breaking news
Brij Kishore
-
ప్రముఖ జిమ్నాస్టిక్స్ కోచ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఎన్. బ్రిజ్ కిశోర్ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1993లో శాట్స్‌లో కోచ్‌గా చేరిన బ్రిజ్‌కిశోర్ ఎంతో మంది జాతీయ స్థాయి జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దారు. ఇటీవల జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన బుద్ధా అరుణా రెడ్డి కూడా ఆయన శిష్యురాలే. ఆయన మృతి పట్ల ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంతాపసభను ఏర్పాటు చేసి రెండు నిమిషాల మౌనం పాటించింది. అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ఆయన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ కార్యదర్శి కె. ఫణిరావు, జిమ్నాస్టిక్స్ కార్యదర్శి కె. మహేశ్వర్, హాకీ కార్యదర్శి భీమ్‌సింగ్ సంతాపసభలో పాల్గొన్నారు. కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత -
కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత
సాక్షి, హైదరాబాద్: శాట్స్ జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిషోర్‌ను సోమవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో బ్రిజ్ కిషోర్ పంజగుట్టలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్‌ను అందజేశారు. ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అరుణ రెడ్డికి ఆయనే కోచ్‌గా ఉన్నారు.