఓ చెక్క పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చేశారు. కానీ, 8 రోజుల తర్వాత ఆమెను ఎవరో బయటకు తీస్తే.. చిన్నారి క్షేమంగా ఉంది!! అదృష్టవశాత్తు ఆ చెక్కపెట్టెలోకి కొంత గాలి, నీరు మాత్రం వెళ్లాయి. బూట్లు పెట్టుకునే పరిమాణంలో ఉన్న బాక్సులో ఆ చిన్నారిని కప్పిపెట్టారు. అయితే, 8 రోజుల తర్వాత అటువైపు మూలికల కోసం వచ్చిన ఓ మహిళకు అబ్బాయి ఏడుపు వినిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూసింది. వెంటనే బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చింది. వైద్యులు పరీక్షించేసరికి ఆ అబ్బాయి నోట్లోంచి మట్టి ఉమ్ముతున్నాడు. పిల్లాడిని కావాలని హతమార్చే ప్రయత్నం చేశారన్న నేరం కింద ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాలో ఇలాంటి అవకరాలు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఎలాగోలా వాళ్లను వదిలించుకోడానికే ప్రయత్నిస్తుంటారు. అక్కడ కుటుంబ నియంత్రణ నిబంధనలు గట్టిగా ఉండటం, ఇలాంటి పిల్లల వైద్య ఖర్చులు భరించలేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.