ఆ పాఠశాలలో ‘నమస్తే’పై నిషేధం
కెన్నెసా(యూఎస్): మత విశ్వాసాలను బలవంతంగా విద్యార్థులపై రద్దుతున్నారని తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తడంతో అమెరికాలోని ఓ స్కూల్లో యోగా క్లాసుల్లో ‘నమస్తే’పై యాజమాన్యం నిషేధం విధించింది. జార్జియా రాష్ట్రం కెన్నెసా పట్టణంలోని బుల్లార్డ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఒత్తిడిని తగ్గించేందుకు కొన్నేళ్లుగా యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.
అయితే కొత్త అంశాలపై తల్లిదండ్రుల అభ్యంతరాలతో నమస్తేను నిషేధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ‘నమస్తే’, ‘మండలం’ బొమ్మలో రంగులు నింపడం, ‘స్వస్థతగుణం స్ఫటికాలకు ఉంది అనే అంశంపై ప్రసంగం’లను నిషేధించారు. అయితే, యోగా అనేది ఏ మతానికి చెందినది కాదని యోగా గురువు క్రాఫోర్డ్ అన్నారు.