breaking news
boycott duties
-
స్తంభించిన గ్రామీణ వైద్యసేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీలు) వైద్యసేవలు స్తంభించాయి. వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పీహెచ్‌సీల్లో నాడి పట్టే నాథుడు కరువయ్యారు. ఇన్–సర్విస్ కోటా కుదింపును నిరసిస్తూ, ఇతర సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు సమ్మె బాటపట్టిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో పీహెచ్సీ సేవలను బహిష్కరించిన వైద్యులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని నిరసన తెలపడంతోపాటు ర్యాలీలు, ఇతర మార్గాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని వైద్యశాఖ హెచ్చరించినా, వైద్యులు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పీహెచ్‌సీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు సోమవారం వైద్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్(ఏపీవీవీపీ), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ల్లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్స్(సీఏఎస్), వైద్య విద్యార్థులతో పీహెచ్‌సీల్లో సేవలు అందేలా చూస్తామని తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో వైద్యశాఖ విఫలమైంది. ఎక్కడా పీహెచ్‌సీల్లో ప్రత్యామ్నాయ వైద్యులు కనిపించలేదు. రోగులకు నరకం వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో విషజ్వరాలు, డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధుల బారినపడ్డ గ్రామీణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపసోపాలు పడి వైద్యం కోసం పీహెచ్‌సీల వరకూ వెళితే... అక్కడ వైద్యులు లేకపోవడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్సలు చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో పీహెచ్‌సీలకు వచి్చనవారికి స్టాఫ్ నర్సులే మందులు ఇచ్చి పంపేస్తున్నారు. ఏపీవీవీపీ వైద్యుల మద్దతు పీహెచ్సీ వైద్యుల సమ్మెకు ఏపీవీవీపీ వైద్యుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. పీహెచ్సీ వైద్యులు చేస్తున్న పోరాటంలో ఏపీవీవీపీ వైద్యులకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని ఏపీవీవీపీ వైద్యుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.రోహిత్ తెలిపారు. వీరి సమ్మెకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయించామన్నారు. తదుపరి కార్యాచరణపై జేఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంసీజనల్ వ్యాధుల కట్టడిలో పీహెచ్సీ వైద్యులదే కీలక పాత్ర. తమ పరిధిలో జ్వరాలు, ఇతర కేసుల నమోదును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధులు వ్యాప్తిచెందకుండా నియంత్రణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం ముసురుపట్టింది. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యుల సమస్య పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పీజీ ఇన్–సర్విస్ కోటా కుదింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫలితం లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లడానికి వెనుకాడబోమని పది రోజుల క్రితమే నోటీస్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయిలో సమ్మెబాట పట్టారు. -
విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న అటవీ ఉద్యోగులు
-
జస్టిస్ తాహిల్‌కు అనూహ్య మద్దతు
చెన్నై: మేఘాలయ హైకోర్టుకు బదిలీకి నిరసనగా రాజీనామా చేసిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ కమలేష్ తాహిల్ రమణి తన సహచరుల నుంచి భారీ మద్దతులభిస్తోంది. ఆమె బదిలీని వ్యతిరేకిస్తే వేలాది మంది న్యాయవాదులు పోరాటాన్ని చేపట్టారు. సోమవారం నాటి ఆందోళనకు కొనసాగించిన మద్రాస్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్‌కు చెందిన 18 వేల మంది న్యాయవాదులు మంగళవారం కూడా కోర్టు విధులను బహిష్కరించారు. ప్రభుత్వ న్యాయవాదులు మాత్రమే విధులకు హాజరయ్యారు. జస్టిజ్ వీకే తాహిల్ రమణి బదిలీని ఖండిస్తూ సోమవారం మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టున్యాయవాదులు భోజన విరామ సమయంలో కోర్టు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆమె రాజీనామాను ఉపసంహరించుకోవాలని జస్టిస్ తాహిల్ రామణికి విజ్ఞప్తి చేయడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆమోదించిన సుప్రీంకోర్టు కొలీజియంకు అప్పీల్ చేయాలని న్యాయవాదులు భావిస్తున్నారు. మంగళవారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నామని ప్రకటించారు. మరోవైపు తాహిల్ రమణిని ఆమె నివాసంలో కలుసుకున్న తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. ఆమె బదిలీ అప్రజాస్వామికమనీ, ఇది న్యాయమూర్తుల స్వాతంత్ర్యాన్ని, కేసులపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుందని అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి మోహనకృష్ణన్ ఆరోపించారు. కాగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తనను ఆకస్మికంగా మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ఉపసంహరించాలని జస్టిస్ తాహిల్ సుప్రీంకోర్టు కొలీజియంకు ఇదివరకే ఆమె చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది ఆగస్టు 8న ఆమె నియమితులయ్యారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రుల పక్షపాతిగా మారారని ఆరోపిస్తూ శుక్రవారం జిల్లాలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రు ఉద్యోగుల సభకు సీఎం అనుమతించి, తెలంగాణ వాదుల సద్భావన ర్యాలీకి అనుమతి నిరాకరించడాన్ని సంగారెడ్డి బార్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఈ సందర్భంగా ముందుగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి కోర్టు ఎదుట సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం ఏనాడు జేఏసీ సభలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సీమా ంధ్ర ఉద్యోగుల సభకు అనుమతించడం ద్వారా తాను సమైక్య వాదనని నిరూపించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీరన్న పాటిల్, నాయకులు జైపాల్‌రెడ్డి, గుండేరావు, మల్లయ్య, రామకృష్ణారెడ్డి, మాణిక్‌రెడ్డి, రవి, రవీందర్, సదానందం, బాలరాజు, జే రాంరెడ్డి, ఫరీద్‌ఖాన్, అమర్నాథ్, బుచ్చయ్య, విశ్వనాథం పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు సీఎం కిరణ్ సమైక్యవాదిగా వ్యవహరిస్తున్నార ని ఆరోపిస్తూ జోగిపేట బార్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీజేఆర్ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగా ణ ఉద్యమ సభలకు ఏనాడూ అనుమతులు ఇ వ్వని సీఎం ఇప్పుడు సీమాంధ్ర సభకు అనుమతించటం అన్యాయమని బార్ అసోసియేషన్ సమైక్య ఉద్యమాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెర వెనక నడిపిస్తున్నారని ఆరోపించారు. కా ర్యక్రమంలో సీనియర్ న్యాయవాది కృష్ణారెడ్డి, న్యాయవాదులు ప్రదీప్‌కుమార్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల వైఖరి సరికాదు జహీరాబాద్ టౌన్ : హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదుల పట్ల పోలీసులు అనుసరించిన వైఖరికి నిరసనగా న్యాయవాదులు విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టౌన్ ఎస్ఐ శివలింగం రాస్తారోకో చేస్తున్న న్యాయవాదుల తో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగప్ప పాటిల్, మాజీ అధ్యక్షుడు పాండు రం గారెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దత్తారెడ్డి, న్యాయవాదులు సయ్యద్ అహ్మద్, జుబేర్ అహ్మద్, మహదేవ్, మాణిక్ పటేల్, జగన్నాథ్, శ్రీనివాస్ఖన్నా, రామకృష్ణ జోషి, సాల్మన్, అం జయ్య, అబ్దుల్ సమీ, చంద్రశేఖర్ పాటిల్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్‌బాబు, న్యాయవాదులు రవీందర్, పవన్‌కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపల్ కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రావు నేతృత్వంలో వి దులు బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యా యవాదులు తెలంగాణ నినాదాలు చేశారు. కా ర్యక్రమంలో న్యాయవాదులు శివకుమార్, అశోక్‌రెడ్డి, బాలముకుందరెడ్డి పాల్గొన్నారు. మెదక్ టౌన్ : హైదరాబాద్‌లోని హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులపై సీమాంధ్ర న్యా యవాదులు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీని యర్ న్యాయవాది పోచయ్య మాట్లాడుతూ తెలంగాణలోని అంతర్భాగమైన హైదరాబాద్‌లో సీమా ంధ్ర న్యాయవాదులు తెలంగాణ న్యాయవాదులపై దాడి చేయడం హేయమన్నారు. న్యాయవాద జేఏసీ నాయకులు బాలయ్య, చంద్రారెడ్డి, సంతోష్‌రెడ్డి, సుభాష్‌గౌడ్, వినోద్, రాములు, జగదీశ్వర్ తదితరులు ఉన్నారు. శాంతియాత్రికు అనుమతి ఇవ్వకపోవడం దారుణం నర్సాపూర్ : సీఎం వైఖరికి నిరసనగా స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం వి ధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తెలంగాణ జేఏసీ చేపట్టిన శాంతియాత్రకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా విధులు బహిష్కరించినట్లు చెప్పారు. కాగా శుక్రవారం హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడిని వారు ఈ సందర్భంగా ఖండించారు. శనివారం చేపట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.


