breaking news
Builders JAC
-
సిమెంట్ ధరలు తగ్గించలేం!
-
సిమెంట్ ధరలు తగ్గవు.. మరింత పెరుగుతాయి..
హైదరాబాద్: సిమెంట్ ధరలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గవని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. సిమెంట్ ధరలు పెరగడానికి బొగ్గు, విద్యుత్ కొరత, ధరల పెరుగుదలనే కారణమని సంస్థలు వెల్లడించాయి. బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా ఇప్పటికే 2 రాష్ట్రాల్లో 4 సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇప్పట్లో సిమెంట్ ధరలు తగ్గే అవకాశం లేదని.. భవిష్యత్ లో మరింత పెరుగుతాయని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు అన్నారు. సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సిమెంట్ ధరల అనూహ్య పెరుగుదలపై బిల్డర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరు రోజుల పాటు భవనాల నిర్మాణాన్ని ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
నేటి నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి సిమెంట్ కొనుగోళ్లను నిలిపి వేయనున్నట్లు బిల్డర్ల జేఏసీ ప్రకటించింది. సిమెంట్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ధరలను తక్షణమే తగ్గించకపోతే 12వ తేదీ తర్వాత అవసరమైతే నిర్మాణాలనూ ఆపేస్తామని హెచ్చరించింది. రెండు రాష్ట్రాల్లో సిమెంట్‌కు ఏర్పడే డిమాండ్ నుంచి లబ్ధి పొందడానికే సిమెంట్ కంపెనీలు రేట్లు పెంచుతున్నాయని ఆరోపించింది. నెలక్రితం రూ.175-190 మధ్య ఉన్న ధరను ప్రస్తుతం రూ.320కు చేరడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెబుతోంది. దీంతో అనివార్యంగా ఫ్లాట్ల ధరలను పెంచడంతో పాటు గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేమని చెప్పింది.