breaking news
budda shesha reddy
-
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
-
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
కర్నూలు : జిల్లాలో రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ఈ యాత్ర మూడోరోజుకు చేరింది. ఆయన ఈ సందర్భంగా వేల్పనూరులో మాట్లాడుతూ రైతులు, నిరుద్యోగులు, మహిళలను చంద్రబాబు నాయుడు మోసగించారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు రుణమాఫీ మాటే మరిచిపోయారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇక బుడ్డా శేషారెడ్డి కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చుపెట్టారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు. బుడ్డా శేషారెడ్డికి అన్నివిధాలుగా అండగా ఉంటా. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. (కాగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కర్నూలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.) -
సంక్షేమ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం
ఆత్మకూరు రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శ్రీపతిరావుపేట గ్రామంలో వారు గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చే శారు. ఆ పథకాలు మళ్లీ అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాఆలని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని అన్నారు. వికలాంగులకు రూ.500ల నుంచి రూ.700ల వరకూ, వృద్ధులకు రూ.500లు పింఛన్లు ఇస్తామన్నారు. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్, టీడీపీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, ఆ పార్టీల నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ తిరుపమయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు జయకృష్ణ, మండల బీసీ సెల్ కన్వీనర్ గోకారి, నాయకులు నాగూర్‌ఖాన్, యుగంధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, జక్కామురళి, తిమ్మయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీపీ శ్రీపతిరావుపేటలో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీపీ మహేశ్వరయ్య ఆధ్వర్యంలో 600 మంది బుడ్డా సోదరుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరుపై విసుగు చెందానన్నారు. దివంగత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాయన్నారు. ఈ పథకాల అమలు జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమనే నమ్మకంతో బుడ్డా సోదరుల సమక్షంలో పార్టీలో చేరామన్నారు. ఇలా ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడుతుండడంతో ఆ పార్టీకి మండలంలో బలం తగ్గుతోంది. పార్టీలో చేరిన వారి రిటైర్డు ఎస్ఐ వెన్నా శేషిరెడ్డి, గ్రామ సర్పంచు మురహరి కళావతమ్మ, శంకర్, జె.పరమేశ్వరయ్య, ఉపసర్పంచు చిన్న సిద్దయ్య, రిటైర్డు ఫారెస్టర్ ముర్తుజా తదితరులున్నారు.