breaking news
the budget deficit
-
లోటు బడ్జెట్ అంటే ఏమిటి?
ప్రభుత్వం అభివృద్ధి వ్యయానికి ఎక్కువగా ఖర్చుపెడితే అది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వం ఆ కోణంలోనే కృషి చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇలా కాకుండా అభివృద్ధేతర వ్యయంపై ప్రభుత్వం అధికంగా ఖర్చుపెడితే దీర్ఘకాలంలో ఫలితాలనిచ్చే మూలధన ఆస్తులను తయారు చేసుకునే శక్తి ఆ ప్రభుత్వానికి లేదని ప్రస్ఫుటమవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు రకాల వ్యయానికి సబంధించి సమతౌల్యం పాటించాలి. ప్రభుత్వ వ్యయం - బడ్జెట్ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు. అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వ వ్యయం రెండు రకాలుగా ఉంటుంది. అవి: 1. అభివృద్ధి వ్యయం: సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేసే వ్యయం. 2. అభివృద్ధేతర వ్యయం: పరిపాలన, దేశ రక్షణ, పోలీసు సేవల కోసం పెట్టే ఖర్చు. మూలధన ఆస్తులను రూపొందించడం అనే అంశం దృష్ట్యా ప్రభుత్వం రెండు రకాలుగా వ్యయాలు చేస్తుంది. అవి: 1.రాబడి వ్యయం (రెవెన్యూ వ్యయం): ప్రభుత్వం చేసే రోజువారి ఖర్చు. అంటే సాధారణ పరిపాలన, దేశ రక్షణ, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ, రోడ్లు - భవనాలపై చేసే ఖర్చు, వివిధ రకాల పింఛన్లు మొదలైనవి. 2.మూలధన వ్యయం (క్యాపిటల్ వ్యయం): నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలు, జాతీయ రహదారుల నిర్మాణంపై చేసే ఖర్చును మూలధన వ్యయంగా పేర్కొంటారు. యుద్ధ సమయాల్లో దేశ రక్షణ కోసం చేసే వ్యయాన్ని మూలధన వ్యయంగా, సాధారణ సమయాల్లో సైన్యాన్ని పోషించడానికి చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పిలుస్తారు. బడ్జెట్ బౌగెట్ అనే ఆంగ్ల పదమే వాడుకలో ‘బడ్జెట్’ గా మారింది. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. రాజ్యాంగ ప్రకరణ 112లో ‘వార్షిక ఆర్థిక నివేదిక’గా పేర్కొన్నారు. దీన్నే మనం బడ్జెట్‌గా పిలుస్తున్నాం. స్థూలంగా బడ్జెట్ అంటే ఒక నిర్ధారిత కాలానికి రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయం గురించి వివరించే కోశ నివేదిక. ప్రభుత్వం ఈ నివేదికను రూపొందించిన తర్వాత శాసనశాఖ ఆమోదం పొందినప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది. దేశ వార్షిక ఆర్థిక నివేదికను కేంద్ర బడ్జెట్ అని, రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదికను రాష్ట్ర బడ్జెట్ అని అంటారు. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో, రాష్ట్ర బడ్జెట్‌ను రాష్ట్ర విధానసభలో ఆమోదిస్తారు. మనదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున పార్లమెంట్లో ప్రవేశ పెడతారు. రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘బడ్జెట్ విభాగం’ కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల బడ్జెట్‌ను కూడా ఈ విభాగమే రూపొందిస్తుంది. భారతదేశంలో రెండు రకాల బడ్జెట్లను రూపొందిస్తారు. అవి: 1. సాధారణ బడ్జెట్ 2. రైల్వే బడ్జెట్ 1921 నుంచి రైల్వే బడ్జెట్‌ను, సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేసి విడివిడిగా పార్లమెంట్లో నివేదిస్తున్నారు. ముందుగా రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్‌ను, ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాలను అంచనా వేస్తూ బడ్జెట్ నిర్మాణం చేస్తుంది. బడ్జెట్ ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది. బడ్జెట్లో ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం అని వేర్వేరుగా వర్గీకరించి పొందుపరుస్తారు. రెవెన్యూ ఆదాయాన్ని తిరిగి పన్ను ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయమని లెక్కగడతారు. పన్నేతర మార్గాలు అంటే ప్రభుత్వానికి వడ్డీల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం. డివిడెండ్లు, డిపాజిట్లు, తపాలా పొదుపు ఖాతాలోని ఆదాయం, భీమా సొమ్ము, కిసాన్ వికాస పత్రాలు, ఇందిరా వికాస పత్రాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొదలైనవి దీని కిందకు వస్తాయి. మూలధన ఆదాయంలో ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన రుణాలు, రిజర్వ బ్యాంక్ విదేశాల నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వెనక్కి తీసుకున్న పెట్టుబడులు, చిన్నమొత్తాల పొదుపు సెక్యూరిటీలు, ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము ఉంటాయి. రెవెన్యూ, మూలధన ఆదాయాలను కలిపి మొత్తం ఆదాయాన్ని నిర్ధారిస్తారు. వ్యయాన్ని ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని విభజించి లెక్కిస్తారు. ప్రణాళిక వ్యయంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం (క్యాపిటల్ వ్యయం) అని, అదేవిధంగా ప్రణాళికేతర వ్యయంలోనూ రెవెన్యూ, మూలధన వ్యయమని వర్గీకరించి పద్దుల వారిగా నిర్ణయిస్తారు. ప్రణాళిక వ్యయం అంటే ప్రణాళిక సంఘం ప్రతిపాదించిన వ్యయం. ప్రణాళికేతర వ్యయం అంటే ఉద్యోగులకు చెల్లించే జీతాలు, వివిధ రకాల సబ్సిడీలు, గ్రాంట్లు, పెన్షన్లు, ఆర్థిక, సామాజిక భద్రత సేవలు, ప్రభుత్వం రాష్ట్రాలకు - విదేశాలకు ఇచ్చే రుణాలు, ప్రభత్వ రంగ సంస్థలకు, రక్షణ రంగానికి పెట్టే ఖర్చు మొదలైనవి ఉంటాయి. ప్రణాళికేతర వ్యయంలో రెవెన్యూ మూలధన వ్యయాలతోపాటు ప్రభుత్వం తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ వ్యయాన్ని కూడా లెక్కిస్తారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని కలిపి మొత్తం వ్యయాన్ని లెక్కగడతారు. 1. సంతులిత బడ్జెట్: ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్న బడ్జెట్. 2. అసంతులిత బడ్జెట్: ఆదాయ, వ్యయాలు అసమానంగా ఉండే బడ్జెట్. 3. మిగులు బడ్జెట్: ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉండే బడ్జెట్. 4. లోటు బడ్జెట్: ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండే బడ్జెట్. ముఖ్యంగా నాలుగు రకాల లోటు బడ్జెట్లు ఉంటాయి. అవి: రెవెన్యూ లోటు (రాబడిలోటు): ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లోని రెవెన్యూ వ్యయాల మొత్తం నుంచి మొత్తం రెవె న్యూ ఆదాయాన్ని తీసివేస్తే వచ్చే లోటునే రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎంత ఎక్కువగా ఉందో ఇది తెలియజేస్తుంది. బడ్జెట్ లోటు: ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లోని రెవెన్యూ, మూలధన వ్యయా ల పద్దుల మొత్తం నుంచి మొత్తం ఆదాయాన్ని (రెవెన్యూ+మూలధన ఆదాయం) తీసివేస్తే వచ్చేలోటును బడ్జెట్ లోటు అం టారు. ఇది రెవెన్యూ,మూలధన ఆదాయం కంటే రెవెన్యూ, మూలధన వ్యయం ఎంత ఎక్కువగా ఉందో సూచిస్తుంది. ప్రభుత్వం రిజర్వ బ్యాంక్‌కు జారీ చేసే ట్రేజరీ బిల్లుల ద్వారా ఈ లోటు నుంచి గట్టెక్కుతుంది. ద్రవ్యలోటు: బడ్జెట్ లోటుకు మూలధన ఆదాయంలో పేర్కొన్న ప్రభుత్వం తీసుకు న్న రుణాలను కలిపితే వచ్చే లోటును ద్ర వ్యలోటు అంటారు. దీన్నే విత్తలోటు/ కోశలోటు అని కూడా అంటారు. అంటే మొ త్తం ఆదాయం నుంచి ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా తీసుకున్న రుణాలను తీసివేయగా నిల్వ ఉన్న ఆదాయాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లోని రెవెన్యూ, మూ లధన వ్యయాల మొత్తం నుంచి తీసివేస్తే వచ్చేలోటు. ప్రభుత్వానికి ఎంత రుణం అవసరమో ఈ లోటు తెలియజేస్తుంది. {పాథమిక లోటు: ద్రవ్యలోటు నుంచి ప్రణాళికేతర వ్యయంలోని ప్రభుత్వం తీసుకున్న రుణాలకు ప్రభుత్వం చెల్లించే వడ్డీని తీసివేస్తే వచ్చేలోటును ప్రాథమిక లోటు అంటారు. లోటు బడ్జెట్ వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం భారతదేశంలో లోటు బడ్జెట్ అనేది అతి సాధారణమైంది. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం నూతన పన్నులను విధించడం, పన్నురేట్లను పెంచడం చేస్తుంది. మాదిరిప్రశ్నలు 1. రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశ పెడతారు? 1) రైల్వేశాఖ మంత్రి 2) రైల్వే బోర్డ చైర్మన్ 3) లోక్‌సభ స్పీకర్ 4) ప్రధానమంత్రి 2. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే అది ఏ రకమైన బడ్జెట్? 1) సంతులిత 2) సమతుల్య 3) మిగులు 4) లోటు 3. ఆర్థికశాఖ మంత్రి సాధారణంగా ఏ రోజున పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు? 1) మార్చి 1 2) ఫిబ్రవరి 28 3) మార్చి మొదటి రోజు 4) ఫిబ్రవరి చివరి రోజు 4. బడ్జెట్ అంటే? 1) {పభుత్వ రాబడి, ఖర్చును వివరించే నివేదిక 2) {పభుత్వ ఆదాయం, మూలధనాన్ని అంచనా వేసే పత్రం 3) ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను అంచనా వేసి వివరించే పత్రం 4) ఒక నిర్దిష్ట సంవత్సరానికిగాను ప్రభు త్వ నిధులను అంచనా వేసే నివేదిక 5. బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం పొందిన ఆదాయాన్ని బడ్జెట్లో ఏ పద్దు కింద జమచేస్తారు? 1) రెవెన్యూ ఆదాయం 2) రాబడి చెల్లింపులు 3) ప్రణాళిక ఆదాయం 4) మూలధన ఆదాయం 6. ‘సర్చార్జ’ అంటే? 1) వ్యయాలను పూడ్చుకోవడానికి కావాల్సిన అదనపు ఆదాయాన్ని పొందడానికి విధించే తాత్కాలిక పన్ను 2) వ్యయాలను పూడ్చుకోవడంలో భాగంగా ప్రభుత్వం విధించే అదనపు పన్ను 3) అదనపు ఆదాయం సంపాదనలో భాగంగా ప్రభుత్వం పన్నురేటును పెంచి వసూలు చేయడం 4) అదనపు సేవలకు విధించే అదనపు పన్ను 7. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో అధికశాతం ఆక్రమిస్తున్న అంశం? 1) సబ్సిడీలు 2) ఉద్యోగుల జీతభత్యాలు 3) రక్షణ రంగం 4) తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలు 8. లోటు ద్రవ్య విధానం అంటే? 1) ద్రవ్యలోటు ఏర్పడకుండా జాగ్రత్త పడటం 2) మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం 3) ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవడం 4) ఆదాయం కంటే అధికంగా ఖర్చు చేయడం 9. పబ్లిక్ బారోయింగ్ అంటే? 1) ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వం అప్పు తీసుకోవడం 2) ప్రజల నుంచి ప్రభుత్వం రుణాలు తీసుకోవడం 3) ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం 4) విదేశాల నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడం 10. ప్రభుత్వం చేసే రోజువారి ఖర్చును ఏ వ్యయం అంటారు? 1) రెవెన్యూ వ్యయం 2) మూలధన వ్యయం 3) అభివృద్ధి వ్యయం 4) అభివృద్ధేతర వ్యయం సమాధానాలు: 1) 1; 2) 4; 3) 4; 4) 3; 5) 4; 6) 1; 7) 4; 8) 4; 9) 2; 10) 1. గతంలో అడిగిన ప్రశ్నలు 1. యుద్ధ సమయాల్లో దేశ రక్షణ కోసం చేసే వ్యయాన్ని ఏమంటారు? (ఎస్ఐ - 2012) 1) రెవెన్యూ వ్యయం 2) మూలధన వ్యయం 3) అభివృద్ధి వ్యయం 4) అనుత్పాదిత వ్యయం 2. ‘బడ్జెట్’ అనే పదాన్ని ఏ భాష నుంచి తీసుకున్నారు? (జైల్ వార్డర్ - 2011) 1) స్పానిష్ 2) ఫ్రెంచ్ 3) లాటిన్ 4) ఇంగ్లిష్ 3. రాజ్యాంగంలో బడ్జెట్‌ను ఏవిధంగా ప్రస్తావించారు? (డిప్యూటీ జైలర్‌స - 2011) 1) ఆదాయ వ్యయాల నివేదిక 2) ఆదాయ వ్యయాల వార్షిక నివేదిక 3) వార్షిక ఆర్థిక నివేదిక 4) ఆదాయ వ్యయాల అంచనాల వార్షిక నివేదిక 4. {దవ్యలోటును కిందివిధంగా కూడా పిలుస్తారు? (పోలీస్ కానిస్టేబుల్ - 2009) 1) రెవెన్యూలోటు 2) ప్రాథమిక లోటు 3) విత్తలోటు 4) బడ్జెట్ లోటు సమాధానాలు: 1) 2; 2) 4; 3) 3; 4) 3. -
ప్రభుత్వమే ‘అడ్డుగోడ'
కర్నూలు రూరల్: హంద్రీ, తుంగభద్ర నదుల వరదల నుంచి నగర ప్రజలకు ముప్పును తప్పించే నాథుడే కనిపించడం లేదు. వైఎస్ఆర్ హాయంలో మంజూరైన వరద రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మంజూరైన పనులకు తెలుగుదేశం ప్రభుత్వం లోటు బడ్జెట్ అంటూ నిధులు విడుదల చేయలేదు. 2008 సంవత్సరంలో వచ్చిన హంద్రీ వరదలు నగర ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. నాడు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నాటి పరిస్థితులను చూసి చలించారు. నగరం చుట్టూ వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రక్షణ గోడ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ‘గోటె’ అనే కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేయించి .. ఇచ్చిన నివేదికల ఆధారంగా రూ.244.70 కోట్ల నిధులను మంజూరు చేసి, 2008 డిసెంబరులో జిల్లా మ్యుజియం ఎదుట శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం రక్షణ గోడ నిర్మాణాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వరద రక్షణ గోడ నిర్మించడం ప్రభుత్వానికి భారమవుతుందనే ఉద్దేశంతోనే రద్దు చేసి అవసరమైనప్పుడు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు అధికారులు హంద్రీనది ఎంత విస్తీర్ణంలో ఉంది..వెడల్పు ఎంత..నది భూములను ఎక్కడేక్కడ ఆక్రమణకు గురయ్యాయే ముందస్తుగా గుర్తించకుండానే అంచన వ్యయాలను వేయడంతో టెక్నికల్‌గా కూడా నిధుల మంజూరికి అడ్డుగా మారినట్లు తెలిసింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి అధికారులు కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆగస్టు నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 25 కోట్లు కేటాయించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పైసా కూడా కేటాయించలేదు. ట్రాఫిక్ మళ్లింపునకు వంతెనల నిర్మాణం నగరంలో వాహనాల రద్దీ పెరుగుతుండటంతో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు హంద్రీ నదిపై మూడు వంతెలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల సమాచారం. హంద్రీనది 3.6 కి.మీ దగ్గర స్విమ్మింగ్‌పూల్ సమీపం నుంచి నది ఆవలవైపు ఉన్న ఆనంద్ సినీ కాంప్లెక్స్ వరకు (కేసీ కెనాల్‌కు అనుసంధానంగా) నిర్మించేందుకు రూ.18.92 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే హంద్రీ 0.875 కి.మీ దగ్గర ( జమ్మిచెట్టు) నుంచి జొహరాపురానికి వెళ్లే క్రాస్ వంతెనకు రూ.13.90 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. కిడ్స్‌వరల్డ్ దగ్గర వంతెన నిర్మాణానికి సుమారు రూ. 15 కోట్లతో ప్రతిపాదించారు.