breaking news
bridge constructions
-
‘ఏటి’ కష్టాలు!
కర్నూలు, ఎమ్మిగనూరు: తుంగభద్ర నదిపై ‘నాగలదిన్నె బ్రిడ్జి’ నిర్మాణం కొనసా..గుతూనే ఉంది. గత పాలకుల వైఫల్యాలు ప్రజలకు శాపాలుగా మారాయి. ఎనిమిదేళ్లుగా అటు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక, ఇటు పుట్టి ప్రయాణాలకు అనుమతుల్లేక ప్రజలు నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమ – తెలంగాణ జిల్లాలను అనుసంధానం చేస్తూ నందవరం మండలం నాగలదిన్నె, తెలంగాణలోని అయిజ మధ్య తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 1993లో అంకురార్పణ చేశారు. 1992లో తుంగభద్రకు వరదలు రావటంతో బ్రిడ్జి ఆవశ్యకత ఏర్పడింది. 1993లో పనులు మొదలైనా..అధికారికంగా చేపట్టింది మాత్రం 2003లోనే. అయితే.. 2009 అక్టోబర్ 2నతుంగభద్ర వరద కారణంగా అప్పటివరకు కట్టిన బ్రిడ్జి పూర్తిగా నేల మట్టమైంది. మూడేళ్ల అనంతరం 2012లో బ్రిడ్జి పునర్నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచి.. పనులను ప్రారంభించారు. 2016 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని గడువిచ్చారు. పనులు మొదలై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు 80 శాతం కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయలోపం, చేసిన పనులకు గతంలో సరిగా బిల్లులు ఇవ్వకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అడుగడుగునా అవరోధాలు రూ.41 కోట్లతో చేపట్టిన నాగలదిన్నె బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ తుంగభద్ర నది ఆవలి భాగం తెలంగాణలో ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. తుంగభద్ర నదికి అటువైపు భూసేకరణ సమస్యగా మారింది. పాత బ్రిడ్జి స్థానంలో కాకుండా స్వల్ప మార్పులు చేసి కొత్త డిజైన్‌తో నిర్మాణం చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భూ సేకరణ కోసం అక్కడి ప్రభుత్వం, రైతుల మధ్య సమన్వయం కుదరలేదు. ఇప్పటిదాకా మొత్తం 27 పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. వాటిపై ప్లాట్‌ఫారంగా 84 పీఎస్సీ (ప్రీజ్ స్ట్రక్చర్ కాంక్రీట్) స్లాబ్‌లను వేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ సమస్యను పరిష్కరిస్తేనే నిర్మాణం పూర్తవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇబ్బందుల్లో ప్రజలు నాగలదిన్నె బ్రిడ్జి పూర్తయితే రాయలసీమ – తెలంగాణ జిల్లాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. నదిలో రెండేళ్లుగా పుట్టి ప్రయాణాలను కూడా నిషేధించారు. దీంతో తుంగభద్ర నది దాటాలంటే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపైనే నడక సాగించాల్సి వస్తోంది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణ వైపు రోడ్డు నుంచి బ్రిడ్జి 40 అడుగుల ఎత్తులో ఉండటంతో ప్రయాణికులు ఇనుపరాడ్లతో కూడిన నిచ్చెన నుంచి దిగాల్సి వస్తోంది. ప్రమాదంతో కూడిన ప్రయాణాలు కావటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళుతున్నారు. -
గ్రామాభివృద్ధిలో ముందంజ
మునుగోడు/ చౌటుప్పల్ రూరల్, న్యూస్‌లైన్: సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, గ్రామాలను అభివృద్ధి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం ముందుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. నల్లగొండ-మునుగోడు, చిట్యాల-మునుగోడు రహదారుల్లోని వాగులపై వంతెనల నిర్మాణాలకు మంత్రి మునుగోడులో శంకుస్థాపన చేశారు. ఒక్కో వంతెనను రూ 5.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆమె చెప్పారు. చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం పరిధిలోని సింగరాయిచెర్వులో రూ 1.32కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ 10 లక్షలతో నిర్మించిన కుంట్లగూడెం గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కుంట్లగూడెంలో గ్రామసంఘం భవనం ఏర్పాటు చేశారు. పద్మానగర్ కాలనీలో రూ 4.50 లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. స్థల సేకరణ చేసి అధికారులకు నివేదిక పంపాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ 5లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి కాలువ, కృష్ణాజలాల పైపులైన్ల పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రైతులకు సాగునీరు, ప్రతి గ్రామానికి కృష్ణా జలాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాంట్రాక్టర్లు పారిపోయారని, మైసమ్మ కత్వ కత్వ ఎత్తును పెంచి, త్వరలోనే రైతులకు సాగు జలాలను అందిస్తామన్నారు. ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాలువ నిర్మాణంలో నాణ్యత లోపించిం ద న్నారు. ఇదిలా ఉండగా మునుగోడులో కోమటిరెడ్డి, పాల్వాయి వర్గీయులు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. పాల్వాయి వర్గీయుల సమావేశానికి హాజరైన మంత్రి కేవలం 5నిమిషాల పాటు వేదిక ఎక్కకుండానే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి వెళ్లారు. దీంతో కోమటిరెడ్డి వర్గీయులు కొంత అసంతృప్తి చెందారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వా యి స్రవంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ మాధవరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఐ కర్ణాకర్, ఆర్అండ్బీ ఎస్ఈ ఏం లింగయ్య, ఈఈ రఘునందరెడ్డి, ఆర్డీఓ జహీర్, ప్రత్యేకాధికారి బాబురావు, తహసీల్దార్లు ఏ.ప్రవీన్‌నాయక్, కొప్పుల వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ జి.రజిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాశం సంజ య్‌బాబు, సర్పంచ్‌లు పందుల నర్సింహ, బక్క శంకరయ్య, వల్లకాటి తులసి, సుర్వి నర్సింహగౌడ్, కప్పల శ్రీనివాస్, రాంరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణవాదాన్ని అడ్డుకునేందుకు కుట్ర అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణవాదం వినిపి ంచకుండా ఉండేందుకే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖనుంచి ముఖ్య మంత్రి తప్పించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆది వారం మునుగోడులో రాజ్యసభ సభ్యుడు పా ల్వాయి గోవర్దన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావుతో కలిసి విలేకరులతో మాట్లా డారు. సీఎం కుట్ర పన్నినా ఫలించదన్నారు. ఈనెల 25నాటికి కేంద్రానికి బిల్లు వెళ్తుందని, పార్లమెంటులో దానిని ప్రవేశపెడతారన్నారు.