breaking news
both sides
-
ఢాంకాన్‌పల్లెలో ఉద్రిక్తత
ఖాజీపేట : ఢాంఖాన్‌పల్లెలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల వారి రాళ్లు, గాజుసీసాల దాడులతో గ్రామం దద్దరిల్లింది. చివరకు రెండు వర్గాలకు చెందిన వారు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఢాంఖాన్‌పల్లెలో గంగినాయుడు, గంగయ్య రెండు గ్రూపులుగా ఉన్నారు. వారికి కొంత కాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. పెద్ద గంగమ్మ ఆలయం విషయంలో తీవ్ర రూపం దాల్చాయి. బోనాల జాతర జరిగే విషయమై గ్రామస్తుల మధ్య మూడు వారాల కిందట చర్చ జరిగింది. ముందు గ్రామంలోని వారు ఎవరు వస్తే వారు గంగమ్మకు బోనాలు పెట్టుకోవచ్చని గంగినాయుడు వర్గం వాదించింది. కొంత కాలంగా తామే మొదటి సారిగా బోనాలు పెడుతున్నామని, ఇది ఆనవాయితీగా వస్తోందని, తరువాత ఎవరైనా పెట్టుకోవచ్చునని గంగయ్య వర్గం వారు వాదించారు. గంగమ్మ వద్ద మీ పెత్తనం ఏమిటంటూ ఇరు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. చిన్న పాటి గొడవ జరిగింది. వెంటనే మైదుకూరు రూరల్ సీఐ హనుమంతునాయక్ జోక్యం చేసుకుని పరిస్థితి సర్దుబాటు చేశారు. జాతరను ప్రశాంతంగా చేసుకోవాలని సీఐ చెప్పారు. బోనాలు ఇంటి వద్దనే పెట్టుకుని, ఆలయంలో పూజారి ద్వారా అమ్మవారికి పూజలు చేసి వెళ్లాలి, ఎవరూ ఆలయం వద్ద బోనాలు పెట్టవద్దని ఆయన సూచించారు. దీంతో గ్రామంలో జాతర జరగలేదు. దారి విషయమై గొడవ ఇరు వర్గాల వారు అన్మదమ్ములే కావడంతో.. ఇరువురి మధ్య రహదారిలో రాకపోకల సమస్య కొత్తగా బయటకు వచ్చింది. సర్వే నంబర్ 236లో 1.08 సెంట్ల స్థలం పూర్వం ముగ్గురు పెద్దలకు భాగాలు ఉన్నాయి. తర్వాత వారి పిల్లలు సుమారు 58 సెంట్లçను భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాజాగా దారి విషయం అంటూ శనివారం రాత్రి గొడవకు దిగారు. ఇరు వర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. బీరుబాటిళ్లలో పెట్రోలు పోసి దాడులకు పాల్పడ్డారు. గాజుసీసాలను వేసుకున్నారు. ఇళ్ల అద్దాలు పగులగొట్టుకున్నారు. ఈలలు, కేకలతో గ్రామం దద్దరిల్లింది. చుట్టుపక్కల వారు ఏం జరుగుతోందో అనే ఆందోళనతో ఇంటికి తాళాలు వేసుకుని లోపల బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటకు పైగా ఘర్షణ జరిగింది. పోలీసుల పహారా గొడవపై గ్రామస్తులు ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్టేషన్లో ఎవరూ లేకపోవడం.. అంతా బి.మఠంలో ప్రత్యేక బందోబస్తుకు వెళ్లడంతో సమయానికి పోలీసులు రాలేకపోయారు. వెంటనే స్పందించిన మైదుకూరు రూరల్ సీఐ హనుమంతునాయక్ ఉన్న కొద్ది మందితో అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ వెంటేశ్వర్లు వచ్చి ఆందోళనకారులను తరిమివేసి గ్రామం మొత్తం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు మొత్తం 50 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన అనీల్‌కుమార్, రాముడు, సింగరయ్య రెడ్డయ్య, వెంకటేష్, రామయ్య, పొట్టిరామయ్య, గంగయ్య, గంగామోహన్, కృష్ణయ్యకు గాయాలు కాగా.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
భూ వివాదంతో ఇరువర్గాలు ఘర్షణ
-
గొట్టిపాటి వర్సెస్ కరణం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : – కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరువర్గాలు –ఉద్రిక్తతకు దారితీసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం – షామియానాలు వేయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి –వాటిని కూల్చివేయించిన మాజీ ఎంపీ కరణం – వందలాదిగా పోలీసు బలగాల మోహరింపు – ఆధిపత్య పోరుకు వేదికగా మారిన ఎంపీడీవో కార్యాలయం – బెంబేలెత్తిన బల్లికురవ ప్రజలు – ఉదయం నుంచే వాణిజ్యసముదాయాలు మూత అద్దంకి టీడీపీలో వర్గవిబేధాలు మరోమారు భగ్గుమన్నాయి. కరణం, గొట్టిపాటి వర్గాలు సై అంటే సై అంటున్నాయి. అదును దొరికితే కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో తర చూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా బుధవారం మండల కేంద్రం బల్లికురవ వేదికగా వీరిరువురూ గొడవకు సిద్ధపడ్డారు. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయి దుకాణాలు సైతం మూసి వేయడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఎట్టకేలకు గొడవ సద్దుమణిగింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గాలు పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదికగా గొడవకు దిగారు. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి 2,600 పైచిలుకు పింఛన్లు కావాలంటూ ఎమ్మెల్యే గొట్టిపాటి చినబాబు లోకేష్ కు విన్నవించగా మూడు వేల పింఛన్లు కావాలంటూ ఇదివరకే కరణం సైతం దరఖాస్తులు పెట్టారు. తాజాగా 2,800 ఫించన్లు నియోజకవర్గానికి మంజూరయ్యాయి. పింఛన్లు తానే మంజూరు చేయించానని చెప్పిన గొట్టిపాటి బుధవారం బల్లికురవ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కార్యాలయ ఆవరణలో షామియానాలు వేశారు. విషయం తెలుసుకున్న కరణం, ఆయన తనయుడు వెంకటేశ్‌లు ఉదయం 10 గంటలకే బల్లికురవ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. షామియానాలు ఎందుకేశారంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. తనకు తెలియదంటూ ఎంపీడీవో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే పింఛన్లు పంచుతున్నారంటూ కరణం వర్గీయుల ఆయన దృష్టికి తెచ్చారు. పింఛన్లు తాను కూడా మంజూరు చేయించానని, అధికారులు పంపిణీ చేయాలి కానీ ఎమ్మెల్యే పంపిణీ చేయడమేంటంటూ ఆగ్రహించిన కరణం షామినాయాలు తీసివేయాలంటూ ఆదేశించారు. అంతే అక్కడున్న ఆయన వర్గీయులు షామియాయాలు పీకివేశారు. అనంతరం నాగార్జున సాగర్ నీటి విడుదల నేపథ్యంలో నీటి వాడకంపై కరణం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష ప్రారంభించారు. అడకత్తెరలో అధికారి.. పింఛన్లు పంపిణీ చేసేందుకు 10.30 గంటల సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి బల్లికురవ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే షామియానాలు కింద పడవేసి ఉండటంతో విషయం ఆరా తీశారు. కరణం వర్గీయులు పీకివేశారంటూ తెలిసి, ఆగ్రహించిన ఆయన ఎంపీడీఓకు ఫోన్ చేసి షామియానాలు ఎందుకు పీకివేశారంటూ ప్రశ్నించారు. ఎంపీడీఓ తనకు తెలియదని చెప్పాడు. పింఛన్లు పంపిణీ చేద్దామని ఎమ్మెల్యే కోరగా తనను వదిలివేయాలంటూ ఓ మొక్కు మొక్కి కార్యాలయంలో జరుగుతున్న కరణం సమీక్షకు హాజరయ్యారు. అప్పటికే అక్కడ వెయ్యి మందికిపైగా కరణం వర్గీయులు ఉండగా, గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున పోగయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. బల్లికురవలో కర్ఫ్యూ వాతావరణం.. నేతల మధ్య గొడవ చూసి బెంబేలెత్తిపోయిన బల్లికురవ వాసులు ఉదయం నుంచే వాణిజ్యసముదాయాలు మూసివేశారు. దీంతో బల్లికురవ బంద్‌ను తలపించింది. అటు కరణం, ఇటు గొట్టిపాటిలు బల్లికురవ వస్తుండటంతో ముందే జాగ్రత్తపడ్డ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు, దర్శి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రీరాంబాబుల నేతృత్వంలో ఒంగోలు, దర్శి, అద్దంకి సీఐలు, ఎస్ఐలతో పాటు 200 మందికిపైగా పోలీస్ బలగాలు బల్లికురవలో మోహరించాయి. పారీ నేతలకు గొట్టిపాటి ఫిర్యాదు.. తన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన గొట్టిపాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, చినబాబు లోకేష్, నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గొడవకు దిగకుండా సర్దుకుపోవాలని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చినబాబు లోకేష్‌తో పాటు మిగిలిన నేతలు గొట్టిపాటికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే గొట్టిపాటి ఓ ఐదు మందికి తన సొంత డబ్బులు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కరణం ఒంటి గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొట్టిపాటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కరణం అక్కడే మకాం వేసి అధికారులతో సమీక్షను మొదలుపెట్టారన్న ప్రచారం సాగిం ది. ఎట్టకేలకు పోలీస్ బలగాల మోహరింపుతో గొడవ సద్దుమణగడంతో బల్లికురవ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
గోదావరిఖనిలో రెండు వర్గాల పరస్పర దాడులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాల వారు కత్తులు మారాణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమం ఉంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.