breaking news
bribe to ec
-
ఢిల్లీ క్రైమ్ పోలీసుల చెన్నై పర్యటన వాయిదా
న్యూఢిల్లీ: రెండాకులు గుర్తుకు కేటాయించాలంటూ లంచం కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ చెన్నై పర్యటను వాయిదా వేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముందుగా ఢిల్లీలో విచారణ పూర్తి చేసిన అనంతరం చెన్నై వెళ్లనున్నారు. అంతేకాకుండా చెన్నై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దినకరన్‌ను ఢిల్లీ తీసుకు వచ్చే విచారణ జరపాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్కేనగర్కు మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా ఎలాగైనా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ భావించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక, రెండాకుల చిహ్నంపై సోమవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో మళ్లీ విచారణ జరగనున్నట్లు తెలుసుకుని ఆయన తన ప్రయత్నాల వేగం పెంచారు. ఎన్నికల కమిషన్‌లోని ఒక అధికారి ద్వారా పని కానిచ్చేందుకు బడా బ్రోకర్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల ‡హోటల్లో దినకరన్ తరఫున బేరసారాలు సాగుతున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులకు ఉప్పందడంతో ఒక్కసారిగా దాడులు జరిపారు. కర్ణాటకకు చెందిన సుఖేష్ చంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.1.30 కోట్లు, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన ఒక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండాకుల చిహ్నం సాధించి పెడతానని దినకరన్‌తో రూ.60 కోట్లు బేరం కుదుర్చుకున్న సుఖేష్ రూ.1.30 కోట్ల అడ్వాన్సు పొందాడు. దీంతో సుఖేష్ వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో దినకరన్‌కు నోటీసులు ఇచ్చే అంశం వాయిదా పడింది. కాగా దినకరన్ మాత్రం ఈ సుఖేష్ ఎవరో తనకు తెలియదు, సమన్లు అందితే చట్టం ద్వారా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన న్యాయవాదులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాగా తాను చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా ఢిల్లీ పోలీసుల చేతుల్లో దినకరన్ కటకటాలపాలు కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది. -
బుక్కయిన దినకరన్.. బిగుస్తున్న ఉచ్చు
-
బుక్కయిన దినకరన్.. బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: తమిళనాడు రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా మారుతున్నాయి. రోజుకోమలుపు తిరుగుతున్నాయి. శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ బుక్కయ్యారు. ఆయనపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఆకులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు అనే విషయం తెలిసిందే. దీనికోసం పన్నీర్ వర్గం, శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు లాబీయింగ్‌లు చేస్తున్నారు. అయితే, దినకరన్ మాత్రం ఏకంగా ఆ గుర్తు తమకే వచ్చేలా చూడాలని చెప్పి రూ.50కోట్ల ఒప్పంద చేసుకొని సుఖేశ్ చంద్ర అనే మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ముట్టజెప్పేందుకు ప్రయత్నం చేశారని తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే సుఖేశ్ చంద్రకు రూ.కోటి 39లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల చేతికి చిక్కడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అతడి వద్ద నుంచి రూ.కోటి39లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికల సంబంధించి పెద్ద మొత్తంలో ఓటర్లను ప్రభావితం చేశారని దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దినకరన్ నేడు శశికళను కలవబోతున్నారు.