breaking news
bramhostam
-
వైభవంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవం
తిరుమల: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నాన కార్యక్రమం గురువారం ఉదయం వైభవంగా జరిగింది. అంతక ముందు వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామివారికి అభిషేక సేవ జరిపారు. చక్రస్నాన మహోత్సవం సందర్భంగా పుష్కరిణిని అరటి, మామిడి తోరణాలతో అలంకరించారు. ముఖ్యంగా చక్రత్తాళ్వరుకు విశేష పూజలు జరిపే ప్రాంతాన్నిఆధ్యాత్మిక చింతనతో తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెను నిర్మించారు. కాగా ఈ రోజు ధ్వజారోహణం నిర్వహించి ఉత్పవాలకు ముగింపు పలుకుతారు. తిరుమలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్పవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలాచరించారు. ఈవో సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. -
తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం
-
తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అంతక ముందు వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామివారికి అభిషేక సేవ జరిపారు. చక్రస్నాన మహోత్సవం సందర్భంగా పుష్కరిణిని అద్దంలా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెను నిర్మించారు. కాగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం నిర్వహించి ఉత్పవాలకు ముగింపు పలుకుతారు. తిరుమలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్పవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి , కాలినడకన వచ్చే భక్తులకు గంటలోపే శ్రీవారి దర్శనం కలుగుతోంది. బుధవారం ఏడుకొండలవాడిని 63,578 మంది భక్తులు దర్శించుకున్నారు.