breaking news
brussels city
-
రైలు రావడం గమనించి మరీ పట్టాలపై తోసేశాడు..!
రైలు వస్తుండగా పట్టాలపై పడితే ఇక అంతే సంగతులు.. పొరపొటునో, ఆత్మహత్యాయత్నం చేసుకునే క్రమంలో రైలు కింద పడిన సందర్భాలు ఎక్కువగా వింటూ ఉంటాం. కాగా, ఒక మనిషిని హత్య చేయాలనే ఉద్దేశంతో రైలు పట్టాలపైకి తోసిన ఘటన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో ఏమౌతుందో అనిపించే ఈ ఘటనకు సంబంధించి విస్తుగొలిపే వీడియో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకెళ్తే...బ్రస్సెల్స్‌లో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను ఎదురుగా వస్తున్న రైలు ముందుకి తోసాడు. అయితే రైలు సకాలంలో ఆగిపోవడంతో మహిళ గాయపడకుండా ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బ్రస్సెల్స్‌లోని రోజియర్ మెట్రో స్టేషన్లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ దుండగుడు మహిళను పట్టాలపై తోసేయడానికి ముందు అక్కడ ఉన్న ఫ్లాట్‌ఫాం కలియ తిరుగుతాడు. ఆ తర్వాత ఆ మహిళ వద్దకు వచ్చి ఎదురుగా వస్తున్న రైలు ముందుకు తోస్తాడు. ఆ ఘటనతో షాక్‌కు గురైన మహిళ పట్టాలపై పడిపోయి షాక్‌లో ఉండిపోతుంది. అయితే ఆ ట్రైయిన్ డ్రైవర్ సకాలంలో స్పందించి బ్రేక్ వేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ దుండగడు మాత్రం ఆ మహిళను తోసేపి వెంటనే పారియినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపించింది. ఈ మేరకు బ్రస్సెల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆ దుండగుడిని వెంటనే వేరొక మెట్రో స్టేషన్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని తెలిపారు. -
గ్యాంగ్..గ్యాంగ్..బజావో బ్యాంగ్... బ్యాంగ్
సమంత.. రకుల్.. రెజీనా.. నితిన్.. అండ్ టాలీవుడ్ టాప్ స్టైలిస్ట్ నీరజా కోన.. ఇప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారో తెలుసా? బ్రస్సెల్స్ సిటీలో. ఈ బ్యాచ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రస్సెల్స్ ఎక్కడుంది అంటారా? బెల్జియంలో. అక్కడికి ఎందుకు వెళ్లారు అనే డౌట్ వచ్చిందా? వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.. ‘టుమారోల్యాండ్’కి వెళ్లారు. ఫేమస్ డీజేల లైవ్ షో ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. ‘గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్... స్టార్ట్ ది మ్యూజిక్’ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా అవార్డు వేడుకల్లోనో, పక్క పక్కనే షూటింగ్ జరుగుతున్నప్పుడో.. ఈ స్టార్స్ అందరికీ సరదాగా కలుసుకునే అవకాశం లభిస్తుంది. గ్యాంగ్ అంతా కలసి ట్రిప్ వేయడం అంటే గగనమే. ఒకవేళ ఎవరో ఒకరు ఖాళీగా ఉన్నప్పటికీ.. మిగతావాళ్లకి షూటింగ్ ఉంటే కష్టమవుతుంది. కానీ, ఈసారి అందరికీ కుదరడంతో బెల్జియం ట్రిప్ వేశారు. ‘‘చివరి క్షణంలో అనుకోకుండా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఈ నెల మొదటివారంలో ‘టుమారో ల్యాండ్’ టికెట్స్ తీసుకున్నాం’’ అని నీరజా కోన సాక్షితో చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘నేను, నితిన్, మరో ఇద్దరు స్నేహితులు కలసి ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మిలన్ (ఇటలీ) వెళ్లాం. సిటీ చూస్తూ.. షాపింగ్ చేస్తూ.. మిలన్లో సరదాగా గడిపాం. అక్కణ్ణుంచి 21న బ్రస్సెల్స్ చేరుకున్నాం. సమంత, రకుల్, రెజీనాలు బ్రస్సెల్స్‌లో మాతో జాయిన్ అయ్యారు. మా ఆయన అజయ్ అమెరికా నుంచి వచ్చారు. మ్యూజిక్.. మస్తీ.. మజా... దిస్ ట్రిప్ ఈజ్ ఫన్ విత్ మై హజ్బెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్’’ అని నీరజ పేర్కొన్నారు. ఎవరి మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేశారని ప్రశ్నిస్తే.. ‘‘ఫ్రెంచ్ డీజే డేవిడ్ గెట్టా, డచ్ డీజే ఆఫ్రోజాక్ మ్యూజిక్ మా ఫేవరెట్’’ అని చెప్పారు. ఈ నెల 28న వీళ్లంతా తిరుగు ప్రయాణమవుతున్నారు.