breaking news
Budagajangalu
-
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
మాదే కులం?
వీరంతా బుడగజంగాలోళ్లు.. ఒకప్పుడు ఊరూరా తిరిగి యాచించే వారు.. ఇప్పుడు బిందెలు, ఆట బొమ్మలు తదితరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వీరికి పిల్లలను చదివించుకోవాలన్నా.. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కుల ధ్రువీకరణ పత్రమడుగుతున్నారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు, పాలకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారి కులమేదో తేల్చకుండా ఏళ్ల తరబడి నాన్చుతున్నారు. కర్నూలు, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని సద్దాం కాలనీ వెనుక వైపున 30 సంవత్సరాల నుంచి 200 బుడగ జంగాల కుటుంబాలు నివాసముంటున్నాయి.వీరు పిల్లలను స్థానిక స్కూళ్లలో చదివించుకుంటున్నారు. కొందరు చదువులో మంచి ప్రతిభ సైతం కనబరుస్తున్నారు. అయినా, వీరికి స్కాలర్షిప్, హాస్టల్ వసతి, ఉచిత పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది. అవి పొందాలంటే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని విద్యాసంస్థల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. బుడగ జంగాలకు చెందిన తాము ఎస్సీ కేటగిరీ కిందకు వస్తామని తహసీల్దార్ కార్యాలయాలకెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారు పట్టించుకోవడం లేదు. గెజిట్‌లో జిల్లాలో ఎక్కడా బుడగజంగాల కులమే లేదని, దీంతో మీరు ఎస్సీ కాదని తిరస్కరిస్తున్నారు. కనీసం బీసీ కుల ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వమంటే అందుకు అంగీకరించడం లేదు. దిక్కుతోచని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువును మధ్యలో ఆపివేసి పనులకు తీసుకెళ్తున్నారు. వైఎస్సార్ మరణంతో ఇబ్బందులు రాష్ట్రంలోని కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బుడగజంగాల కులస్తులు అత్యధికంగా నివసిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 వేల మంది దాకా ఉన్నారు. వీరందరినీ ఎస్సీలుగా గుర్తిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీఓ జారీ చేశారు. అప్పటికప్పుడు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆయన మరణానంతరం బుడజంగాలు కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నారని, ఏపీలో ఎక్కడా లేరని ప్రభుత్వం అనాలోచితంగా జీఓ నంబర్ 44 విడుదల చేసింది. అప్పటి నుంచి అధికారులు వీరికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీని నిలిపి వేశారు. అయితే, తమదేకులమో తేల్చమని గత కొన్నేళ్లుగా వారు ప్రభుత్వకార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. బాబు కమిషన్ ఏమైందో ? నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్రంలోని బుడజంగాల నాయకులు ప్రతిపక్ష నేత వైఎస్జగన్ మోహన్‌రెడ్డిని కలుసుకుని కలిసి తమ సమస్య వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నంద్యాలలో వారికున్న 5 వేలకు పైగా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పడుతాయోనని ఉలిక్కిపడ్డ చంద్రబాబునాయుడు అప్పటికప్పుడు కుల నిర్ధారణకు కమిషన్ వేస్తానన్నారు. అంతేకాదు వారం పదిరోజుల్లో ఆ కమిషన్ పూర్తి నివేదిక ఇస్తుందని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటికీ ఏడాది గడిచినా అతీగతీ లేదు. -
మావోళ్లు ఎట్లున్నరో!
- నేపాల్‌లో చిక్కుకున్న 2వేల మంది? - బుడగజంగాలవారే అత్యధికం - పనిచేయని సమాచార వ్యవస్థ - క్షేమ సమాచారం తెలియక బంధువుల ఆందోళన. నేపాల్ భూకంపం జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నష్టం చేస్తున్న భూవిలయంలో జిల్లావాసులు రెండువేల మంది చిక్కుకున్నారని అంచనా. వీరిలో చాలామంది బుడగజంగాల వారే. రంగురాళ్లు, ఉంగరాల విక్రయం, జాతకాలు చెప్పేందుకు వలసవెళ్లిన వీరి సమాచారం తెలియక వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఫోన్లలో సమాచారం కోసం ప్రయత్నిస్తున్నా స్పందించకపోవడం... అక్కడ చాలా మంది మరణించినట్లు, గాయపడినట్లు వార్తలు వస్తుండడంతో తమవారి కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, నారాయణరావుపల్లి, గొల్లపల్లి, కరీంనగర్ మండలం చేగుర్తి, తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీ, వీణవంక మండలం చల్లూరు తదితర గ్రామాల నుంచి రెండు వేల మంది ఉపాధికోసం నేపాల్ వెళ్లారు. ఒక్క రామకృష్ణకాలనీవారే వెరుు్యమందికి పైగా ఉంటారని తెలిసింది. సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, నారాయణరావుపల్లి గ్రామాలకు చెందిన 300 మంది బుడగజంగాల కులస్తులు ఇలా వెళ్లారు. కఠ్మాండు, పశుపతి క్షేత్రం ఏరియా, పూనభువనేశ్వర ప్రాంతం, భీంసింగ్ కోలా ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా 6 నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు మాత్రమే స్వగ్రామాల్లో ఉంటున్నారు. శనివారం భూకంపం వార్త వినగానే క్షేమ సమాచారం కోసం ఫోన్ చేయగా అక్కడివారి ఫోన్లు పనిచేయక వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయూన్ని స్థానిక సర్పంచ్ పడాల అజయ్‌గౌడ్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌తో ఫోన్లో మాట్లాడించి కలెక్టర్ నీతూప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి వారి సమాచారం కోసం భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి వారిని స్వగ్రామానికి చేర్చేలా ప్రయత్నం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఆర్డీవో నారాయణరెడ్డి గర్రెపల్లికి చేరుకుని వారి ఇంటి పేరు, వయసు తదితర వివరాలు సేకరించి కలెక్టర్‌కు సమచారం పంపించారు. మేమంతా క్షేమం వేములవాడ అర్బన్ : అనుపురం గ్రామానికి చెందిన సుమారు 60 మంది బుడగజంగాల కుటుంబీకులు నేపాల్‌లో ఉంటారు. వీరిలో 50మంది భూకంపం సంభవించిన ప్రాంతంలోనే ఉన్నారు. అక్కడ భూకంపం వచ్చిందన్న సమాచారంతో తమవారి క్షేమసమాచారం తెలుసుకునేందుకు కుటుంబసభ్యులు టీవీలకే అతుక్కుపోయూరు. రామారి మల్లవ్వ కుమారుడు నగేశ్ సిక్కింలో ఉండగా ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. తిండికి తిప్పలవుతోందని పలువురు చెబుతున్నారని, నేపాల్ నుంచి తమను రైళ్లు, హెలిక్యాప్టర్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వీర్నాల లక్ష్మణ్, గంగారాం, వీర్నాల రమేశ్ ఆదివారం మధ్యాహ్నం సమాచారం అందించారని గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రం రాజు తెలిపారు. ఫోన్లు సరిగా పనిచేయడం లేదని, సోమవారం తిరిగి ఫోన్ చేస్తామని, తమ గురించి ఆందోళనలు చెందవద్దని చెప్పారన్నారు. రామకృష్ణకాలనీలో ఆందోళన తిమ్మాపూర్ : నేపాల్ భూకంపం మండలంలోని రామకృష్ణకాలనీ బుడగ జంగాల కులస్తులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాలనీకి చెందిన వెరుు్య మంది రంగురాళ్లు, ఉంగరాలు అమ్ముకునేందుకు, జాతకాలు చెప్పేందుకు నేపాల్ వెళ్తుంటారు. కఠ్మాండు సమీపంలో పురాణాభానేశ్వర్, సినా మంగల్లో ఉంటారు. శని, ఆదివారాలు అక్కడే భూకంపం వచ్చినట్లు తెలియడంతో తమవారి క్షేమ సమాచారం తెలియక పిల్లలు, పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ యోగ క్షేమాలను ఫోన్లలో కుటుంబీకులకు చేరవేస్తున్నారు. గంధం తిరుపతి తలకు గాయాలైనట్లు, ఆసుపత్రిలో ఉన్న అంజూ ఫోన్ చేయడం లేదని, బూతం తిరుపతి, లక్ష్మీ ఫోన్లో మాట్లాడడం లేదని వారివారి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. సుమారు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వీణవంక : వీణవంక మండలం చల్లూరు శివారు గొల్లపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. గొల్లపల్లిలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పస్తం సమ్మయ్య, భార్య లక్ష్మి, కుమారులు శ్రీనివాస్, స్వామి, ప్రదీప్, కూతురు భాగ్య ఆరు నెలల క్రితం కఠ్మాండు వెళ్లారు. వీరంతా భూకంపంలో చిక్కుకున్నారని, జాడ తెలియడం లేదని, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని సమ్మయ్య తమ్ముడు యూదగిరి కన్నీటి పర్యంతమయ్యూడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్పూర్ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన 8 మంది చిక్కుకున్నారు. గందం రాజారం, అతడి భార్య శారద, కుమారుడు రమేశ్, కోడలు తిరుమల, మనుమరాలు సుశ్మిత ఖాన్పూర్లో ఉంగరాలు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు. శనివారం భూకంపంతో గోడ కూలి రాజారం, సుశ్మిత గాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఫోన్లోనే విలపించాడు. ఇదే గ్రామానికి చెందిన కల్లేం బాలయ్య, అతడి భార్య, కుమారుడు గంగారం సైతం ఖాన్పూర్లో చిక్కుకున్నారు. రామడుగు మండలం గోపాల్రావుపేట మండలానికి కిన్నెర రాజలింగు, అతడి భార్య సమ్మక్క, వెనుగొండ రాజయ్య నేపాల్‌లోని పశుపతి ఆలయం దగ్గర చిక్కుకున్నట్లు సమాచారం అందించారని, వీరుంటున్న ఇళ్లు కూలిపోయూయని ఇప్పుడు ఎలా? ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని కుటుంబసభ్యులు వాపోయూరు.